అన్వేషించండి

Bhatti Vikramarka: 'ధరణి' కొందరికే ఆభరణం, చాలా మందికి భారం' - అసెంబ్లీలో ఆర్థిక మంత్రి భట్టి కీలక వ్యాఖ్యలు

Telangana Budget 2024: గత పదేళ్లలో చోటు చేసుకున్న తప్పులను సరిదిద్దుతామని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ధరణి పోర్టల్ పై విమర్శలు గుప్పించారు.

Bhatti Comments on Dharani Portal in Assembly: బీఆర్ఎస్ హయాంలో తీసుకువచ్చిన 'ధరణి' (Dharani) పోర్టల్ పై ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తన బడ్జెట్ ప్రసంగంలో విమర్శలు గుప్పించారు. 'ధరణి' కొందరికి భరణం.. మరికొందరికి ఆభరణం.. చాలా మందికి భారంగా మారిందని అన్నారు. రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వంలో అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని.. రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనకు సత్వర చర్యలు చేపడతామని వెల్లడించారు. ధరణి పోర్టల్ సమస్యల అధ్యయనానికి ఇప్పటికే ఓ కమిటీ వేశామని గుర్తు చేశారు. హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్రాన్ని 3 జోన్లుగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. ఓఆర్ఆర్ లోపల అర్బన్ జోన్ గా, ఓఆర్ఆర్ - ఆర్ఆర్ఆర్ మధ్య పెరి అర్బన్ జోన్, ఆర్ఆర్ఆర్ అవతలి ప్రాంతాన్ని గ్రామీణ జోన్ గా ఏర్పాటు చేస్తామన్నారు. 

'ఆ తప్పులు సరిదిద్దుతాం'

గ్రామీణాభివృద్ధిలో పదేళ్లలో చోటు చేసుకున్న తప్పులను సరిదిద్దుతామని మంత్రి భట్టి తెలిపారు. మిషన్ భగీరథ కోసం రూ.35,752 కోట్లు ఖర్చు చేసినట్లు గత ప్రభుత్వం చెప్పిందని.. అంత ఖర్చు చేసినా ఇప్పటికీ సురక్షిత తాగు నీరు లేని గ్రామాలెన్నో ఉన్నాయని అన్నారు. 'గత ప్రభుత్వ హయాంలో రైతు బంధు పథకం కింద అనర్హులే ఎక్కువ లబ్ధి పొందారు. వీటి నిబంధనలు పునఃసమీక్ష చేస్తాం. స్థానిక సంస్థలకు హక్కులను తిరిగి అందిస్తాం. అన్ని పాఠశాలల్లోనూ డిజిటల్ క్లాస్ రూంలు ఏర్పాటు చేస్తాం. నీటి పారుదల రంగంలో సమస్యలు అధిగమిస్తాం. నిపుణుల సలహాలను గత ప్రభుత్వం పట్టించుకోలేదు. కాంట్రాక్టుల కోసం ప్రాజెక్టులు నిర్మించే విధానం శాపంగా మారింది. సాగునీటి ప్రాజెక్టుల్లో అవకతవకలపై విచారణకు కార్యాచరణ ప్రకటిస్తాం.' అని పేర్కొన్నారు. 

'వాస్తవానికి దగ్గరగా'

వాస్తవానికి దగ్గరగా రాబడులు అంచనా వేసి అందుకు అనుగుణంగానే ఈ బడ్జెట్ లో పథకాలకు కేటాయింపులు చేశామని భట్టి తెలిపారు. 'గత ప్రభుత్వ హయాంలో మహిళలకు రూ.7,848 కోట్ల బడ్జెట్ పెట్టి కేవలం రూ.2,685 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో, రాష్ట్ర స్థూల ఉత్పత్తి (GSDP) ప్రస్తుత ధరల్లో గతేడాదితో పోలిస్తే రూ.13,02,371 కోట్ల నుంచి రూ.14,49,708 కోట్లకు పెరిగింది. ఆర్ధిక వృద్ధి రేటు అదే కాలంలో 14.7 శాతం నుంచి 11.3 శాతానికి క్షీణించింది. అధిక ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ 5వ స్థానంలో ఉంది.' అని వివరించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రగతి భవన్ ను మహాత్మాజ్యోతిబాపూలే భవన్ గా మార్చి ప్రజా పరిపాలనకి శుభారంభం చేశామన్నారు. ప్రతివారం రెండు రోజుల్లో ప్రజావాణి నిర్వహిస్తూ, ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకొంటున్నామని చెప్పారు. ఈ 2 నెలల్లో 43,054 ధరఖాస్తులు వస్తే, వాటిలో 14,951 ఇండ్ల కొరకు, 8,927 భూ సమస్యల గురించి, 3,267 పెన్షన్ల గురించి, 3,134 ఉద్యోగ కల్పన గురించి వచ్చినట్లు వెల్లడించారు. అన్నీ సమస్యలు పరిష్కరించేలా చిత్తశుద్ధితో పాలన సాగిస్తున్నట్లు స్పష్టం చేశారు.

Also Read: Telangana Budget 2024-25: 'త్వరలోనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ' - కౌలు రైతులకూ గుడ్ న్యూస్, మహిళలు, నిరుద్యోగులకు ఆర్థిక మంత్రి వరాలు

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget