News
News
X

Delhi Liquor Scam : హైదరాబాద్ కేంద్రంగానే దిల్లీ లిక్కర్ స్కామ్, సౌత్ గ్రూప్ కీలక వాటాదారు!

Delhi Liquor Scam : దిల్లీ లిక్కర్ స్కామ్ ప్లానింగ్ హైదరాబాద్ కేంద్రంగానే జరిగిందని ఈడీ తెలిపింది. సిసోడియా రిమాండ్ రిపోర్టులో సంచలనాలు బయటపెట్టింది.

FOLLOW US: 
Share:

Delhi Liquor Scam : దిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టైన ఆప్ నేత మనీశ్ సిసోడియాను ఈడీ కోర్టులో హాజరు పర్చింది. అయితే సిసోడియా రిమాండ్ రిపోర్టులో ఈడీ సంచలనాలు బయటపెట్టింది. హైదరాబాద్ కేంద్రంగానే దిల్లీ లిక్కర్ స్కామ్ జరిగిందని తెలిపింది. కొంతమంది వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చేలా నిపుణుల కమిటీ అభిప్రాయాలను అంగీకరించకుండా ఈ మద్యం విధానాన్ని రూపొందించారని ఈడీ కోర్టుకు తెలిపింది. ఈ కేసులో ఆప్ సీనియర్ నేత సిసోడియాకు వ్యతిరేకంగా తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఈడీ న్యాయవాది తెలిపారు. ఈ విధానంలో తాము ఎంపిక చేసిన హోల్‌సేల్ వ్యాపారులు 12 శాతం ప్రాపిట్ మార్జిన్‌ వచ్చే విధంగా పాలసీని రూపొందించినట్లు ఈడీ తెలిపింది. ఇది ఉండాల్సిన దానికంటే ఆరు శాతం ఎక్కువ ఉందని వెల్లడించింది.

సౌత్ గ్రూప్ కీలక వాటాదారు 

"మనీశ్ సిసోడియా ఆదేశాల ప్రకారమే ఇది జరిగిందని మా వద్ద సమాచారం ఉంది. మద్యం అమ్మకానికి లైసెన్స్ ఇవ్వడానికి నిర్ణయించిన వ్యవస్థను కూడా ఉల్లంఘించారు.  కొంతమంది ఎంపిక చేసిన వ్యక్తులు దాని నుంచి ప్రయోజనం పొందారు" అని ED తెలిపింది. తెలంగాణ ఎమ్మెల్సీ కె.కవితతో సహా సౌత్ గ్రూప్‌తో పాటు సిసోడియా సహాయకుడు విజయ్ నాయర్ మొత్తం కుట్రను సమన్వయం చేశారు, వ్యాపారవేత్త దినేష్ అరోరా కిక్‌బ్యాక్‌లను సమన్వయం చేస్తున్నారని ఈడీ కోర్టుకు తెలిపింది. దిల్లీలోని ఎక్సైజ్ వ్యాపారంలో సౌత్ గ్రూప్ వాటాదారుగా మారిందని ఈడీ పేర్కొంది.  కవిత మాజీ ఆడిటర్‌ గోరంట్ల బుచ్చిబాబు చెప్పిన ఆధారాలను ఈడీ రిమాండ్ రిపోర్టులో స్పష్టంచేసింది. సిసోడియా, కేసీఆర్ కుమార్తె కవిత మధ్య రాజకీయ అవగాహన ఉందని, ఆమె విజయ్ నాయర్‌ను కూడా కలిశారని ఈడీ వెల్లడించింది. ED న్యాయవాది వాదనలను సిసోడియా తరపు న్యాయవాదులు -- సీనియర్ న్యాయవాదులు దయన్ కృష్ణన్, మోహిత్ మాథుర్, సిద్ధార్థ్ అగర్వాల్ తిరస్కరించారు. ఎక్సైజ్‌ పాలసీని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆమోదించారని, ఆయన ఆమోదం తెలిపే ముందు తప్పనిసరిగా పరిశీలించి ఉంటారని సిసోడియా తరపు న్యాయవాదులు తెలిపారు. సిసోడియా తరపు న్యాయవాది మాట్లాడుతూ ఈడీ... వాదనలు చెడు ఉద్దేశంతో ఉన్నాయని అన్నారు. ఈ కేసులో గరిష్ఠ శిక్ష ఏడేళ్లు మాత్రమేనని, అందుకే బెయిల్ ఇవ్వాలని కస్టడీ విధించవద్దని కోరారు.  ఈ రోజుల్లో ఏజెన్సీలు అరెస్టులను హక్కుగా తీసుకోవడం ఫ్యాషన్‌గా మారిందని, ఈ హక్కుపై కోర్టులు ప్రశ్నించాల్సిన సమయం ఆసన్నమైందని సిసోడియా తరపు న్యాయవాది దయన్ కృష్ణ కోర్టులో పేర్కొన్నారు. సీబీఐ ఈ కేసులో  దర్యాప్తు చేస్తోంది. ఈడీ చెబుతున్న కేసు వాస్తవానికి సీబీఐ కేసు అని, మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ దర్యాప్తు చేస్తుందని  కృష్ణ అన్నారు.  

