అన్వేషించండి

Mlc Kavitha: ఓన్లీ నేమ్ చేంజింగ్, మిగతాదంతా సేమ్ టు సేమ్ - తెలంగాణ బడ్జెట్‌పై ఎమ్మెల్సీ కవిత

Budget Session: ఇవాళ అసెంబ్లీ తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్‌పై బీఆర్ఎస్ నేతలు విమర్శలు కురిపిస్తున్నారు.

Telangana Budget 2024: రేవంత్ రెడ్డి సర్కార్ ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC Kavitha) స్పందించారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌లో పూర్తి కేటాయింపు లేదని, రానున్న ఐదు ఏళ్ల ప్రణాళికకు సంబంధించి బడ్జెట్ లేదని విమర్శించారు. ఎన్నికల హామీల గురించి బడ్జెట్‌లో చెప్పలేదని, పాత పేర్లను తీసి కొత్త పేర్లను మాత్రమే పెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఓన్లీ నేమ్ చేంజింగ్ మాత్రమేనని, గేమ్ చేంజర్ కాదని అన్నారు.  గత ప్రభుత్వాన్ని విమర్శించడానికే సమావేశాలు పెట్టారని కవిత వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా నిరాశపర్చిందని, రాష్ట్రంలో ప్రగతి గేర్చు మార్చే అంశాలేవి బడ్జెట్‌లో లేవని అన్నారు. ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా చూస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారని, కానీ బడ్జెట్ ప్రసంగంలో ఆ ప్రస్తావనే లేదని కవిత  అన్నారు.

బడ్జెట్ ఆశాజనకంగా లేదన్న కవిత 
బడ్జెట్ సమావేశాల సందర్బంగా శాసనమండలి సమావేశాలకు కవిత హాజరయ్యారు. ఈ సందర్బంగా మీడియా పాయింట్‌లో ఆమె మాట్లాడారు. బడ్జెట్ ఆశాజనకంగా లేదని, అంకెల గారడీ మాత్రమేనని ఆరోపించారు. అయితే లోక్‌సభ ఎన్నికలు వస్తున్న తరుణంలో నాలుగు నెలల కాలానికి మాత్రమే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. జులై వరకు బడ్జెట్ అనుమతి కోసం ప్రతిపాదనలు పెట్టారు. జులై నెలాఖరులో 2024-25 ఆర్దిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం రూ.2,75,891 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను అసెంబ్లీలో ఆర్ధికశాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. బడ్జెట్‌లో రెవెన్యూ వ్యం రూ.2,01,178 కోట్లు, మూలధన వ్యయం రూ.29,669 కోట్లుగా ప్రస్తావించారు. ఆరు గ్యారెంటీలకు ఏకంగా రూ.53,196 కోట్లు కేటాయించగా.. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్దికి రూ.40,080 కోట్ల కేటాయింపులు జరిగాయి. అలాగే రైతు రుణమాఫీపై త్వరలోనే కార్యాచరణ ఉంటుందని బడ్జెట్ ప్రసంగంలో భట్టి స్పష్టం చేవారు.

అయితే బడ్జెట్ సమావేశాలకు మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరవుతారని అందరూ అనుకున్నారు. కానీ కీలకమైన బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ డుమ్మా కొట్టారు. ఇటీవల అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్‌లో ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణస్వీకరాం చేశారు. దీంతో బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ వస్తారని రాజకీయ వర్గాలు భావించాయి.  కానీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్బంగా జరిగిన గవర్నర్ ప్రసంగానికి, ఆ తర్వాత గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే చర్చకు కూడా కేసీఆర్ హాజరుకాలేదు. ప్రస్తుతం కేసీఆర్ బంజారాహిల్స్ నందినగర్‌లోని నివాసంలో ఉన్నారు. ఈ నెల 13న నల్లగొండలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభ వేదికగా లోక్‌సభ ఎన్నికలకు కేసీఆర్ శంఖారావం పూరించనున్నారు.  ఈ బహిరంగ సభ ఏర్పాట్లపై నేతలతో కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు.  

నల్లగొండలో నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లను మాజీ మంత్రి జగదీష్ రెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇవాళ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతతూ.. తెలంగాణ దద్దరిల్లేలా సభ నిర్వహిస్తామని, ఈ సభలో కేసీఆర్ పాల్గొంటారని తెలిపారు. కృష్ణా ప్రాజెక్టులను తిరిగి రాష్ట్ర పరిధిలోకి తీసుకురావాలని, కృష్ణా జలాల సాధన కోసమే నల్లగొండలో సభ నిర్వహిస్తున్నట్లు జగదీష్ రెడ్డి తెలిపారు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Actress Kasthuri: సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Actress Kasthuri: సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Crime News: పసికందు గుండె చీల్చిన కన్నతల్లి - తాంత్రిక విద్యలతో మళ్లీ బతికిస్తాననే మూఢ విశ్వాసం, జార్ఖండ్‌లో ఘోరం
పసికందు గుండె చీల్చిన కన్నతల్లి - తాంత్రిక విద్యలతో మళ్లీ బతికిస్తాననే మూఢ విశ్వాసం, జార్ఖండ్‌లో ఘోరం
Miss Universe 2024: విశ్వ సుందరిగా డెన్మార్క్ భామ - ఆ దేశ తొలి మహిళగా రికార్డు
విశ్వ సుందరిగా డెన్మార్క్ భామ - ఆ దేశ తొలి మహిళగా రికార్డు
TGPSC Group III: తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
Embed widget