CM Revanth Reddy : జనగామ అడిషనల్ కలెక్టర్‌కు రేవంత్ అభినందన - రైతులకు అండగా ఉన్నందుకే
Telangana News : రైతులకు అండగా ఉన్నందుకు జనగామ అడిషనల్ కలెక్టర్‌ను సీఎం రేవంత్ అభినందించారు. రైతుల్ని ఇబ్బంది పెట్టిన వారిపై అడిషనల్ కలెక్టర్ చర్యలు తీసుకున్నారు.
CM Revanth congratulated the Janagama Additional Collector : పత్రికల్లో వచ్చిన ఓ చిన్న వార్తపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ధాన్యంలో తేమ, తాలు సాకుతో కనీస మద్ధతు ధర కంటే ట్రేడర్లు తక్కువ ధరకు కొనడంతో జనగామ మార్కెట్ కమిటీ కార్యాలయం ముందు రైతులు బుధవారం నిరసన చేశారు. ప్రభుత్వం ధర రూ. 2,203 కంటే తక్కువ ధర రూ. 1,500 ఇవ్వడమేంటని ప్రశ్నించారు. మద్దతు ధర చెల్లించాల్సిందేనని అధికారులను నిలదీశారు. ఈ సంఘటన గురించి తెల్సుకున్న అడిషనల్ కలెక్టర్(రెవెన్యూ) రోహిత్ సింగ్ మార్కెట్ యార్డుకు వచ్చి రైతులతో మాట్లాడి ట్రేడర్లు ఇచ్చిన ధరల చిట్టీచూసి అవాక్కయ్యారు. దీంతో ట్రేడర్లపై క్రిమినల్ కేసులు నమోదు చెయ్యాలని ఆయన ఆదేశించారు.రైతుల సమస్య పట్ల పట్టనట్టు వ్యవహరించిన మార్కెట్ సెక్రటరీని సస్పెండ్ చేయాలని అధికారులను ఆదేశించారు. మద్దతు ధరకే ధాన్యం కొంటామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.
ఈ విషయాన్ని ఓ దినపత్రిక ప్రచురించింది. సీఎం రేవంత్ దృష్టికి రావడంతో వెంటనే స్పందించారు. కలెక్టర్ ను అభినందిస్తూ ట్వీట్ చేశారు.
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. రైతుల కష్టాన్ని ఎవరైనా మార్కెట్ కమిటీ అధికారులు… వ్యాపారులతో కుమ్మక్కై తక్కువ చేసే ప్రయత్నం చేస్తే సహించేది లేదు.
— Revanth Reddy (@revanth_anumula) April 11, 2024
జనగామ వ్యవసాయ మార్కెట్ లో జరిగిన ఘటన పై సకాలంలో స్పందించి… రైతులను మోసం చేయడానికి ప్రయత్నించిన నలుగురు ట్రేడర్లపై… pic.twitter.com/1XgdaIoc4t
ధాన్యం కొనుగోళ్లలో చిత్తశుద్ధితో ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు. రైతుల కష్టాన్ని ఎవరైనా మార్కెట్ కమిటీ అధికారులు.. వ్యాపారులతో కుమ్మక్కైనట్లు తెలిస్తే సహించేది లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అధికారులందరూ ధాన్యం కొనుగోళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి కోరుతున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల పట్ల, రైతు సమస్యల పట్ల చిత్తశుద్ధితో ఉందని స్పష్టం చేశారు.
రేవంత్ రెడ్డి స్పందన ద్వారా ఇతర చోట్ల అధికారులు స్వేచ్చగా... వ్యవహరించే అవకాశం ఉందని బావిస్తున్నారు. మామూలుగా ట్రేడర్లు రాజకీయ మద్దతుతో రైతుల్ని మోసం చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంారు. అలాంటి వాటిని సహించే ప్రశ్నే లేదని తేల్చడం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి అధికారవర్గాలకు గట్టి సందేశం పంపించారని అనుకోవచ్చు.