అన్వేషించండి

Kaleshwaram ED case: కాళేశ్వరం ఇంజినీర్ల అవినీతి కేసులపై ఈడీ నజర్ - మనీలాండరింగ్‌పై కేసులు పెట్టే చాన్స్

ED Case: కాళేశ్వరం ఇంజనీర్ల అవినీతిపై ఈడీ కేసులు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ధనాన్ని సొంత కంపెనీల్లో పెట్టుబడులుగా మళ్లించడం, విదేశాల్లో డెస్టినేషన్ మ్యారేజ్ లు నిర్వహించడంపై ఈడీ ఆరా తీస్తోంది.

ED filing cases against Kaleshwaram engineers for corruption: కాళేశ్వరం అవినీతి ఇంజనీర్ల వ్యవహారంలో ఈడీ రంగంలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది.  ప్రభుత్వ ధనాన్ని సొంత కంపెనీల్లో పెట్టుబడులుగా మళ్లించడం, విదేశాల్లో  పెళ్లిళ్లు నిర్వహించడంపై ఇప్పటికే వివరాలు సేకరించింది. మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు కొడుకు అభిషేక్ రావు కంపెనీల్లో పెట్టుబడులు పెద్ద ఎత్తున వచ్చాయి. ఈ పెట్టుబడులపై ఈడీ విచారణ నిరవహించనుంది.  కాళేశ్వరం EE నూనె శ్రీధర్ కొడుకు పెళ్లి థాయ్‌ ల్యాండ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగింది. ఇందు కోసం పెద్ద ఎత్తున ఖర్చు పెట్టారు.  ఆ ఖర్చులపై విచారణ చేపట్టనుంది. అలాగే మొదటిసారి కాళేశ్వరం వ్యవహారంలో ఇంజనీర్ల అవినీతితో పాటు నగదు లావాదేవీలపైనా విచారణ జరిపే అవకాశం ఉంది.  నూనె శ్రీధర్, మురళీధర్ రావు, హరిరామ్ నాయక్‌ కు సంబంధించిన అవినీతి కేసు వివరాలు తమకు ఇవ్వాలని ఏసీబీని ఈడీ కోరింది. 

కాళేశ్వరం పనుల్ని చూసుకున్న ఇంజనీర్ ఇన్ చీఫ్  మురళీధర్ రావుపై ఏసీబీ గురి పెట్టింది. ఆయనకు సంబంధించిన పన్నెండు చోట్ల సోదాలు నిర్వహించి భారీగా ఆస్తులు గుర్తించింది.  కొండాపూర్‌లో ఒక విల్లా, బంజారాహిల్స్‌లో ఒక ఫ్లాట్,  యూసుఫ్‌గూడలో ఒక ఫ్లాట్, బేగంపేటలో ఒక ఫ్లాట్,  కోకాపేటలో ఖరీదైన ప్లాట్ ఉన్నాయి. మరో చోట పదకొండు ఎకరాలు ఉన్నాయి. ఇంకా బయటపడాల్సిన ఆస్తులు ఉన్నాయని చెబుతున్నారు.  మురళీధర్ రావును ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. రిమాండ్ కు పంపించారు. 

ఈ ఏడాది ఏప్రిల్ లో  మరో మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్ భూక్యా హరిరాం ఇంటితో సహా 14 ప్రాంతాలలో సోదాలు నిర్వహించింది.  ఆయన వద్ద కూడా తక్కువ దొరకలేదు.   షేక్‌పేట్  కొండాపూర్‌లో రెండు లగ్జరీ విల్లాలు,   శ్రీనగర్ కాలనీ, మాదాపూర్, నార్సింగిలో మూడు ఫ్లాట్లు,   అమరావతిలో వాణిజ్య స్థలం ,   సిద్దిపేట్ జిల్లా మర్కూక్ మండలంలో 28 ఎకరాల వ్యవసాయ భూమి,   పటాన్‌చెరులో 20 గుంటల భూమి,  శ్రీనగర్ కాలనీలో రెండిళ్లు,  బొమ్మలరామరం మండలంలో 6 ఎకరాల మామిడి తోటతో కూడిన ఫామ్‌హౌస్,  కొత్తగూడెంలో నిర్మాణంలో ఉన్న భవనం.. ఇంకా పలు రకాల   ఆస్తులు, బంగారాన్ని పట్టుకున్నారు.  హరిరామ్‌ను ఏసీబీ అరెస్టు చేసి జైలుకు పంపారు. 
  
జూన్ లో  కాళేశ్వరం నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ఇంజినీర్ నూనె శ్రీధర్ ఇంటిపైనా దాడులు చేశారు.   నూనె శ్రీధర్ ఇంటితో సహా 14 ప్రాంతాలలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాలలో  రూ. 60 కోట్ల   ఆస్తులు గుర్తించారు. ఇది ప్రభుత్వ రేటు..  బహిరంగ మార్కెట్ లో ఐదు వందల కోట్లకుపైగా విలువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

అవినీతిపై ఏసీబీ అధికారులు కేసులు నమోదు చేస్తారు. అయితే ఆ డబ్బుల్ని అనధికారికంగా ..  చట్ట విరుద్ధంగా చెలామణి చేయడంపై ఈడీ దృష్టి పెడుతుంది. విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగులు.. బ్లాక్ మనీని వైట్ చేయడం కోసం కంపెనీలు పెట్టినట్లుగా గుర్తించడంతో ఈడీ రంగంలోకి దిగుతోంది.          

