Drugs in Telangana: డ్రగ్స్ పై పోలీసులు ఉక్కుపాదం! ఈ ఫోన్ నెంబర్ కు సమాచారం ఇస్తే చాలు
Telangana Drugs Cases: మీకు ఎక్కడైనా డ్రగ్స్ కనిపించినా, డ్రగ్స్ పై ఏమైనా సమాచారం తెలిస్తే 87126 71111కు కాల్ చేసి వివరాలు తెలపాలని సందీప్ శాండిల్య సూచించారు.
Hyderabad Drugs News: హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా అడుగులు వేస్తోంది. పబ్స్, బార్లపై స్పెషల్ ఫోకస్ చేసినట్లు టీఎస్ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలిపారు. డ్రగ్స్ కట్టడికి ప్రతి ఒక్కరూ పోరాటం చేయాలని, పిల్లల్ని, యువతని వీటి బారిన పడకుండా చూడాలని తల్లిదండ్రులకు ఆయన సూచించారు. మీ చుట్టుపక్కల ఎక్కడైనా డ్రగ్స్ కు సంబంధించిన ఆనవాళ్లు ఏం కనిపించినా తాము సూచించిన నెంబర్ కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. మీకు ఎక్కడైనా డ్రగ్స్ కనిపించినా, డ్రగ్స్ పై ఏమైనా సమాచారం తెలిస్తే 87126 71111కు కాల్ చేసి వివరాలు తెలపాలని సందీప్ శాండిల్య సూచించారు. స్కూళ్లు, కాలేజీలతో పాటు ఐటీ సెక్టార్, ఫిల్మ్ ఇండస్ట్రీ, రేవ్ పార్టీలు, రిసార్టులపై నార్కోటిక్ బ్యూరో స్పెషల్ ఫోకస్ చేస్తోందన్నారు.
పబ్బుల్లో డ్రగ్స్ విక్రయిస్తున్నారని ఆరోపణలు: హైదరాబాద్ సీపీ
తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతోంది. హైదరాబాద్ సీపీగా బాధ్యతలు స్వీకరించిన సమయంలోనే కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి డ్రగ్స్ పై ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు. డ్రగ్స్ విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇదివరకే వార్నింగ్ ఇచ్చారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. పబ్ లపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. నగరంలలో పబ్బులు సమయానికి మూసివేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. సమయం మించి పబ్ నడిచినట్లైతే చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. కొన్ని పబ్ లలో డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని.. నగరంలో డ్రగ్స్, గంజాయి లాంటి పదాలు వినిపించకుండా చేస్తామన్నారు. పబ్బుల్లో డ్రగ్స్ కట్టడికి నిరంతరంగా నిఘా పెట్టాలన్నారు.
డ్రగ్స్ కేసులలో ఒకరికి శిక్ష పడితే నేరం చేయాలనుకునే మరో 100 మందిలో భయం మొదలవుతుంది అన్నారు. ఆదివారం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఉన్నతాధికారులు, ఇన్ స్పెక్టర్లతో సీపీ శ్రీనివాసరెడ్డి సమావేశమయ్యారు. ఫిర్యాదులపై పారదర్శకంగా వ్యవహరించాలని, పీఎస్ కు వచ్చే వారితో మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. హైదరాబాద్ లో డ్రగ్స్ మహమ్మారికి అడ్డుకట్ట వేయాలన్నారు. సైబర్ నేరాల దర్యాప్తులో దేశంలోనే నగరం మొదటి స్థానంలో ఉందన్నారు. మెరుగైన టెక్నాలజీ వినియోగించి డ్రగ్స్ ను అరికట్టాలని పోలీసులకు సూచించారు. అనుమానం ఉన్న వారి శాంపిల్స్ సేకరించి పరీక్షలు చేపించాలన్నారు.
Also Read: ఈ 21న కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి కాన్ఫరెన్స్, చర్చించే కీలక అంశాలివే!