(Source: ECI/ABP News/ABP Majha)
Jagga Reddy Letter To KCR: సీఎం కేసీఆర్ కు లేఖ రాసిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఈసారి ఏం కోరారంటే !
Congress MLA Jagga Reddy: ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. ఆ 250 మంది హోం గార్డులను విధుల్లోకి తీసుకోవాలని కోరారు.
Congress MLA Jagga Reddy written letter to CM KCR:
ఉమ్మడి రాష్ట్రంలో ఆర్డర్ కాపీ లేదని 250 మంది హోం గార్డులను విధుల్లో నుంచి తొలిగించారు. వారిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ను కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి సీఎం కేసీఆర్ కు లేఖ సైతం రాశారు. ఆ 250 మంది హోం గార్డు లకు ఐడీ, కార్డ్స్, బ్యాంకు అకౌంట్స్, హెల్త్ కార్డ్స్ అన్ని ఉన్నాయని, *అప్పటికే వారు 10 సంవత్సరాలు వివిధ జిల్లాలో హోం గార్డు గా విధులు నిర్వహించారు. కానీ ఆర్డర్ కాపీ లేదని వారిని విధుల్లో నుంచి తొలిగించారని జగ్గారెడ్డి తన లేఖలో పేర్కొన్నారు.
10 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు లేక వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. అయితే ఐతే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఈ 250మందిని విధులోకి తీసుకుంటామని అసెంబ్లీలో హామీ ఇచ్చారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి గుర్తుచేశారు. కానీ ఎందుకో వారిని విధులోకి తీసుకోవడంలో జాప్యం జరిగిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తొలిగించిన 250 హోం గార్డులను విధులోకి తీసుకుంటానని కేసిఆర్ మాట ఇచ్చారు...తీసుకోండి. ఇప్పటికే రాష్ట్రం ఏర్పడి దాదాపు 9 ఏళ్లు కావొస్తున్నా వారిని డ్యూటీ లోకి తీసుకోలేదన్నారు. ఈ 250 మంది హోం గార్డులని వెంటనే విధులోకి తీసుకోవాలని సీఎం కేసీఆర్ ను కోరారు జగ్గారెడ్డి. అందుకే మీ దృష్టికి మరోసారి తీసుకొస్తూ గుర్తు చేస్తూ లేఖ రాస్తున్నానని పేర్కొన్నారు. రేపు జరుగనున్న తెలంగాణ కాబినెట్ సమావేశాల్లో నిర్ణయం తీసుకోవాలని కోరారు.
ఇటీవల కేసీఆర్, హరీష్ రావును కలిసిన జగ్గారెడ్డి
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అసెంబ్లీలో బీఆర్ఎస్ ముఖ్య నేతల్ని కలిసే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు. గత నెలలో కేవలం రెండు రోజుల వ్యవధిలో సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావుతో ఆయన సమావేశం అయ్యారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే ఫండ్స్ ఇవ్వాలని కోరారు. ఎన్ఆర్ఈజీఎస్ స్కీమ్ కింద రూ.5 కోట్ల 50 లక్షల ఫండ్స్ ఇవ్వాలని కోరడం జరిగింది. సంగారెడ్డి పట్టణంలోని ఫాతే ఖాన్ దర్గా అభివృద్ధి కోసం రూ.3 కోట్లు ఇవ్వాలని కోరారు. సంగారెడ్డి పట్టణంలోని ఈద్ గా అభివృద్ధికి ప్రభుత్వం రూ.5 కోట్లు ఇవ్వాలన్నారు. సంగారెడ్డి పట్టణంలోని దీన్ దార్ ఖాన్ ఫంక్షన్ హాల్ అభివృద్ధికి రూ.5 కోట్ల నిధులు ప్రభుత్వం కేటాయించాలని కోరారు.
సంగారెడ్డి పట్టణంలోనే ముస్లింల స్మశానవటిక, హిందువుల స్మశానవటికకు స్థలాలు ..క్రిస్టియన్ స్మశాన వాటికలకు స్థలాలు మంజూరు చేయాలని హరీష్ రావును కోరారు. సంగారెడ్డి పట్టణంలో ఉన్న సీఎస్ఐ చర్చి ఉంది ఇది ఎంతో చరిత్ర కలిగిన చర్చి ఈ చర్చ్ అభివృద్ధికి ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించాలని కోరారు. సంగారెడ్డి పట్టణంలో శివాలయం నిర్మించడం జరుగుతుంది, అతి పెద్ద శివలింగం కైలాస ప్రస్తారా శ్రీ చక్రలో శివలింగం ఏర్పాటు చేయబోతున్నారు… దీనికోసం ప్రభుత్వం రూ.18 కోట్లు కేటాయించాలన్నారు. అలాగే సంగారెడ్డి పట్టణంలో వైకుంఠపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి కోసం రూ.18 కోట్లు కేటాయించాలని కోరారు.