హైదరాబాద్ కేంద్రంగా దిల్లీ లిక్కర్ స్కామ్ 

దిల్లీ లిక్కర్ స్కామ్ లో సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి.  హైదరాబాద్ కేంద్రంగానే లిక్కర్ స్కామ్ జరిగిందని మనీశ్‌ సిసోడియా రిమాండ్ రిపోర్టులో ఈడీ పేర్కొంది. శుక్రవారం దిల్లీ కోర్టులో ఆప్ నేత సిసోడియాను ఈడీ అధికారులు  హాజరుపరిచారు. సిసోడియా రిమాండ్‌ రిపోర్టులో రాజకీయ, ఆర్థిక, నేరపూరిత వ్యవహారాలను ఈడీ బయటపెట్టడింది. లిక్కర్‌ స్కామ్‌ హైదరాబాద్‌ లోనే ప్లాన్ చేశారని తెలిపింది. దినేష్ అరోరాను సౌత్ గ్రూప్ హైదరాబాద్‌కు పిలిపించిందని, ఐటీసీ కోహినూర్‌లోనే కీలక చర్చలు జరిగాయని ఈడీ రిపోర్టులో పేర్కొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు, దిల్లీ సీఎం కేజ్రీవాల్, అప్పటి డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు ఈ విషయం తెలుసని, కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు చెప్పారని ఈడీ రిమాండ్ రిపోర్టులో వెల్లడించింది.  2021 మార్చి 19, 20 తేదీల్లో విజయ్‌నాయర్‌ని ఎమ్మెల్సీ కవిత కలిశారు. కేజ్రీవాల్‌, సిసోదియా తరఫున విజయ్‌నాయర్‌ పనిచేశారని బుచ్చిబాబు తెలిపారని ఈడీ రిపోర్టులో చెప్పింది. ఇండోస్పిరిట్‌ కంపెనీలో 32 శాతం వాటాను అరుణ్ పిళ్లై పేరుతో కవిత కలిగి ఉన్నారని, కవితకు అనుకూలంగా లిక్కర్ పాలసీలో మార్పులు చేస్తే కొంత అమౌంట్ ఆప్‌కు ఇచ్చేందుకు అవగాహన కుదిరిందన్నారు. ఈ విషయాన్ని బుచ్చిబాబు తన వాంగ్మూలంలో తెలిపారని ఈడీ వెల్లడించింది. 2021 జూన్‌లో హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్‌ హోటల్లో అరుణ్‌ పిళ్లై, అభిషేక్‌ బోయినపల్లి, విజయ్‌ నాయర్‌, దినేశ్‌ అరోరా భేటీ అయ్యారని చెప్పింది. రూ.100 కోట్ల ముడుపులు ఎలా ఇవ్వాలి, ఎలా దిల్లీకి తరలించాలనే అంశాలపై చర్చించారని ఈడీ రిమాండ్ రిపోర్టులో తెలిపింది. 