టాప్ హెడ్ లైన్స్

Transgender Co-option Members: తెలంగాణ చారిత్రాత్మక నిర్ణయం - 9 మున్సిపల్ కార్పొరేషన్లలో ట్రాన్స్‌జెండర్లకు కో-ఆప్షన్ పదవులు! మార్పు వస్తుందా?
తెలంగాణ చారిత్రాత్మక నిర్ణయం - 9 మున్సిపల్ కార్పొరేషన్లలో ట్రాన్స్‌జెండర్లకు కో-ఆప్షన్ పదవులు! మార్పు వస్తుందా?
Saifabad పీఎస్‌లో పీఏ, పీఆర్వోలపై దాడిపై కేటీఆర్ మండిపాటు.. నిజం కాదన్న ఖైరతాబాద్ జోన్ డిసిపి శిల్పవల్లి
పీఎస్‌లో పీఏ, పీఆర్వోలపై దాడిపై కేటీఆర్ మండిపాటు.. నిజం కాదన్న ఖైరతాబాద్ జోన్ డిసిపి శిల్పవల్లి
Danam Nagender BRS re entry: దానం నాగేందర్ బిగ్ ట్విస్ట్! కాంగ్రెస్‌పై అసంతృప్తి.. మళ్లీ బీఆర్ఎస్ గూటికి ఖైరతాబాద్ ఎమ్మెల్యే?
దానం నాగేందర్ బిగ్ ట్విస్ట్! కాంగ్రెస్‌పై అసంతృప్తి.. మళ్లీ బీఆర్ఎస్ గూటికి ఖైరతాబాద్ ఎమ్మెల్యే?
Telangana Nominated Posts: ఈ నెలాఖరులోగా నామినేటెడ్ పదవుల భర్తీ! గేమ్ ఛేంజర్‌గా మారనున్న కులగణన జాబితా !
ఈ నెలాఖరులోగా నామినేటెడ్ పదవుల భర్తీ! గేమ్ ఛేంజర్‌గా మారనున్న కులగణన జాబితా !

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
APPSC Job Notifications: ఏపీపీఎస్సీ జాబ్ నోటిఫికేషన్లు విడుదల.. 20 శాఖలకు సంబంధించి పోస్టులు భర్తీ
ఏపీపీఎస్సీ జాబ్ నోటిఫికేషన్లు విడుదల.. 20 శాఖలకు సంబంధించి పోస్టులు భర్తీ
Transgender Co-option Members: తెలంగాణ చారిత్రాత్మక నిర్ణయం - 9 మున్సిపల్ కార్పొరేషన్లలో ట్రాన్స్‌జెండర్లకు కో-ఆప్షన్ పదవులు! మార్పు వస్తుందా?
తెలంగాణ చారిత్రాత్మక నిర్ణయం - 9 మున్సిపల్ కార్పొరేషన్లలో ట్రాన్స్‌జెండర్లకు కో-ఆప్షన్ పదవులు! మార్పు వస్తుందా?
IND VS AFG Series Deciding Clash: సిరీస్ పై క‌న్నేసిన టీమ్ ఇండియా.. ఓపెనర్ల రేసులో వైభవ్ ఎంట్రీపై సస్పెన్స్, సంజూ కి చివరి ఛాన్స్..?
సిరీస్ పై క‌న్నేసిన టీమ్ ఇండియా.. ఓపెనర్ల రేసులో వైభవ్ ఎంట్రీపై సస్పెన్స్, సంజూ కి చివరి ఛాన్స్..?
మొబైల్ సిమ్ పోర్టింగ్ తరహాలో FASTagకూ పోర్టింగ్.. స్టిక్కర్‌ మార్చకుండానే బ్యాంక్‌ను ఎలా మార్చుకోవాలంటే?
FASTag బ్యాంక్ మీకు నచ్చలేదా? ఇక స్టిక్కర్ మార్చే పని లేకుండానే బ్యాంక్‌ను మార్చేయొచ్చు
Jai Jai Ram Song: రామాయణ నుంచి 'జయ జయ రామ్' సాంగ్ రిలీజ్... లిరికల్ వీడియో ఎలా ఉందో చూశారా?
రామాయణ నుంచి 'జయ జయ రామ్' సాంగ్ రిలీజ్... లిరికల్ వీడియో ఎలా ఉందో చూశారా?
Trophy Celebrations Viral Video: పాక్ బోర్డు చీఫ్‌కు మరోసారి టీమ్ ఇండియా షాక్.. వాటర్ బాటిల్‌తో హర్మన్‌ప్రీత్ సేన వినూత్న సంబరాలు
పాక్ బోర్డు చీఫ్‌కు మరోసారి టీమ్ ఇండియా షాక్.. వాటర్ బాటిల్‌తో హర్మన్‌ప్రీత్ సేన వినూత్న సంబరాలు
AP Recruitment Age Limit: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నాన్-యూనిఫాం పోస్టులకు ఏజ్ లిమిట్ పెంపు
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నాన్-యూనిఫాం పోస్టులకు ఏజ్ లిమిట్ పెంపు
ఆరోగ్యం, పవిత్రత: ఎండిన తులసితో ధూపం, తీర్థం తయారు చేసే విధానం!
ఆరోగ్యం, పవిత్రత: ఎండిన తులసితో ధూపం, తీర్థం తయారు చేసే విధానం!
Embed widget