News
News
వీడియోలు ఆటలు
X

Panchayat Awards : జాతీయ స్థాయిలో సత్తా చాటిన తెలంగాణ పల్లెలు, 13 అవార్డులు సొంతం

Panchayat Awards : జాతీయ స్థాయిలో తెలంగాణ పల్లెల సత్తా చాటి, 13 అవార్డులు సొంతం చేసుకున్నాయి. దిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయా గ్రామాల సర్పంచ్‌లు అవార్డులు అందుకున్నారు.

FOLLOW US: 
Share:

Panchayat Awards  : జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని దిల్లీలోని విజ్ఞాన భవన్ లో పంచాయత్ అవార్డుల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన గ్రామ పంచాయతీలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులు అందజేశారు. కేంద్రం ప్రకటించిన మొత్తం 46 జాతీయ అవార్డుల్లో 13 అవార్డులు తెలంగాణ గెలుచుకుంది. ఈ అవార్డులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆయా గ్రామాల సర్పంచ్ లు, ఎంపీపీలు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, అధికారులు స్వీకరించారు. 

తెలంగాణ గ్రామాలకు అవార్డుల పంట 

జాతీయ స్థాయిలో మరోసారి తెలంగాణ గ్రామాలు అత్యుత్తమంగా నిలిచాయి. కేంద్రం ప్రకటించిన మొత్తం 46 జాతీయ అవార్డుల్లో 13 అవార్డులు తెలంగాణ గ్రామాలు గెలుచుకున్నాయి. 8 దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు, మరో 5 నానాజీ దేశ్ ముఖ్ సర్వోత్తమ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు తెలంగాణ గ్రామాలు అందుకున్నాయి. 9 కేటగిరీలలో అవార్డుల ఎంపిక జరగగా, 8 కేటగిరీ లలో అవార్డులు సాధించిన తెలంగాణను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందించారు. ఈ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆయా గ్రామాల సర్పంచ్ లు, ఎంపీపీలు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, అధికారులు సోమవారం దిల్లీలో అందుకున్నారు.  

దేశానికి ఆదర్శంగా తెలంగాణ 

ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ... తెలంగాణలో సీఎం కేసీఆర్ వల్ల జరుగుతున్న పల్లె ప్రగతి అభివృద్ధి కార్యక్రమాలను, అవి సాధించిన ఫలితాలను వివరించారు. దేశంలో తెలంగాణ మాత్రమే కేంద్ర ఆర్థిక సంఘం నిధులకు సమానంగా గ్రామాలకు ఇస్తుందన్నారు. పల్లెల్లో వినూత్నంగా సాధించిన ప్రగతిని మంత్రి తెలిపారు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు తీసుకోవడం పట్ల  ధన్యవాదాలు తెలిపారు. అవార్డులు అందుకున్న అధికారులు, ప్రజా ప్రతినిధులకు మంత్రి ఎర్రబెల్లి శుభాకాంక్షలు తెలిపారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని అభినందించారు. అవార్డులు ఇచ్చిన కేంద్రానికి, రావడానికి కారణమైన సీఎం కేసీఆర్, సహకరించిన మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులకు మంత్రి ఎర్రబెల్లి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆలోచ‌నా ప‌థంలో ప‌ని చేస్తూ, ఇదే స్ఫూర్తిని కొన‌సాగించాల‌న్నారు.  దేశానికి ఆద‌ర్శంగా తెలంగాణ‌ను నిల‌పాల‌న్నారు. అన్ని రంగాల్లో ఇప్పటికే అగ్రగామిగా ఉన్న తెలంగాణ‌ను మ‌రింత స‌మున్నతంగా తీర్చిదిద్దాల‌ని మంత్రి ఎర్రబెల్లి సూచించారు.

సీఎం కేసీఆర్ హర్షం 

 పచ్చదనం, పరిశుభ్రతతో పాటు పలు విభాగాల్లో తెలంగాణ పంచాయతీలు దేశంలోనే అత్యున్నత స్థాయిలో నిలిచి రాష్ట్రపతి చేతుల మీదుగా దిల్లీలో సోమవారం జాతీయ అవార్డులు అందుకోవడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మొత్తం 46 ఉత్తమ అవార్డుల్లో 13  అవార్డులను తెలంగాణ రాష్ట్రం కైవసం చేసుకోవడం మనందరికీ గర్వకారణమని  సీఎం అన్నారు.   దేశవ్యాప్తంగా 2.5 లక్షల గ్రామ పంచాయతీలు ఈ అవార్డుల కోసం పోటీ పడగా అందులో కేవలం 46 గ్రామాలు మాత్రమే అవార్డులు దక్కించుకున్నాయన్నారు. ఇందులోంచి 13 అవార్డులు తెలంగాణకే వచ్చాయన్నారు. మొత్తం జాతీయ అవార్డుల్లో 30 శాతం తెలంగాణ రాష్ట్రమే కైవసం చేసుకుందన్నారు. ఈ 13 ర్యాంకుల్లోంచి కూడా 4 ఫస్ట్ ర్యాంకులు తెలంగాణకే రావడం గొప్పవిషయమని సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

Published at : 17 Apr 2023 07:02 PM (IST) Tags: Errabelli TS News Delhi CM KCR Panchayat awards

సంబంధిత కథనాలు

Governor Tamilisai: మీడియేషన్ మెడిటేషన్ లాంటిది, వివాహ బంధాన్ని ఏకం చేయలేకపోతున్నారు - గవర్నర్

Governor Tamilisai: మీడియేషన్ మెడిటేషన్ లాంటిది, వివాహ బంధాన్ని ఏకం చేయలేకపోతున్నారు - గవర్నర్

Top 5 Headlines Today: టీడీపీ నేత ఆనం రమణారెడ్డిపై దాడి! మెట్రో రైలు కోసం మంత్రి కేటీఆర్‌కు వినతులు? టాప్ 5 హెడ్ లైన్స్

Top 5 Headlines Today: టీడీపీ నేత ఆనం రమణారెడ్డిపై దాడి! మెట్రో రైలు కోసం మంత్రి కేటీఆర్‌కు వినతులు? టాప్ 5 హెడ్ లైన్స్

TSPSC Group 1 Exam: 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌ హాల్‌‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! పరీక్ష వివరాలు ఇలా!

TSPSC Group 1 Exam: 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌ హాల్‌‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! పరీక్ష వివరాలు ఇలా!

Nizamabad News: న్యూజెర్సీలో నిజామాబాద్ యువకుడు సజీవదహనం, రోడ్డు ప్రమాదమే కారణం!

Nizamabad News: న్యూజెర్సీలో నిజామాబాద్ యువకుడు సజీవదహనం, రోడ్డు ప్రమాదమే కారణం!

Minister KTR: మెట్రో రైలు కోసం మంత్రి కేటీఆర్‌కు వినతులు - ప్రజల నుంచి మాత్రం కాదు

Minister KTR: మెట్రో రైలు కోసం మంత్రి కేటీఆర్‌కు వినతులు - ప్రజల నుంచి మాత్రం కాదు

టాప్ స్టోరీస్

Gudivada Amarnath: రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి గుడివాడ, మానవ తప్పిదమేనని వెల్లడి

Gudivada Amarnath: రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి గుడివాడ, మానవ తప్పిదమేనని వెల్లడి

TDP Leaders on YCP Govt: ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి అనాగరికం, అప్రజాస్వామికం: టీడీపీ నేతలు

TDP Leaders on YCP Govt: ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి అనాగరికం, అప్రజాస్వామికం: టీడీపీ నేతలు

Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?

Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?

Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్‌ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు

Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్‌ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు