అన్వేషించండి

Communist parties of Telangana : కమ్యూనిస్టు పార్టీలకు కాంగ్రెస్ కూడా హ్యాండిచ్చిందా ? ఇక ఒంటరి పోటీనే !

తెలంగాణ కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు కోసం కాంగ్రెస్ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో సీపీఐ, సీపీఎం కలిసి పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.

Communist parties of Telangana :  తెలంగాణ రాజకీయాల్లో కమ్యూనిస్టు పార్టీల నేతలు పొత్తుల కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించం లేదు. బీఆర్ఎస్‌తో పొత్తు ఖాయం అని..కనీసం రెండు పార్టీలకు చెరో రెండు సీట్లు అయినా కేసీఆర్ కేటాయిస్తారని ఆశపడ్డారు. మునుగోడు ఉపఎన్నికల్లో తమ మద్దతుతోనే గట్టెక్కారన్న కృతజ్ఞత చూపిస్తారని అనుకున్నారు. కానీ కేసీఆర్ మాత్రం రాజకీయాల్లో అలాంటివేమీ వర్కవుట్ కావని జాబితా ప్రకటనతో స్పష్టం చేశారు. దీంతో కమ్యూనిస్టులు కాంగ్రెస్ వైపు చూశారు. ఆ పార్టీతో చర్చలు జరిపారు. కానీ ఆక్కడా సానుకూల స్పందన రాలేదని తెలుస్తోంది. దీంతో రెండు కమ్యూనిస్టు పార్టీలు కలిసి పోటీ చేయాలని భావిస్తున్నాయి. 

పొత్తుల ఆశలు వదిలేసుకుంటున్న కామ్రేడ్స్ 

తెలంగాణ రాజకీయాల్లో కామ్రేడ్ ల పొత్తు రాజకీయం ఎటూ తేలడం లేదు. రాబోయే ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం పార్టీలు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటాయని పెద్దఎత్తున ప్రచారం జరుగుతున్నా అటువంటి పరిస్థితి కనిపించడం లేదు.  గురువారం హైదరాబాద్ లో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల నేతలు సమావేశం అయ్యాయి.  వచ్చే ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.  కాంగ్రెస్‌తో పొత్తు అంశంపై చర్చించలేదని.. అంటున్నారు.  అక్టోబర్ 1న మరోసారి తాము కలిసి పోటీ చేయబోయే స్థానాలపై చర్చిస్తామన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆలోచన బీజేపీకి సహకరించేలా ఉందని  .. బీజేపీ కోసమే ఎంఐఎం థర్డ్ ఫ్రంట్ ఆలోచన చేస్తున్నరని వామపక్షాలు విమర్శిస్తున్నాయి.  

ఆసక్తి చూపని కాంగ్రెస్ 

కమ్యూనిస్టులతో పొత్తుపై కాంగ్రెస్ సీనియర్ నేతలు భిన్నంగా స్పందిస్తున్నారు.  పొత్తుకు అభ్యంతరం లేదని చెప్పిన  నేతల్లో  ఎంపీ ఉత్తమ్​ కుమార్​ రెడ్డి చెప్పినా  మరో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం వ్యతిరేకించారని అంటున్నారు.  పొత్తు వల్ల గెలిచే సీట్లు వదులుకోవాల్సి వస్తుందని, పైగా ఓట్ల మార్పి డి జరగదని వాదిస్తున్నారు.  నల్గొండ, భువనగిరి ఎంపీ సెగ్మెంట్ల పరి ధిలోని 9 నియోజకవర్గాల్లో కమ్యూనిస్టులకు మంచి ఓటు బ్యాంక్ ఉందని.. పొత్తులు పెట్టుకుంటే ప్రయోజనమేనని మరికొందరు వాదిస్తున్నారు. రానీ  పొత్తు వల్ల కాంగ్రెస్​ సీట్లు త్యాగం చేయాల్సిన పరిస్థితి వస్తే పార్టీకి నష్టమని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ పొ త్తు కుదిరితే మాత్రం దాన్ని పార్లమెంట్ ఎన్నికల వరకు కొనసాగించాల్సిన పరిస్థితి వస్తుందని అంటున్నారు. కమ్యూనిస్టు నేతలు.. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రేతోనూ సమావేశం అయ్యారు. కానీ ఎలాంటి ఫలితమూ రాలేదు. 

కమ్యూనిస్టు పార్టీలు కలిసి పోటీ చేయడానికి సన్నాహాలు  !

కమ్యూనిస్టులకు బలం ఉన్న జిల్లాలు ఖమ్మం , నల్లగొండ. ఇటీవల చేరికలతో ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ హౌస్ ఫుల్ అయింది. బలమైన నేతలు వచ్చి చేరారు. దీంతో అక్కడ ఒక్క సీటు కూడా కేటాయించే పరిస్థితి లేదు. నల్లగొండ జిల్లాలో మొదటి నుంచి కాంగ్రెస్ కు బలమైన నాయకత్వ ఉంది. ఆ జిల్లాలోనూ సీట్లు కేటాయించలేరు. ఈ కారణంగానే పొత్తులపై కాంగ్రెస్ వెనుకడుగు వేస్తున్నట్లుగా భావిస్తున్నారు.    

