News
News
వీడియోలు ఆటలు
X

Chikoti Praveen : థాయిలాండ్ హవాలా గుట్టు చీకోటి ప్రవీణ్ బయటపెడతారా ? - ఈడీ విచారణకు హాజరు

చీకోటి ప్రవీణ్ ఈడీ విచారణకు హాజరయ్యారు.

FOLLOW US: 
Share:

Chikoti Praveen :   క్యాసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్   ఈడీ విచారణకు హాజరయ్యారు. తన లాయర్లతో కలిసి ప్రవీణ్ ఈడీ కార్యాలయానికి వచ్చారు.   క్యాసినో కేసులో ఇప్పటికే చీకోటి ప్రవీణ్ ను విచారించిన ఈడీ.. తాజాగా థాయ్‌లాండ్‌లో జరిగిన ఘటన తర్వాత మరోసారి నోటీసులు జారీ చేసింది.   చీకోటితో పాటు చిట్టి దేవేందర్, సంపత్, మాధవరెడ్డిలకు కూడా ఈడీ నోటీసులు పంపింది.  పట్టాయ అధికారులు , పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దాదాపుగా రూ. వంద కోట్ల వరకూ గ్యాంబ్లింగ్  నిర్వహించినట్లుగా అనుమానిస్తున్నారు.  క్యాంపుల్లో జూదం ఆడేందుకు పంటర్లకు కావాల్సిన క్యాసినో టోకెన్లను సమకూర్చడం దగ్గరి నుంచి పంటర్లు గెలుచుకున్న సొమ్మను నగదు రూపంలో అప్పగించడం వరకు అంతా హవాలా మార్గంలోనే నడించిందనేది ఆ కేసులో ఈడీ ప్రధాన అభియోగం. అలాగే కమీషన్ల రూపంలో ప్రవీణ్ సంపాదించిన సొమ్మునూ ఈ మార్గంలోనే రప్పించుకొని ఆస్తులు కూడగట్టుకున్నట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ సారి మొత్తం గుట్టు ఈడీ బయట పెట్టే అవకాశం ఉంది. 

థాయ్‌లాండ్‌లోని ఓ కన్వెన్షన్ సెంటర్‌లో జూదం ఆడుతూ అక్కడి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు ప్రవీణ్.   నాలుగు రోజులు ఫోకర్న్ టోర్నమెంట్ అని చెబితే తాను థాయ్‌లాండ్‌ కు వెళ్లినట్లుగా తెలిపాడు.  దేవ్ , సీత అనే ఇద్దరు తనకు ఆహ్వానం పంపారని, ఆ టోర్నమెంట్ లీగల్ అనే చెబితేనే తాను వెళ్ళినట్టిగా చీకోటి తెలిపాడు.  .   థాయ్‌లాండ్‌  లో గ్యాంబ్లింగ్ నిషేధం అనేది తనకు తెలియదని చీకోటి చెప్పాడు.  తాను హాల్ లోకి వెళ్లిన 10 నిమిషాలకే రైడ్ జరిగిందని అన్నాడు. ఈ గ్యాంబ్లింగ్ తో సంబంధం లేదని తేలడంతో తాను చట్టపరంగా బయటకు వచ్చానని అన్నాడు.   చీకోటి ప్రవీణ్ కు థాయ్‌లాండ్‌  కోర్టు  షరతులతో కూడిన  బెయిల్  మంజూరు చేసింది.  ఆయనతోపాటు ఆరెస్ట్ అయిన   83 మంది భారతీయులకు కూడా  థాయ్‌లాండ్‌  కోర్టు బెయిల్ ఇచ్చింది.  4500 బాట్స్  జరిమానాతో కోర్టు అందరికీ బెయిల్ ఇచ్చింది.  జరిమానాను చెల్లించడంతో పోలీసులు వారికి పాస్ పోర్టులు  కూడా ఇచ్చేశారు.  
 
కాగా.. క్యాసినో కేసులో గతంలోనూ చికోటిని ఈడీ విచారించింది. విదేశాల్లో నిర్వహించిన క్యాసినో ఈవెంట్స్‌లో మనీ లాండరింగ్ జరిగిందనే ఆరోపణలతో ప్రవీణ్‌పై ఈడీ కేసు నమోదు చేసింది. అయితే థాయిలాండ్‌లో గ్యాంబ్లింగ్ ఆడుతూ దొరికిన తర్వాత మరోసారి ఈడీ నోటీసులిచ్చింది. థాయిలాండ్‌లో క్యాసినో నిర్వహిస్తుండగా చికోటి ప్రవీణ్‌ను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ సమయంలో భారీగా నగదును పోలీసులు పట్టుకున్నారు. ఈ నగదు లావాదేవీలపై చికోటి ప్రవీణ్‌ను ఈడీ ప్రశ్నించనుంది. చికోటి ప్రవీణ్‌తో పాటు మెదక్ డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, సంపత్, మాధవరెడ్డిలకు ఈడీ నోటీసులిచ్చింది. ట్రావెల్ ఏజెంట్ సంపత్ ఇప్పటికే ఈడీ విచారణకు హాజరయ్యారు. పటాయలో దొరికిన తర్వాత ఈ కేసులో ఈరోజు విచారణకు రావాలని చికోటి ప్రవీణ్‌కు ఈడీ నోటీసులిచ్చింది. ఆర్థిక లావాదేవీలతో పాటు నగదు బదిలీపై కూడా చికోటిని ఈడీ ప్రశ్నించనుంది.

