Breaking News Live: శ్రీకాకుళం జిల్లా రాజాం డిఏవి స్కూల్లో కరోనా కలకలం
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం
LIVE
Background
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ఇంకా కొనసాగుతోంది. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై ఎక్కువగా ఉంటుంది. అందుకే మూడు రోజుల పాటు తేలిక పాటి వర్షాలు కురవనున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో వర్షాలు పడే అవకాశం ఉంది. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
నెల్లూరు జిల్లా కోస్తా భాగాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ప్రకాశం జిల్లా దక్షిణ భాగాలు, చిత్తూరు జిల్లా తూర్పు భాగాల్లో కూడా మోస్తరు వర్షాలు పడతాయి. కడప జిల్లా తూర్పు భాగాల్లోకి కూడా వర్షాలు విస్తరిస్తాయి. ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది వాతావరణ శాఖ.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు వరుసగా రెండోరోజు నిలకడగా ఉంది. వెండి ధరలో భారీ తగ్గుదల కనిపించింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ.44,960 గా ఉంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ప్రస్తుతం రూ.49,050 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర రూ.700 మేర భారీగా పతనం కావడంతో హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.64,800గా ఉంది.
ఏపీ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు దాదాపు ఇదే రేట్లలో విక్రయాలు జరుగుతున్నాయి. విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,960 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,050 అయింది. ఇక్కడ వెండి ధర కేజీ రూ.64,800 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర నిలకడగా ఉంది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.44,960 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.49,050 అయింది.
హైదరాబాద్‌లో గత కొన్ని రోజుల నుంచి ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20 వద్ద ఉండగా.. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా నిలకడగానే ఉంది. ఇక వరంగల్‌లోనూ పెట్రోల్ ధర 0.27 పైసలు పెరగగా.. డీజిల్‌పై 0.25 పైసలు పెరిగింది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.96... డీజిల్ ధర రూ.94.39 గా విక్రయాలు జరుగుతున్నాయి. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం దాదాపు ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
ఇక విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధర నేడు తగ్గింది. లీటరుకు రూ.0.16 పైసలు తగ్గడంతో ప్రస్తుతం రూ.110.35 అయింది. డీజిల్ ధర కూడా రూ.0.15 పైసలు తగ్గడంతో రూ.96.44గా ఉంది. అయితే, అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉన్నాయి. విశాఖపట్నం మార్కెట్‌లో పెట్రోల్ ధర 0.17 పైసలు తగ్గడంతో నేడు లీటర్ పెట్రోల్ ధర రూ.109.05గా ఉంది. డీజిల్ ధర 0.16 పైసల మేర తగ్గడంతో విశాఖపట్నంలో డీజిల్ ధర లీటర్ రూ.95.18కి దిగొచ్చింది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
శ్రీకాకుళం జిల్లా రాజాం డిఏవి స్కూల్లో కరోనా కలకలం
శ్రీకాకుళం జిల్లా రాజాం డిఏవి స్కూల్లో కరోనా కలకలం రేపింది. గురువారం ఇద్దరు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్ గా నిర్దారించారు. ఉపాధ్యాయులకు, విద్యార్థులకు కరోనా నిర్ధారణ వైద్య పరీక్షలు చయగా... మరో 9 మంది విద్యార్థులకు కరోనా సోకినట్లు తేలింది. పిల్లలకు కరోనా సోకడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కరోనా నిర్ధారణ అయిన విద్యార్థులను ఐసోలేషన్ కు తరలించారు.
స్వగ్రామానికి చేరిన వింగ్ కమాండర్ పీఎస్ చౌహాన్ భౌతికకాయం
వింగ్ కమాండర్ పీఎస్ చౌహాన్ భౌతికకాయాన్ని ఆగ్రాలోని శరణ్ నగర్‌లోని ఆయన నివాసానికి తరలించారు. డిసెంబర్ 8న తమిళనాడులో కూలిన హెలికాప్టర్ ఘటనలో చౌహాన్ తో పాటు మొత్తం 13 మంది కన్నుమూయడం తెలిసిందే. ఒక్కొక్కరి భౌతికకాయాలు గుర్తించి వారి కుటుంబాలకు చేరవేస్తోంది ఆర్మీ.
సాయితేజ కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
హెలికాప్టర్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన చిత్తూరు జిల్లా వాసి లాన్స్ నాయక్ సాయితేజ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. సాయితేజ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థికసాయం అందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం కార్యాలయం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
వ్యాక్సిన్ వేసుకున్న వ్యక్తికి ఒమిక్రాన్.. దిల్లీలో రెండో కేసు నమోదు
వ్యాక్సిన్ వేసుకున్న వ్యక్తికి ఒమిక్రాన్ సోకింది. జింబాబ్వే నుంచి వచ్చిన దిల్లీ వాసికి పరీక్షలు చేస్తే ఒమిక్రాన్ ఉన్నట్టు బయపడింది. దిల్లీలో వెలుగు చూసిన రెండో కేసు ఇది. ఆయన దక్షిణాఫ్రికా వెళ్లి వచ్చినట్టు అధికారులకు చెప్పాడు.
వ్యాక్సిన్ వేసుకున్న వ్యక్తికి ఒమిక్రాన్.. దిల్లీలో రెండో కేసు నమోదు
వ్యాక్సిన్ వేసుకున్న వ్యక్తికి ఒమిక్రాన్ సోకింది. జింబాబ్వే నుంచి వచ్చిన దిల్లీ వాసికి పరీక్షలు చేస్తే ఒమిక్రాన్ ఉన్నట్టు బయపడింది. దిల్లీలో వెలుగు చూసిన రెండో కేసు ఇది. ఆయన దక్షిణాఫ్రికా వెళ్లి వచ్చినట్టు అధికారులకు చెప్పాడు.