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Target Harish Rao: తెలంగాణలో అందరి టార్గెట్ హరీష్ రావేనా - ట్రబుల్ షూటర్ చుట్టూ జరుగుతున్న రాజకీయం ఇదేనా?
తెలంగాణలో అందరి టార్గెట్ హరీష్ రావేనా - ట్రబుల్ షూటర్ చుట్టూ జరుగుతున్న రాజకీయం ఇదేనా?
Hyderabad Gold Man Vijay Kumar: ఆరేళ్ల క్రితం లక్షలు.. ఇప్పుడు కోట్లు! మొదటిసారి తన ఒంటిపై బంగారం లెక్కలు చెప్పిన గోల్డ్ మ్యాన్ కొండా విజయ్ కుమార్!
ఆరేళ్ల క్రితం లక్షలు.. ఇప్పుడు కోట్లు! మొదటిసారి తన ఒంటిపై బంగారం లెక్కలు చెప్పిన గోల్డ్ మ్యాన్ కొండా విజయ్ కుమార్!
Telangana Chicken Shops: హైదరాబాద్‌లో చికెన్ దొరకట్లే- షాపులన్నీ బంద్ - కోళ్లకూ ఓ రోజొచ్చింది!
హైదరాబాద్‌లో చికెన్ దొరకట్లే- షాపులన్నీ బంద్ - కోళ్లకూ ఓ రోజొచ్చింది!
Anirudh Reddy Controversies: కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్‌ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యల మోటో ఏంటీ?
కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్‌ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యల మోటో ఏంటీ?

వీడియోలు

PM Modi Work at Assam Tea Gardens | అస్సాం తేయాకు తోటల్లో ఆకులు తెంపిన ప్రధాని మోదీ | ABP Desam
LSG vs DC Match Preview IPL 2026 | ఈ సీజన్ లో తొలి మ్యాచ్ ఆడనున్న లక్నో, ఢిల్లీ | ABP Desam
Irfan pathan on ACA Restrictions | ఐపీఎల్ పై అజమాయిషీనా..సొంత జట్టు ప్రయోజనాల కోసమా.? | ABP Desam
Cooper Connolly 72 vs GT IPL 2026 | పంజాబ్ కు మొదటి మ్యాచ్ లో వరంలా కూపర్ కాన్లే | ABP Desam
PBKS vs GT IPL 2026 Match Highlights | గుజరాత్ టైటాన్స్ పై మూడు వికెట్లతో పంజాబ్ విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP ON AMARAVATI: మీరేంటో.. మీ విధానాలేంటో... అంతా MAVIGUN
మీరేంటో.. మీ విధానాలేంటో... అంతా MAVIGUN
Hyderabad Gold Man Vijay Kumar: ఆరేళ్ల క్రితం లక్షలు.. ఇప్పుడు కోట్లు! మొదటిసారి తన ఒంటిపై బంగారం లెక్కలు చెప్పిన గోల్డ్ మ్యాన్ కొండా విజయ్ కుమార్!
ఆరేళ్ల క్రితం లక్షలు.. ఇప్పుడు కోట్లు! మొదటిసారి తన ఒంటిపై బంగారం లెక్కలు చెప్పిన గోల్డ్ మ్యాన్ కొండా విజయ్ కుమార్!
Happy Hanuman Jayanti 2026 Wishes in Telugu: హనుమాన్ జయంతి - మీ బంధు మిత్రులకు ఈ శ్లోకాలతో శుభాకాంక్షలు తెలియజేయండి!
హనుమాన్ జయంతి - మీ బంధు మిత్రులకు ఈ శ్లోకాలతో శుభాకాంక్షలు తెలియజేయండి!
Daily Shower in Summer : వేసవిలో స్నానం చేయడం మానేయకండి.. రోజూ చల్లటి నీటితో ఉదయం, సాయంత్రం చేస్తే కలిగే లాభాలివే
వేసవిలో స్నానం చేయడం మానేయకండి.. రోజూ చల్లటి నీటితో ఉదయం, సాయంత్రం చేస్తే కలిగే లాభాలివే
2026 ఏప్రిల్ 2 రాశిఫలాలు: మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ ఫలితాలు!
2026 ఏప్రిల్ 2 రాశిఫలాలు: మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ ఫలితాలు!
IPL 2026 DC VS LSG Result Update: ఆల్ రౌండ్ షోతో బోణీ కొట్టిన ఢిల్లీ! రాణించిన స‌మీర్, స్ట‌బ్స్, ఎంగిడి, న‌ట‌రాజ‌న్.. బ్యాటింగ్ వైఫ‌ల్యంతో ల‌క్నో బోల్తా!
ఆల్ రౌండ్ షోతో బోణీ కొట్టిన ఢిల్లీ! రాణించిన స‌మీర్, స్ట‌బ్స్, ఎంగిడి, న‌ట‌రాజ‌న్.. బ్యాటింగ్ వైఫ‌ల్యంతో ల‌క్నో బోల్తా!
Cabinet Committee Security Meeting: పశ్చిమాసియా యుద్ధం వేళ ప్రధానమంత్రి మోదీ కీలక సమావేశం!
పశ్చిమాసియా యుద్ధం వేళ ప్రధానమంత్రి మోదీ కీలక సమావేశం!
Kerala Elections: కేరళలో కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్య చీకటి ఒప్పందం - రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విమర్శలు
కేరళలో కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్య చీకటి ఒప్పందం - రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విమర్శలు
Embed widget