 గతంలో కూడా  విదేశాల్లో నిర్వహించిన క్యాసినో, ఈవెంట్స్ లావాదేవీలు, పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యం దారి మళ్లించడం, బ్యాంకు ఖాతాల వివరాలు, వంటి అంశాలపై ప్రవీణ్ బృందాన్ని ఈడీ అధికారులు విచారించారు. చికోటి కస్టమర్లలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, జడ్పీ ఛైర్మన్లు ఇలా చాలా మంది ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నేపాల్, శ్రీలంక, ఇండోనేసియా, థాయ్ లాండ్.. తదితర దేశాల్లో క్యాసినో క్యాంపులకు వందల మంది పంటర్లను ప్రవీణ్ బృందం తరలించినట్లు ఈడీ గుర్తించింది. 

Published at : 15 May 2023 03:08 PM (IST) Tags: ED Hyderabad News Cheekoti Praveen Cheekoti for ED investigation

సంబంధిత కథనాలు

Telangana As Number 1: జయహో తెలంగాణ‌, తాజా నివేదికలో రాష్ట్రం నెంబర్ వన్ - మంత్రి కేటీఆర్ హ‌ర్షం

Telangana As Number 1: జయహో తెలంగాణ‌, తాజా నివేదికలో రాష్ట్రం నెంబర్ వన్ - మంత్రి కేటీఆర్ హ‌ర్షం

Governor Tamilisai: మీడియేషన్ మెడిటేషన్ లాంటిది, వివాహ బంధాన్ని ఏకం చేయలేకపోతున్నారు - గవర్నర్

Governor Tamilisai: మీడియేషన్ మెడిటేషన్ లాంటిది, వివాహ బంధాన్ని ఏకం చేయలేకపోతున్నారు - గవర్నర్

Top 5 Headlines Today: టీడీపీ నేత ఆనం రమణారెడ్డిపై దాడి! మెట్రో రైలు కోసం మంత్రి కేటీఆర్‌కు వినతులు? టాప్ 5 హెడ్ లైన్స్

Top 5 Headlines Today: టీడీపీ నేత ఆనం రమణారెడ్డిపై దాడి! మెట్రో రైలు కోసం మంత్రి కేటీఆర్‌కు వినతులు? టాప్ 5 హెడ్ లైన్స్

TSPSC Group 1 Exam: 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌ హాల్‌‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! పరీక్ష వివరాలు ఇలా!

TSPSC Group 1 Exam: 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌ హాల్‌‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! పరీక్ష వివరాలు ఇలా!

Nizamabad News: న్యూజెర్సీలో నిజామాబాద్ యువకుడు సజీవదహనం, రోడ్డు ప్రమాదమే కారణం!

Nizamabad News: న్యూజెర్సీలో నిజామాబాద్ యువకుడు సజీవదహనం, రోడ్డు ప్రమాదమే కారణం!

టాప్ స్టోరీస్

Odisha Train Accident: ఈ ప్రమాదానికి బాధ్యత ఎవరిది? కాగ్ రిపోర్ట్‌ని ఎందుకు నిర్లక్ష్యం చేశారు - ప్రియాంక గాంధీ

Odisha Train Accident: ఈ ప్రమాదానికి బాధ్యత ఎవరిది? కాగ్ రిపోర్ట్‌ని ఎందుకు నిర్లక్ష్యం చేశారు - ప్రియాంక గాంధీ

Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?

Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?

TDP Leaders on YCP Govt: ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి అనాగరికం, అప్రజాస్వామికం: టీడీపీ నేతలు

TDP Leaders on YCP Govt: ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి అనాగరికం, అప్రజాస్వామికం: టీడీపీ నేతలు

Allu Arjun - Telugu Indian Idol 2 : గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పేసిన అల్లు అర్జున్ - ఇంటికెళ్లాక పరిస్థితి ఏంటో?

Allu Arjun - Telugu Indian Idol 2 : గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పేసిన అల్లు అర్జున్ - ఇంటికెళ్లాక పరిస్థితి ఏంటో?