By: ABP Desam | Updated at : 06 Feb 2023 08:15 PM (IST)
అక్బరుద్దీన్‌తో భట్టి, శ్రీధర్ బాబు చర్చలు
Majilis Congress : తెలంగాణ అసెంబ్లీలో మంత్రి కేటీఆర్, మజ్లిస్ పక్ష నేత అక్బరుద్దీన్ మధ్య జరిగిన వాగ్వాదం ఆ తర్వాత తాము యాభై స్థానాల్లో పోటీ చేస్తామని అక్బరుద్దీన్ ప్రకటించడం సంచలనం అయింది. దీనికి కారణం తెలంగాణ రాజకీయాల్లో మజ్లిస్ కు ఉన్న ప్రాధాన్యతే. బీఆర్ఎస్, మజ్లిస్ నేతల మధ్య గ్యాప్ వచ్చిందని అనిపించగానే.. కాంగ్రెస్ నేతలు అడ్వాంటేజ్ తీసుకున్నారు. అసెంబ్లీలో సోమవారం అక్బరుద్దీన్‌తో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో పాటు శ్రీధర్ బాబు కూడా భేటీ అయ్యారు. చాలా సేపు మాట్లాడారు. దీంతో కాంగ్రెస్ పార్టీ .. మజ్లిస్ ను తమతో కలిసి పోటీ చేసేందుకు ఒప్పించే ప్రయత్నం ప్రారంభించిందన్న ప్రచారం ఊపందుకుంది.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్ బాబులు భేటీ అయ్యారు.రాష్ట్ర వ్యాప్తంగా 50 నియోజకవర్గంలో నిజంగా పోటీ చేస్తారా అని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు. ఓవైసీని అడిగారు. కచ్చితంగా పోటీ చేస్తామని అక్బరుద్దీన్ చెప్పినట్లుగా తెలుస్తోంది. బీజేపీ పూర్తిగా ఓటు బ్యాంకు పోలరైజ్ చేస్తోందన్న అక్బరుద్దీన్ తమ వర్గానికి అండగా ఉంటామని పేర్కొన్నారు. అయితే మీరు మీ వర్గానికి అంటే బీజేపీ అజెండా కూడా అదే కదా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. వరు ఏమనుకున్నా వచ్చే ఎన్నికల్లో తాము మాత్రం తమ పార్టీని విస్తరిస్తామని తెలిపినట్లుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి కూడా మజ్లిస్ ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని అనుకుంటోంది.
గతంలో మజ్లిస్ .. కాంగ్రెస్ పార్టీతో సన్నిహితంగా ఉండేది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నంత కాలం ఆ పార్టీతోనే సన్నిహితంగా ఉండేది. పాతబస్తీలో మాత్రమే పోటీ చేసి.. ఇతర చోట్ల కాంగ్రెస్ పార్టీకి పరోక్ష మద్దతు ఇచ్చేది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ పార్టీ బీఆర్ఎస్ తో సన్నిహితంగా ఉంటోంది. గత ముందస్తు ఎన్నికల్లో గ్రేటర్ మనహా ఇతర చోట్ల బీఆర్ఎస్ పార్టీకి మజ్లిస్ పరోక్ష సహకారం అందించింది. అయితే ఈ సారి మాత్రం మజ్లిస్ పార్టీని విస్తరించాలన్న ఆలోచన చేస్తున్నారు. ఈ కారణంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న చోట్ల అభ్యర్థుల్ని నిలపాలని అనుకుంటున్నారు. ఆ ప్రచారం జరుగుతూండాగనే.. అక్బరుద్దీన్ అసెంబ్లీలో యాభై సీట్ల ప్రస్తావన చేశారు.
కుదిరితే మజ్లిస్ తో పాత సంబంధాలను కలుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆశిస్తోంది. దీనికి కారణం ముస్లిం వర్గాలు ముందు నుంచీ కాంగ్రెస్ కు మద్దతుగా ఉన్నాయి. ఎంఐఎం దూరం జరిగిన తర్వాత ఆ వర్గాలు కూడా కాంగ్రెస్ కు దూరమయ్యాయి. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ..ఇలా బీఆర్ఎస్ పార్టీతో అక్బరుద్దీన్ వాగ్వాదం చేయగానే ఇలా రంగంలోకి దిగింది. అయితే ... అసలు మజ్లిస్ నిర్ణయాలన్నీ అసదుద్దీన్ తీసుకుంటారు. ఎన్నికల ముందు ఏం జరుగుతుందో చెప్పడం కష్టమన్న వాదన వినిపిస్తోంది.
Modi Flexis on Flyover: హైదరాబాద్ ఫ్లై ఓవర్ పిల్లర్లపై మోదీ పోస్టర్లు, ఇంకెన్నాళ్లు కడతారని విమర్శలు
Hyderabad Traffic Restrictions: హైదరాబాదీలకు ట్రాపిక్ అలర్ట్ - 90 రోజుల పాటు అటు చూడొద్దు!
Hyderabad Crime News: హైదరాబాద్‌లో గుప్తనిధుల కలకలం, తొమ్మిది మంది అరెస్ట్
Breaking News Live Telugu Updates: టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి, శ్రీవారి భక్తుల మధ్య వాగ్వాదం - బూతులు తిట్టుకున్న ఇరువురు!
మార్గదర్శి కేసులో మరో సంచలనం- రామోజీరావు, శైలజకు ఏపీ సీఐడీ నోటీసులు
PAN- Aadhaar Link: పాన్-ఆధార్ లింకేజీలో వీళ్లకు మినహాయింపు, మీరూ ఈ వర్గంలో ఉన్నారా?
Brad Minnich For NTR 30 : ఎన్టీఆర్ సినిమాకు ఇంకో హాలీవుడ్ టచ్ - స్టార్ టెక్నీషియన్ వచ్చాడుగా
Ram Charan Birthday - NTR : రామ్ చరణ్ బర్త్‌డే పార్టీకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు?
ప్రజాస్వామ్యం అంటే పట్టింపులేదు- ఓబీసీలు అంటే గౌరవం లేదు- రాహుల్‌పై మంత్రి స్మృతి ఇరానీ ఆగ్రహం