12 శాతం లాభం వచ్చేలా 

సౌత్‌ గ్రూప్‌ ద్వారా దినేష్ అరోరా రూ.31 కోట్ల నగదు తీసుకుని, ఆ నగదును ఆప్‌ నేతలకు చేరవేశారు. దిల్లీ మద్యం పాలసీ రూపకల్పన సమయంలో సిసోడియా 14 మొబైల్‌ ఫోన్లు మార్చారు. సీబీఐ దాడుల్లో వాటిలో రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారని ఈడీ తన రిపోర్టులో వెల్లడించింది. దిల్లీ లిక్కర్ పాలసీ అధికారికంగా విడుదల చేయడానికి రెండు రోజుల ముందే కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబుకి ఆ వివరాలు చేరాయని తెలిపింది. మద్యం విధానంలో కొన్ని విషయాలను బుచ్చిబాబు ఫోన్ లో గుర్తించామని ఈడీ కోర్టుకు తెలిపింది. మద్యం పాలసీలో 12 శాతం ప్రాఫిట్‌ ఉండేలా మార్చి దానిలో ఆప్‌ నేతలకు 6 శాతం అందించాలని విజయ్‌ నాయర్‌ చెప్పినట్టు దినేష్‌ అరోరా ఈడీ ముందు ఒప్పుకున్నారని రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. లిక్కర్ పాలసీపై దిల్లీ ఎల్జీ విచారణ చేపట్టాలని ఆదేశించిన రోజే సిసోడియా ఫోన్ మార్చారని ఈడీ తెలిపింది. ఇతరుల పేర్లతో సిమ్‌ కార్డులు వినియోగించారని,  ముడుపుల ద్వారా రూ.100కోట్లు, ఇండోస్పిరిట్స్‌ లాభాల్లో రూ.192 కోట్లు అందాయని ఈడీ తెలిపింది. ముడుపుల విషయంలో సిసోడియా పొంతనలేని సమాధానాలు ఇచ్చారని,  రూ.292.8 కోట్లు దక్కిన వ్యవహారంలో సిసోడియా కీలకమని ఈడీ రిమాండ్‌ రిపోర్టులో స్పష్టం చేసింది. 

Published at : 10 Mar 2023 08:31 PM (IST) Tags: Hyderabad MLC Kavitha Manish Sisodia Remand report Delhi Liquor Scam Scam . Remand report

సంబంధిత కథనాలు

Minister KTR : తెలంగాణపై కేంద్రం పగబట్టింది, రూ.1200 కోట్ల ఉపాధి హామీ నిధులు తొక్కిపెట్టింది- మంత్రి కేటీఆర్

Minister KTR : తెలంగాణపై కేంద్రం పగబట్టింది, రూ.1200 కోట్ల ఉపాధి హామీ నిధులు తొక్కిపెట్టింది- మంత్రి కేటీఆర్

CM KCRకు బండి సంజయ్ లేఖ- విద్యుత్ శాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కారించాలని డిమాండ్

CM KCRకు బండి సంజయ్ లేఖ-  విద్యుత్ శాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కారించాలని డిమాండ్

Breaking News Live Telugu Updates: కాంగ్రెస్ పార్టీకి డీఎస్ రాజీనామా

Breaking News Live Telugu Updates: కాంగ్రెస్ పార్టీకి డీఎస్ రాజీనామా

KTR Convoy: సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ - కాన్వాయ్ ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు, ఉద్రిక్తత

KTR Convoy: సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ - కాన్వాయ్ ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు, ఉద్రిక్తత

Hyderabad News : పెళ్లైన రెండేళ్లకే దారుణం, కుటుంబ కలహాలతో ట్రాన్స్ జెండర్లు ఆత్మహత్య!

Hyderabad News : పెళ్లైన రెండేళ్లకే దారుణం, కుటుంబ కలహాలతో ట్రాన్స్ జెండర్లు ఆత్మహత్య!

టాప్ స్టోరీస్

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!

Vishwak Sen: ‘దాస్ కా ధమ్కీ’ కలెక్షన్స్ - విశ్వక్ సేన్ కెరీర్‌లో సరికొత్త రికార్డ్!

Vishwak Sen: ‘దాస్ కా ధమ్కీ’ కలెక్షన్స్ - విశ్వక్ సేన్ కెరీర్‌లో సరికొత్త రికార్డ్!

Game Changer First Look: స్టైలిష్ లుక్ లో రామ్ చరణ్, ఇరగదీసిన ‘గేమ్ చేంజర్’ పోస్టర్

Game Changer First Look: స్టైలిష్ లుక్ లో రామ్ చరణ్, ఇరగదీసిన ‘గేమ్ చేంజర్’ పోస్టర్

Rapaka Varaprasad: నేను దొంగ ఓట్ల వల్లే గెలిచా, ఒక్కొక్కరు 10 దాకా ఫేక్ ఓట్లేశారు - ఎమ్మెల్యే రాపాక

Rapaka Varaprasad: నేను దొంగ ఓట్ల వల్లే గెలిచా, ఒక్కొక్కరు 10 దాకా ఫేక్ ఓట్లేశారు - ఎమ్మెల్యే రాపాక