అన్వేషించండి

KCR On Journalists: ఆ సంస్థల్లో పని చేసే జర్నలిస్టులకి ఇళ్లు ఇవ్వం - తేల్చి చెప్పేసిన కేసీఆర్

ప్రభుత్వంపై వ్యతిరేక వార్తలు రాసే జర్నలిస్టులకు ప్రభుత్వ ఇళ్లు ఇవ్వబోమని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని మీడియా సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం దేశంలోనే ఒక గుర్తింపును సొంతం చేసుకుందని, అలాంటి ప్రభుత్వంపై వ్యతిరేక వార్తలు రాసే జర్నలిస్టులకు ప్రభుత్వ ఇళ్లు ఇవ్వబోమని తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల కోసం బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి విడత జాబితాను విడుదల చేసిన సందర్భంగా సీఎం కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై స్పందిస్తూ.. ప్రభుత్వానికి, బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా రాసిన వార్తా పత్రికలు, ఛానళ్లకు సంబంధించిన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వబోమని స్పష్టం చేశారు. కొన్ని కుల, గుల పత్రికలు, ఛానళ్లు కొన్ని ఉన్నాయని కేసీఆర్ ఎద్దేవా చేశారు. న్యూస్ పేపర్లు, ఛానళ్లు ఉంటే పర్వాలేదని.. వ్యూస్ పేపర్లు, ఛానళ్లు ఉంటే ఎలా అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.

గతంలో సిబ్బందికి జీతాలు ఇవ్వడం లేదని ఓ పత్రిక ఫస్ట్ పేజీలో రాసిందని, ఇప్పుడు ఎకాయెకి 20 వేల కోట్లు రుణ మాఫీ చేశామని అన్నారు. ఇప్పుడు సదరు సంస్థ ముఖం ఎక్కడ పెట్టుకుంటుందని ప్రశ్నించారు. అసలు అది ఒక పేపరా? అని దానికి వ్యాల్యూ ఉందా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వానికి ఇండియాలోనే బెస్ట్ గ్రోత్ ఉందని ఆర్బీఐ, నీతి అయోగ్ లాంటివే చెప్పాయని గుర్తు చేశారు. అంతేకాక, కేంద్ర ప్రభుత్వమే పార్లమెంటులో లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారని అన్నారు. అయినా కూడా వ్యతిరేకంగా రాయడం ఏంటని ప్రశ్నించారు. విజ్ఞత ఉన్న ఎవరికైనా సిగ్గు అనిపిస్తుందని.. అలా రాయచ్చా? అని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల

023లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఏడు చోట్లే అభ్యర్థులను మర్చినట్టు కేసీఆర్ తెలిపారు. వేములవాడ, ఖానాపూర్, ఆసిఫాబాద్, బోధ్, వైరా, కోరుట్ల, ఉప్పల్ నియోజకవర్గాల్లో కొత్త వారికి ఛాన్స్ ఇచ్చినట్లు చెప్పారు. ఏడుగురిని మార్చడానికి అనేక కారణాలు ఉన్నాయని, ఎక్కువ మార్పులు ఉండవని చెప్పినట్లు కేసీఆర్ గుర్తుచేశారు. 

వేములవాడ నియోజకవర్గంలో ప్రస్తుతం ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు నిరాశ ఎదురైంది. హుజూరాబాద్‌ టికెట్ కౌశిక్‌ రెడ్డికి ఇచ్చారు. వేములవాడలో చల్మెడ లక్ష్మీనరసింహా రావులు పోటీ చేయనున్నట్లు కేసీఆర్‌ తెలిపారు. పౌరసత్వం సమస్య ఉన్న కారణంగా వేములవాడలో చెన్నమనేని రమేష్ స్థానంలో వేరే లీడర్‌కు చల్మెడ లక్ష్మీ నరసింహా చోటు కల్పించారు.

కోరుట్లలో కల్వకుంట్ల విద్యాసాగర్ రావు స్థానంలో ఆయన కుమారుడు సంజయ్ కు అవకాశం ఇస్తున్నారు. వయో భారంతో విద్యాసాగర్‌ రావు తప్పుకుంటున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. స్టేషన్ ఘనపూర్ లో కడియం శ్రీహరికి టికెట్ ఇవ్వగా, మాజీ మంత్రి టి. రాజయ్యకు నిరాశే ఎదురైంది. బోథ్ నుంచి రెండు సార్లు కాంగ్రెస్ తరపున గెలిచి బీఆర్ఎస్ లో చేరిన ఆత్రం సక్కుకు మాత్రమే టిక్కెట్ నిరాకరించారు.

రెండు చోట్ల నుంచి కేసీఆర్ పోటీ

గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల నుంచి కేసీఆర్ పోటీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో లాస్య నందితకు ఛాన్స్ ఇచ్చారు. అక్టోబర్ 16న వరంగల్ లో పెద్ద ర్యాలీకి బీఆర్ఎస్ ప్లాన్ చేసింది. అదే రోజు మ్యానిఫెస్టో విడుదల చేస్తామని కేసీఆర్ వెల్లడించారు. ఈసారి 95 నుంచి 105 స్థానాల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని కేసీఆర్ దీమా వ్యక్తం చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
Rishabh Pant: డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడాSiraj Throw ball to Marnus Labuschagne | లబుషేన్ పై బాల్ గిరాటేసిన సిరాజ్ | ABP DesamAus vs Ind 2nd Test Day 1 Highlights | రెండో టెస్టులో టీమిండియాను ఆడేసుకుంటున్న ఆస్ట్రేలియా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
Rishabh Pant: డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
Flipkart Mobile Offers: ప్రీమియం స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ - గూగుల్ ఫోన్లు, ఐఫోన్లపై ఎంత తగ్గిందంటే?
ప్రీమియం స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ - గూగుల్ ఫోన్లు, ఐఫోన్లపై ఎంత తగ్గిందంటే?
Telangana News: మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
Pawan Kalyan: 'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Cheapest Bikes in India: దేశంలో అత్యంత చవకైన బైక్‌లు ఇవే - బెస్ట్ మైలేజీ కూడా!
దేశంలో అత్యంత చవకైన బైక్‌లు ఇవే - బెస్ట్ మైలేజీ కూడా!
Embed widget