అన్వేషించండి

CM KCR: 'మాది చేతల, చేనేతల ప్రభుత్వం' - తెలంగాణలో ఊహించని అభివృద్ధి జరిగిందన్న సీఎం కేసీఆర్

ఒకప్పుడు సిరిసిల్ల ప్రాంతాన్ని చూస్తే కన్నీళ్లు వచ్చేవని, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తొమ్మిదన్నరేళ్లలో ఊహించని అభివృద్ధి జరిగిందని సీఎం కేసీఆర్ తెలిపారు. తమది చేతల ప్రభుత్వమని అన్నారు.

ఒకప్పుడు సిరిసిల్ల ప్రాంతాన్ని చూస్తే కన్నీళ్లు వచ్చేవని, సమైక్య రాష్ట్రంలో ఎన్నో బాధలు పడ్డామని, ఇప్పుడు ఎలాంటి సమస్యలు లేవని సీఎం కేసీఆర్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రజా ఆశీర్వాద సభకు హాజరైన ఆయన ప్రసంగించారు. తొమ్మిదినరేళ్లలో తెలంగాణను ఎన్నో అంశాల్లో నెంబర్ వన్ గా నిలిపామని, 'మాది చేతల, చేనేతల ప్రభుత్వం' అని పేర్కొన్నారు. సిరిసిల్ల మంచి విద్యా కేంద్రంగా అభివృద్ధి చెందుతుందన్న కేసీఆర్, 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఏమీ చేయలేదని విమర్శించారు.

100 సార్లు తిరిగాను

తన 70 ఏళ్ల జీవితంలో సిరిసిల్లలో కనీసం వంద సార్లు తిరిగినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని చూస్తే బాధగా ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. అప్పర్ మానేరులో ఏడాదంతా నీరు ఉంటోందని చెప్పారు. సమైక్య పాలనలో మొత్తం నాశనమైందని ఈ ప్రాంతమంతా దుమ్ము లేచే పరిస్థితి ఉండేదని విమర్శించారు. కరీంనగర్ ఎంపీగా పోటీ చేస్తే ఆదరించి గెలిపించారని, కానీ అప్పట్లో ఏడుగురు చేనేత కార్మికుల ఆత్మహత్య చేసుకోవడంతో ఎంతో చలించిపోయానని చెప్పారు. పార్టీ నిధులు, చందాలు సేకరించి వారికి సాయం చేసినట్లు గుర్తు చేశారు. కేటీఆర్ చేనేత శాఖ మంత్రి అయిన తర్వాత సిరిసిల్ల రూపురేఖలు మారిపోయాయని కేసీఆర్ ప్రశంసించారు. 

బతుకమ్మ చీరలపైనా రాజకీయం

సిరిసిల్లను షోలాపూర్ లా చేయాలనేదే మా ప్రయత్నమని సీఎం కేసీఆర్ ఆశీర్వాద సభలో వెల్లడించారు. చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలనే బతుకమ్మ చీరల పంపిణీ పథకం అమలు చేస్తున్నామని చెప్పారు. చివరకు ఆ పథకాన్ని కూడా రాజకీయం చేశారని అన్నారు. నచ్చకపోతే చీరలు తీసుకోవద్దని, చీరల పంపిణీని కూడా రాజకీయం చెయ్యొద్దని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. రేషన్ కార్డు ఉన్న పేదలందరికీ నాణ్యమైన సన్నబియ్యం ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు.

'ధరణి'పై మీరే తేల్చుకోండి

కాంగ్రెస్ నేతలు 'ధరణి'పై విమర్శలు చేస్తున్నారని, అది రద్దైతే వీఆర్వోలు మళ్లీ పెత్తనం చేస్తారని, రైతులు అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని సీఎం కేసీఆర్ వివరించారు. ధరణి వల్లే పల్లెలు ప్రశాంతంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో ధరణి ఉంచాలో.? వద్దో.? రైతులే తేల్చుకోవాలని సూచించారు. విపక్షాలతో పెను ప్రమాదం పొంచి ఉందని, రైతులంతా అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. రైతు బంధు వంటి పథకాలు లేకుండా చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. 

