అన్వేషించండి

Kishan Reddy On Medigadda barrage: 80వేల పుస్తకాలు చదివి కేసీఆర్ ఇంజనీర్ అయ్యారు - మేడిగడ్డ కుంగడంపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Kishan Reddy On Kaleshwaram Project: తెలంగాణలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అని కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్ర సంపదకు నష్టం కలిగించిందని కిషన్ రెడ్డి ఆరోపించారు.

Kishan Reddy criticises KCR over Kaleshwaram Project:

కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ బ్రిడ్జి కుంగిపోవడంపై కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. బ్యారేజీ కుంగిపోవడం విషయం తెలుసుకుని పరిశీలించేందుకు వెళ్లిన ఇంజినీర్లను అడ్డుకున్నారని తెలిపారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పరిశీలించేందుకు వెళ్తారని కిషన్ రెడ్డి తెలిపారు. వేలకోట్లు వెచ్చించి నిర్మించిన ఈ ప్రాజెక్టుపై ఇరిగేషన్ ఇంజినీర్లు మొదట్నుంచీ వ్యక్తం చేసిన అనుమానాలు ఇప్పుడు వాస్తవంగా తేలాయన్నారు. సూపర్ ఇంజనీర్లు, డ్రీమ్ ప్రాజెక్టు అంటూ కేసీఆర్ జబ్బలు చరుచుకున్నారు. 80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ ఇంజినీర్ గా మారి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారంటూ సెటైర్లు వేశారు. నిపుణులు, ఇంజనీర్ల మాటల్ని పట్టించుకోకుండా నిర్మించిన ప్రాజెక్టు సమస్యలమయంగా మారిందన్నారు.

తెలంగాణలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అని కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్ర సంపదకు నష్టం కలిగించిందన్నారు. గతంలో గోదావరికి వరదలు వచ్చిన సమయంలో పంపులు మునిగిపోయి భారీగా నష్టం వాటిల్లిందన్నారు. యాంటీ గ్రావిటీ ప్రాజెక్టు అని గొప్పలుపోయారు కానీ గ్రాఫిక్స్ నిర్మాణాలతో ప్రభుత్వం బొక్కబోర్లా పడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం చూపిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతి ఏడాది 400 టీఎంసీల నీళ్లు ఎత్తిపోసి లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇస్తామని కేసీఆర్ చెప్పారు. 2019 జూన్ లో ప్రాజెక్టు ప్రారంభిస్తే.. ఏడాది చొప్పున ఈ నాలుగేళ్లలో కేవలం 100కి పైగా టీఎంసీల నీళ్లు మాత్రమే ఎత్తిపోశారని.. ఇది విచిత్రమైన ప్రాజెక్టు అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు  జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగడం చిన్న విషయం కాదన్నారు. కేవలం ప్రచార ఆర్భాటం కోసం బీఆర్ఎస్ చేపట్టిన ఈ ప్రాజెక్టును కేసీఆర్ ప్రపంచంలో మరెక్కడా లేదన్నారు. రాను రాను ఈ ప్రాజెక్టు భద్రతపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ సర్కార్ డ్యామ్ సేఫ్టీ మీద అథారిటీ ఏర్పాటు చేసి రిపోర్ట్ తయారుచేయాలని కోరారు. పూర్తి స్థాయిలో నష్టపోకుండా ముందుగానే సాధ్యమైనంత త్వరగా డ్యామ్ సేఫ్టీ అధికారులను ఏర్పాటు చేయాలన్నారు. 

రాత్రి ఒక్కసారిగా కుంగిన లక్మీ బ్యారేజీ 
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ (లక్ష్మి) గ్యారేజీ వంతెన ఒక్కసారిగా కుంగింది. మహాదేవపూర్ మండలం అంబటిపల్లి శివారులోని బీ బ్లాకులో 18, 19, 20, 21 పిల్లల మధ్య ఉన్న వంతెన శనివారం రాత్రి భారీ శబ్దంతో ఒక అడుగు మేర కుంగిపోయింది. బ్యారేజీ 20 ఫిల్లర్ కుంగడంతోనే పైన వంతెన దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 

అధికారులు అప్రమత్తం

బ్యారేజీ పొడవు 1.6 కిలోమీటర్లు ఉండగా సంఘటన జరిగిన ప్రదేశం మహారాష్ట్ర వైపు నుంచి 356 మీటర్ల సమీపంలో ఉంది. నీటి పారుదల శాఖ ఇంజినీర్లు డ్యాం పరిసరాల్లో అలర్ట్ ప్రకటించారు. మహారాష్ట్ర - తెలంగాణ రాష్ట్రాల మధ్య ఈ బ్యారేజీ పైనుంచి రాకపోకలు నిలిపివేశారు. గోదావరి నదిపై జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో 2019లో మేడిగడ్డ వద్ద ఈ బ్యారేజీ నిర్మించారు. కాళేశ్వరం ఎత్తిపోతల్లో ఇది మొదటిది. శనివారం రాత్రి సమయానికి ఎగువ నుంచి జలాశయానికి 25 వేల క్యూసెక్కుల వరకు ప్రవాహం వస్తుండగా 8 గేట్లు తెరిచి దిగువకు నీటిని వదులుతున్నారు. ఈ క్రమంలో భారీ శబ్దం రావడంతో ప్రాజెక్టు కార్య నిర్వాహక ఇంజినీరు తిరుపతిరావు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. వారు పరిశీలన చేస్తున్న సమయంలోను మరికొన్ని శబ్దాలు రావడంతో వెంటనే ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. 

టాప్ హెడ్ లైన్స్

Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Telangana Congress Rift: కాంగ్రెస్ మార్క్ అంతర్గత ప్రజాస్వామ్యం - రేవంత్ ఉక్కిరిబిక్కిరి - దారిలో పెట్టలేకపోతున్నారా?
కాంగ్రెస్ మార్క్ అంతర్గత ప్రజాస్వామ్యం - రేవంత్ ఉక్కిరిబిక్కిరి - దారిలో పెట్టలేకపోతున్నారా?
Ponguleti Srinivas Reddy: రేవంత్ సర్కార్‌కు మంత్రి పొంగులేటి సమస్యగా మారారా? కాంగ్రెస్ ల్యాండ్ మార్క్ గ్రాఫ్‌కు గండి కొడుతున్నాయా?
రేవంత్ సర్కార్‌కు మంత్రి పొంగులేటి సమస్యగా మారారా? కాంగ్రెస్ ల్యాండ్ మార్క్ గ్రాఫ్‌కు గండి కొడుతున్నాయా?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Ram Pothineni : 'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
Embed widget