అన్వేషించండి

KTR: రేవంత్ డబుల్ R టాక్స్ వసూలు చేస్తుంటే మీరేం చేస్తున్నారు మోదీ గారూ - కేటీఆర్

Telangana News: ప్రధాని మోదీ రేవంత్ రెడ్డిపై డబుల్ ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యాయి. మంత్రి కేటీఆర్ దీనిపై కీలక ప్రశ్నలను లేవనెత్తారు.

KTR Reaction on PM Modi Speech in Zaheerabad: ప్రధాని మోదీ బీజేపీ జహీరాబాద్ సభలో చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి డబుల్ ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని మోదీ ఆరోపణ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కేటీఆర్ దీటైన కౌంటర్ వేశారు. ఎక్స్ ద్వారా కేటీఆర్ సుదీర్ఘ ప్రశ్నలు వేశారు.

“ఛోటా భాయ్ అక్రమంగా.. “డబుల్ - R” టాక్స్ వసూలు చేస్తుంటే.. కేంద్రంలో అధికారంలో ఉన్న మీరేం చేస్తున్నారు? మీ రాజకీయ ప్రత్యర్థులపై.. కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తున్నారు.. మరి ఛోటా భాయ్ నిర్వాకాన్ని మాత్రం ఎందుకు క్షమిస్తున్నారు?

ఇవాళ ఛోటాభాయ్ అక్రమాలను.. “డబుల్ –R” టాక్స్ వసూళ్లను చూసీ చూడనట్టు వదిలేస్తే.. రేపు “డబుల్ ఇంజన్ సర్కారు” ఏర్పాటుకు మీకు సహకరిస్తాడనా? తెలంగాణ వరప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టుపై కూడా.. బడే భాయ్, ఛోటా భాయ్ ది ఒకే మాట – ఒకే బాట. ఒకరు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును బలిచేయాలని చూస్తుంటే.. మరొకరు తమిళనాడు కోసం తాకట్టుపెట్టాలని ప్రయత్నిస్తున్నారు. గోదావరి జలాలను తరలించుకుని పోవాలనేనా కాళేశ్వరంపై ఈ కక్ష..? మీకు, మీ కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రైతులపై ఎందుకీ వివక్ష..?? పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణకు వచ్చారు. మరి అదే పార్లమెంట్ లో ఇచ్చిన హామీలకు ఎందుకు పాతరేశారు? పదేళ్లు గడిచినా తెలంగాణ విభజన హక్కులను ఎందుకు కాలరాశారు?

అత్యున్నత చట్టసభలో ఇచ్చిన హామీలకే దిక్కులేకపోతే.. బహిరంగ సభల్లో బీజేపీ వాగ్దానాలను ప్రజలెలా విశ్వసిస్తారు? కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను దెబ్బతీసే.. ఈ ఫెవికాల్ బంధంపై యుద్ధానికి తెలంగాణ సమాజం సిద్ధం.. !! అచ్చే దిన్, సబ్ కా సాత్, సబ్ కా విశ్వాస్ అంటూ.. మీరిచ్చిన నినాదాలు ఎందుకు విధానాలుగా మారలేదో చెప్పండి.

పదేళ్ల బీజేపీ పాలన తరువాత కూడా ఉచిత రేషన్ పథకం కింద దేశంలో 80 కోట్ల మంది పేదలు.. ఎందుకు ఉన్నారో వివరించండి.. వికసిత్ భారత్ ఎలా సాధ్యమో సెలవివ్వండి. మండుతున్న ధరలపైనా.. తీవ్రమవుతున్న నిరుద్యోగంపైనా.. దళితులపై జరుగుతున్న దాడులపైనా.. మైనారిటీల్లో పెరుగుతున్న అభద్రతపైనా.. ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం అన్యాయం..

అవినీతిపరులకు బీజేపీని కేరాఫ్ గా మార్చి.. రాజకీయ ప్రత్యర్థులపై కక్షగట్టి పెడుతున్న కేసులను.. ఎలాంటి ఆధారాలు లేకుండా చేస్తున్న అక్రమ అరెస్టులను.. తెలంగాణ ప్రజలే కాదు.. యావత్ భారత సమాజం గమనిస్తోంది.. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేసిన కాంగ్రెస్ కు ఏ దుస్థితి పట్టిందో.. త్వరలో బీజేపీకి కూడా దేశ ప్రజానీకం అదే గుణపాఠం చెప్పి తీరుతుంది. 

రాజ్యాంగంపై ప్రమాణం చేసి.. అదే రాజ్యాంగాన్ని కాలరాయడం భావ్యమా..? అవే రాజ్యాంగ సంస్థలను దెబ్బతీయడం ధర్మమా..? నాడు కాంగ్రెస్ పాలనలో దేశం ఎమర్జెన్సీని చూసింది.. నేడు బీజేపీ హయాంలో అనధికార ఎమర్జెన్సీని చవిచూస్తోంది.. ఎన్ని సవాళ్లు ఎదురైనా... ఇంకెన్ని నిర్బంధాలు విధించినా.. రాజ్యాంగాన్ని రక్షించుకుంటాం..! తెలంగాణ హక్కులను కాపాడుకుంటాం..!!’’ అని కేటీఆర్ పోస్ట్ చేశారు.

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Building Collapse: గచ్చిబౌలిలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల బిల్డింగ్.. ఇద్దరు మృతి!
గచ్చిబౌలిలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల బిల్డింగ్.. ఇద్దరు మృతి!
Breaking News: హైదరాబాద్‌లోని కూలిన ఏడు అంతస్తుల భవనం! 
హైదరాబాద్‌లోని కూలిన ఏడు అంతస్తుల భవనం! 
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Embed widget