Corona Cases: రాష్ట్రంలో మళ్లీ పెరుగుతున్న కోరనా కేసులు.. నిన్న ఒక్కరోజే 658 మందికి పాజిటివ్!
Corona Cases: తెలంగాణలో కరోనా మహమ్మారి జాడలు ఇంకా బయటపడుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కొవిడ్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. నిన్న ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 658 కొత్త కేసులు వెలుగులోకొచ్చాయి.
Corona Cases: రాష్ట్రంలో కరోనా మహమ్మారి మరోసారి కోరలు చాస్తోంది. నిన్న ఒక్కరోేజే రాష్ట్రంలో కొత్తగా 658 కొవిడ్ కేసులు నమోదు అయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 8 లక్షల 10 వేల 976కు చేరుకుంది. తాజాగా మరో 628 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకు 8 లక్షల 2 వేల 354 మంది ఆరోగ్యంగా ఇళ్లకు చేరారు. ఈనెల 19వ తేదీన సాయంత్రం 5.30 గంటల వరకు నమోదైన కరోనా సమాచారాన్ని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ జి. శ్రీనివాస రావు మంగళవారం వెల్లడించారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 4,511 మంది కరోనా చికిత్స పొందుతున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 30,552 నమూనాలను పరీక్షించగా.. మొత్తం పరీక్షల సంఖ్య 3,60,95,926కు చేరుకుంది తాజా ఫలితాల్లో హైదరాబాద్ లో కొత్తగా 316 పాజిటివ్ కేసులు నమోదు కాగా... కరీంనగర్ లో 18, ఖమ్మంలో 30, మంచిర్యాలలో 10, మేడ్చల్ మల్కాజిగిరిలో 41, నల్గొండలో 21, పెద్దపల్లిలో 25, రంగారెడ్డిలో 52, సంగారెడ్డిలో 16, యాదాద్రి భువనగిరిలో 11 మంది చొప్పున కొత్తగా కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో మరో 53 వేల 63 కొరోనా టీకా డోసులను పంపిణీ చేయగా.. ఇందులో 45,593 బూస్టర్ డోసులు ఉన్నాయి. ఏపీలోనూ స్వల్పంగా పాజిటివిటీ రేటు పెరుగుతోంది. ఆంధ్ర ప్రదేశ్ లో ఏపీలో మొత్తం కేసులు సంఖ్య 23.3 లక్షలు కాగా.. మొత్తం మరణాల సంఖ్య 14 వేల 733.
దేశవ్యాప్తంగానూ పెరుగుతున్న కరోనా కేసులు..
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం మధ్య 21 వేల 566 మంది వైరస్ బారిన పడగా.... 45 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా నుంచి తాజాగా 18 వేల 294 మంది కోలుకున్నారు. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 98.47 శాతానికి చేరింది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.25గా ఉంది. మొత్తం కేసుల సంఖ్య 4 కోట్ల 38 లక్షల 25 వేల 185 కాగా.. మొత్తం మరణాల సంఖ్య 5 లక్షల 25 వేల 870. అలాగే కరోనా బారి నుంచి బయట పడిన వారి సంఖ్య 4 కోట్ల 31 లక్షల 50 వేల 434.
భారత్ లో బుధవారం 29,1,855 మందికి టీకాలు అందించగా... ఇప్పటి వరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసులు సంఖ్య 200.91 కోట్లు దాటింది. మరో 5 లక్షల 7 వేల 360 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు.