News
News
X

Earthquake: నాగర్ కర్నూలు జిల్లాలో స్వల్ప భూకంపం…ఈ మధ్య పలు రాష్ట్రాలను వణికించిన భూప్రంకంపనలు

ఈ మధ్య దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో వరుస భూకంపాలు సంభవించాయి. ఇటీవల ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్ సహా పలు రాష్ట్రాలను భూకంపం వణికించింది. తాజాగా తెలంగాణలోనూ భూకంపం ప్రజల్ని భయాందోళనకు గురిచేసింది.

FOLLOW US: 

తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూల్ జిల్లాలో భూ కంపం వచ్చింది. జిల్లాలోని అచ్చంపేట, లింగాల పరిసర గ్రామాలు, అమ్రాబాద్‌, ఉప్పునూత మండలాల్లో సోమవారం ఉదయం 5 గంటలకు రెండు సెకన్ల పాటు భూమి కంపించింది.

దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 4.0గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (ఎన్‌సీఎస్‌) వెల్లడించింది.

హైదరాబాద్‌కు దక్షిణంగా 150 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని తెలిపింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు వచ్చాయని పేర్కొన్నది. భూ ప్రకంపనలతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ప్రాధమిక నిర్థారణ. తక్కువ తీవ్రతతో రావడం వల్ల ఆస్తి నష్టం కూడా పెద్దగా జరిగి ఉండకపోవచ్చంటున్నారు అధికారులు.

రెండు రోజుల క్రితం చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో అర్థరాత్రి భూకంపం రావడంతో జనం భయంతో ఇళ్లనుంచి పరుగులు తీశారు. స్థానిక ఈడిగపల్లె, చిలకవారిపల్లి, షికారిపాళ్యం, కోటగడ్డలో 6 సెకన్ల పాటు భూమి కంపించింది. పెద్ద పెద్ద శబ్దాలు రావడం, మంచాలు, సామాన్లు కదలడంతో ఏం జరుగుతోందో అర్థంకాక కొద్దిసేపు భయాందోళనకు గురయ్యారు.

గతం వారంలో రాజస్థాన్ రాష్ట్రంలో పలు చోట్ల భారీ భూకంపం సంభవించింది. బికానెర్‌తో పాటు. రెండు రోజుల వ్యవధిలో బికానెర్‌ ప్రాంతంలో భూప్రకంపనలు రావడంతో వణికిపోతున్నారు. ఈ భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 4.8గా నమోదైనట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ వెల్లడించింది. పెద్ద శబ్దాలతో భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇలా వరుసగా రెండుసార్లు ప్రకంపనలు రావడంతో వణికిపోతున్నారు.ఢిల్లీ, పంజాబ్ లోనూ ఈ మధ్య భూప్రకంపనలు వచ్చాయి. అయితే ఇతర దేశాల్లో వచ్చే భూకంపాలతో పెద్ద ఎత్తున నష్టం ఉండగా, మన దేశంలో సంభవించే భూకంపాల వల్ల ప్రాణ, ఆస్తినష్టం ఉండటం లేదు. అయినా వరుస భూకంపాలు చోటు చేసుకోవడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే నమోదైన భూకంపాల వల్ల పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు.

ఎంత ధైర్యం చెప్పుకున్నప్పటికీ….భూకంపం వచ్చిందంటే చాలు వణికాల్సిందే. ప్రకృతి కన్ను తెరిచి విలయతాండవం చేస్తుంది. భూకంప ధాటికి క్షణాల్లోనే అల్లకల్లోలం అయిపోతుంది. భూకంపాలు రావడానికి శాస్త్రపరమైన కారణాలే కాక పర్యావరణానికి జరుగుతున్న అపార నష్టం కూడా చాలా కారణాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పెద్ద రిజర్వాయర్లలో నిల్వ ఉంచిన నీటి వల్ల, అపారమైన భూగర్భ జలాన్ని ఎక్కువ దుర్వినియోగం చేయడం ద్వారా, చెట్లను నరకడం వంటివి జరుగుతుండటంతో భూకంపాలు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని చెబుతున్నారు.

Published at : 26 Jul 2021 09:34 AM (IST) Tags: telangana delhi Earthquake strikes Nagar Kurnool district ీrajastan panjab

సంబంధిత కథనాలు

Petrol-Diesel Price, 12 August: ఈ నగరంలో నేడు బాగా పెరిగిన ఇంధన ధరలు, ఇక్కడ తగ్గుదల - మీ ప్రాంతంలో ఈరోజు ఇలా

Petrol-Diesel Price, 12 August: ఈ నగరంలో నేడు బాగా పెరిగిన ఇంధన ధరలు, ఇక్కడ తగ్గుదల - మీ ప్రాంతంలో ఈరోజు ఇలా

Weather Latest Update: ఇంకో అల్పపీడనం రేపు, తెలంగాణపై ఎఫెక్ట్ ఇలా! ఏపీలో వీరికి హెచ్చరిక: IMD

Weather Latest Update: ఇంకో అల్పపీడనం రేపు, తెలంగాణపై ఎఫెక్ట్ ఇలా! ఏపీలో వీరికి హెచ్చరిక: IMD

Gold-Silver Price: బంగారం కొంటున్నారా? ఇవాల్టి తాజా ధరలు ఇవిగో - నేడు కూడా పెరిగిన ప్లాటినం ధర

Gold-Silver Price: బంగారం కొంటున్నారా? ఇవాల్టి తాజా ధరలు ఇవిగో - నేడు కూడా పెరిగిన ప్లాటినం ధర

Telangana Cabinet : ఆగస్టు 15 నుంచి పది లక్షల మంది కొత్తగా సామాజిక పెన్షన్లు - తెలంగాణ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు !

Telangana Cabinet :  ఆగస్టు 15 నుంచి పది లక్షల మంది కొత్తగా సామాజిక పెన్షన్లు - తెలంగాణ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు !

Breaking News Live Telugu Updates: ఆగస్టు 15 నుంచి తెలంగాణలో పింఛన్ల జాతర- మరో పది లక్షలకు క్యాబినెట్ ఆమోదం

Breaking News Live Telugu Updates: ఆగస్టు 15 నుంచి తెలంగాణలో పింఛన్ల జాతర- మరో పది లక్షలకు క్యాబినెట్ ఆమోదం

టాప్ స్టోరీస్

Malik Review: మాలిక్ రివ్యూ: ఫహాద్ ఫాజిల్ గ్యాంగ్‌‌స్టర్ థ్రిల్లర్ ఆకట్టుకుంటుందా?

Malik Review: మాలిక్ రివ్యూ: ఫహాద్ ఫాజిల్ గ్యాంగ్‌‌స్టర్ థ్రిల్లర్ ఆకట్టుకుంటుందా?

కొణిదెల వారింట పెళ్లి సందడి - ఆ యాంకర్‌‌తో మెగా హీరో నిశ్చితార్థం!

కొణిదెల వారింట పెళ్లి సందడి - ఆ యాంకర్‌‌తో మెగా హీరో నిశ్చితార్థం!

టార్గెట్‌ లోకేష్ వ్యూహంలో వైఎస్‌ఆర్‌సీపీ విజయం సాధిస్తుందా?

టార్గెట్‌ లోకేష్ వ్యూహంలో వైఎస్‌ఆర్‌సీపీ విజయం సాధిస్తుందా?

TS EAMCET Results 2022 : రేపు తెలంగాణ ఎంసెట్,ఈసెట్ ఫలితాలు విడుదల

TS EAMCET Results 2022 : రేపు తెలంగాణ ఎంసెట్,ఈసెట్ ఫలితాలు విడుదల