వారు కరెంట్ ఇవ్వలేదు

తొమ్మిదిన్నరేళ్లలో తెలంగాణను అన్ని రంగాల్లో ఫస్ట్ ప్లేస్ లో నిలిపామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ వద్దని కాంగ్రెస్ నేతలు చెప్పారని గుర్తు చేశారు. 3 గంటల కరెంట్ కావాలో.? 24 గంటల కరెంట్ కావాలో.? తేల్చుకోవాలన్నారు. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ సరిపడా కరెంట్ ఇవ్వలేదని అన్నారు. 

కాగా, కేసీఆర్ సీఎం అయిన తర్వాత సిరిసిల్ల నేతన్నల జీవితాలు మారాయని మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. అన్ని రంగాల్లోనూ తెలంగాణ అభివృద్ధి సాధించిందని వివరించారు. ప్రజా ఆశీర్వాద సభతో సిరిసిల్ల గులాబీ మయంగా మారింది.

 

 

టాప్ హెడ్ లైన్స్

Telangana Politics: రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
Tiger Tension in Nirmal: గడప దాటితే గండమే! సుర్జాపూర్ అడవుల్లో పెద్దపులి కలకలం- నిర్మల్ జిల్లాలో అధికారుల వార్నింగ్
గడప దాటితే గండమే! సుర్జాపూర్ అడవుల్లో పెద్దపులి కలకలం- నిర్మల్ జిల్లాలో అధికారుల వార్నింగ్
Tragedy in Medchal Malkajgiri: రైలు ఢీకొని 100 గొర్రెలు మృత్యువాత.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘటన
రైలు ఢీకొని 100 గొర్రెలు మృత్యువాత.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘటన
KTR Passport Seized: ఫార్ములా-ఈ రేస్ కేసు.. కేటీఆర్‌తో పాటు మరో ముగ్గురి పాస్‌పోర్ట్‌లు తాత్కాలికంగా సీజ్ !
ఫార్ములా-ఈ రేస్ కేసు.. కేటీఆర్‌తో పాటు మరో ముగ్గురి పాస్‌పోర్ట్‌లు తాత్కాలికంగా సీజ్ !

వీడియోలు

Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్
Sunil Gavaskar about Selection Committee | చీఫ్ సెలెక్టర్ పదవిపై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh Visits Tirumala: సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
Machilipatnam To Kurnool Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
YSRCP Leaders Joining Janasena: జనసేనలోకి వైఎస్సార్‌సీపీ నేతల క్యూ - పవన్‌కు దక్కుతున్న పొలిటికల్ మూమెంటం.. కానీ కూటమి పరిమితులే అసలు చిక్కు?
జనసేనలోకి వైఎస్సార్‌సీపీ నేతల క్యూ - పవన్‌కు దక్కుతున్న పొలిటికల్ మూమెంటం.. కానీ కూటమి పరిమితులే అసలు చిక్కు?
TGPSC Exams Schedule: టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్, నవంబర్ నెలల్లో పరీక్షలు
టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్, నవంబర్ నెలల్లో పరీక్షలు
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: రోహిత్ ముఖం మీద త్రిగుణ్ ఉమ్మేశాడా! నామినేషన్స్‌లో గోల గోల!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: రోహిత్ ముఖం మీద త్రిగుణ్ ఉమ్మేశాడా! నామినేషన్స్‌లో గోల గోల!
రూ.9.19 లక్షల ధరలో రెండు మంచి సెడాన్లు.. బూట్ స్పేస్, మైలేజీ, ఫీచర్లలో రెండిటి మధ్య తేడాలు
టాటా ఏరిస్ CNG vs మారుతి డిజైర్ CNG.. ధర దాదాపు సేమ్‌, ఏ కారులో ఎక్కువ ఫీచర్లు?
Bahadurpuga farmers: బహదూర్‌గూడ రైతుల కథ ప్యారడైజ్ సినిమా లాంటిది - బీఆర్ఎన్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
బహదూర్‌గూడ రైతుల కథ ప్యారడైజ్ సినిమా లాంటిది - బీఆర్ఎన్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
Tragedy in Medchal Malkajgiri: రైలు ఢీకొని 100 గొర్రెలు మృత్యువాత.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘటన
రైలు ఢీకొని 100 గొర్రెలు మృత్యువాత.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘటన
Embed widget