News
News
X

RS Praveen Kumar: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు కరోనా.. గాంధీ ఆస్పత్రిలో చేరిన మాజీ ఐపీఎస్

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు కరోనా సోకింది. దీంతో ఆయన చికిత్స కోసం గాంధీ ఆస్పత్రిలో చేరారు.

FOLLOW US: 

మాజీ ఐపీఎస్ అధికారి, బహుజన్ సమాజ్ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు కరోనా వైరస్ సోకింది. దీంతో ఆయన చికిత్స కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చేరారు. అయితే, ప్రస్తుతం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోగ్యం నిలకడగానే ఉందని గాంధీ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. అయితే, ఆయనకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నందున డాక్టర్ల సలహాలు తీసుకొని ఇంటికి వెళ్లిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 8న నల్గొండలో రాజ్యాధికార సంకల్ప సభలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్న సంగతి తెలిసిందే.

కొద్ది వారాల క్రితం తన ఐపీఎస్ పదవికి రాజీనామా చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రెండ్రోజుల క్రితమే రాజకీయాల్లోకి ప్రవేశించారు. మాయావతి నాయకత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీలో ఆయన చేరిన సంగతి తెలిసిందే. నల్గొండ‌లోని ఎన్‌జీ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన ‘రాజ్యాధికార సంకల్ప సభ’ వేదికగా బహుజన్ సమాజ్ పార్టీలో ప్రవీణ్ కుమార్ చేరారు. బీఎస్పీ జాతీయ కోఆర్డినేటర్​, రాజ్యసభ సభ్యుడు రాంజీ గౌతమ్ ఆర్​ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ కండువా కప్పి సభ్యత్వం అందజేశారు. ప్రవీణ్ కుమార్‌ను బీఎస్పీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా ప్రకటించారు. ఐపీఎస్‌కు రాజీనామా చేసిన తర్వాత పూలే, అంబేడ్కర్, కాన్షీరాం బాటలోనే తాను కూడా పోరాటం చేస్తానని ప్రవీణ్ కుమార్ ఇదివరకే స్పష్టం చేశారు.

అంతకుముందు ప్రవీణ్ కుమార్ ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సూర్యాపేట, నకిరేకల్, నార్కట్ పల్లి సహా వివిధ ప్రాంతాలు పర్యటించారు. తాను రాజీనామా చేసిన నాటి నుంచి వివిధ జిల్లాలు పర్యటించారు. ఆ సమయంలోనే తన రాజకీయ కార్యాచరణను ప్రవీణ్ కుమార్ ప్రాథమికంగా ప్రకటించారు. తర్వాత స్వైరో కార్యకర్తలు పది రోజులుగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో పల్లెపల్లెన తిరుగుతూ నల్గొండ సభకు జన సమీకరణ చేపట్టారు. మొదట నల్గొండలో ఐదు కిలోమీటర్ల పరుగు నిర్వహించాక, అనంతరం మర్రిగూడ బైపాస్ నుంచి సభా వేదిక వరకు ర్యాలీగా వచ్చారు.

రాజ్యాధికారం వస్తే తన సుఖాల కోసం ప్రజలను మోసం చేయనని ప్రవీణ్ కుమార్ గతంలోనే చెప్పారు. తనకు ఒక బెడ్ రూమ్, బాత్ రూమ్ ఉంటే చాలని.. ప్రజలు తన కన్నా గొప్పగా జీవించేలా చూడటమే తన లక్ష్యమని చాలా సందర్భాల్లో చెప్పారు. అన్ని రంగాల్లో వారికి గొప్ప అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. బహుజనులను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తున్నారని, బహుజన వాదంతో వారందరినీ రాజ్యాధికారం వైపు నడిపిస్తామని ప్రవీణ్ కుమార్ తెలిపారు. తన వెంట లక్షలాది మంది బహుజన బిడ్డలు ఉన్నారని చెప్పారు.

Also Read: School Reopen: తెలంగాణలో స్కూళ్ల రీఓపెన్ ఎప్పుడు? విద్యాశాఖ ఏం చెప్పిందంటే.. మరి సర్కార్ ఒప్పుకుంటుందా?

Published at : 10 Aug 2021 02:19 PM (IST) Tags: RS Praveen kumar BSP RS Praveen corona positive Gandhi Hospital RS Praveen in BSP

సంబంధిత కథనాలు

Rains in AP Telangana: వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం - నేడు ఆ జిల్లాల్లో అతి భారీ వర్షాలు, IMD రెడ్ అలర్ట్

Rains in AP Telangana: వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం - నేడు ఆ జిల్లాల్లో అతి భారీ వర్షాలు, IMD రెడ్ అలర్ట్

Gold-Silver Price: బంగారం కొంటున్నారా? మీ నగరంలో లేటెస్ట్ గోల్డ్, సిల్వర్ రేట్స్ ఇలా

Gold-Silver Price: బంగారం కొంటున్నారా? మీ నగరంలో లేటెస్ట్ గోల్డ్, సిల్వర్ రేట్స్ ఇలా

TS VROs G.O 121 : వీఆర్వోల సర్దుబాటు జీవో 121 పై తెలంగాణ హైకోర్టు స్టే

TS VROs G.O 121 : వీఆర్వోల సర్దుబాటు జీవో 121 పై తెలంగాణ హైకోర్టు స్టే

Ticket booking: ఐదు నిమిషాల ముందే రైలులో టికెట్ బుక్ చేస్కోవచ్చు!

Ticket booking: ఐదు నిమిషాల ముందే రైలులో టికెట్ బుక్ చేస్కోవచ్చు!

Bullet Bike Thieves: బుల్లెట్ బైకులంటే ప్రాణం, ఎక్కడ కనిపించినా అదే పనిచేస్తారు!

Bullet Bike Thieves: బుల్లెట్ బైకులంటే ప్రాణం, ఎక్కడ కనిపించినా అదే పనిచేస్తారు!

టాప్ స్టోరీస్

India Medal Tally: 22 స్వర్ణాలతో నాలుగో స్థానంలో భారత్ - కామన్వెల్త్ గేమ్స్‌లో మన ప్రస్థానం ఇదే!

India Medal Tally: 22 స్వర్ణాలతో నాలుగో స్థానంలో భారత్ - కామన్వెల్త్ గేమ్స్‌లో మన ప్రస్థానం ఇదే!

కేవలం 12 నిమిషాల్లోనే 80 శాతం చార్జింగ్ - రియల్‌మీ కొత్త ఫోన్ లాంచ్‌కు రెడీ!

కేవలం 12 నిమిషాల్లోనే 80 శాతం చార్జింగ్ - రియల్‌మీ కొత్త ఫోన్ లాంచ్‌కు రెడీ!

రాఖీకి మీ సోదరికి మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా - అయితే ఈ ఆప్షన్లపై ఓ లుక్కేయండి!

రాఖీకి మీ సోదరికి మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా - అయితే ఈ ఆప్షన్లపై ఓ లుక్కేయండి!

Monkeypox: మంకీపాక్స్ వైరస్ రెండు కొత్త లక్షణాలు ఇవే, కనుగొన్న కొత్త అధ్యయనం

Monkeypox: మంకీపాక్స్ వైరస్ రెండు కొత్త లక్షణాలు ఇవే, కనుగొన్న కొత్త అధ్యయనం