అన్వేషించండి

Bandi Sanjay: తెలంగాణలో దొంగలు పడ్డారు - గ్రామపంచాయతీ నిధుల మళ్లింపుపై బండి సంజయ్ ఫైర్

Gram Panchayat Funds: గ్రామ పంచాయతీ నిధుల మళ్లింపుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. తెలంగాణను నాశనం చేసిన కేసీఆర్ దేశాన్ని ఉద్ధరించడానికి వెళ్తున్నారని విమర్శలు చేశారు.

Gram Panchayat Funds: బీఆర్ఎస్ బీజేపీలో ఆంధ్రా నాయకుల చేరిక సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఫైర్ అయ్యారు. తెలంగాణను నాశనం చేసిన కేసీఆర్ దేశాన్ని ఉద్ధరించడానికి వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ అధికారంలోకి వచ్చాక నిజాం షుగర్ ఫ్యాక్టరీలను మూసేసి తెలంగాణ ప్రజల దృష్టి మళ్లించేందుకు కేంద్రం ప్రైవేటికరణను ప్రోత్సహిస్తోందంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఉద్యమంలో చెప్పిన అజాంజాహీ మిల్లు ఏమైందని ఆయన అడిగారు.

రాష్ట్రంలో ఆర్టీసీ ఆస్తుల్ని కేసీఆర్ అమ్ముకుంటున్నారని బండి ఆరోపించారు. ఎన్నికలకు ముందు తెలంగాణ సెంటిమెంట్ రగిలించి, ఆంధ్రావాళ్లను తిట్టి, జై తెలంగాణ పేరుతో ఓట్లేయించుకున్న కేసీఆర్ ఇప్పుడు ఆంధ్రాలో ఓట్ల కోసం జై తెలంగాణ అన్న నినాదాన్ని కూడా పలకలేక పోతున్నారని అన్నారు. తెలంగాణలో ఆంధ్రవాళ్లు ప్రశాంతగా వ్యాపారాలు చేసుకోవాలంటే కల్వకుంట్ల కుటుంబానికి వాటా ఇవ్వాల్సిందే అని సంజయ్ పేర్కొన్నారు. 

గతంలో కేసీఆర్ ఆంధ్ర ప్రజల ఆహారాల్ని ఎగతాళిగా మాట్లాడి రాక్షసానందం పొందిన విషయాన్ని అక్కడి ప్రజలు మరిచిపోగలరా అని సంజయ్ అన్నారు. పెండ బిర్యానీ అని, ఉలవచారును ఇక్కడ పశువులు తింటాయని కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్ని వాళ్లేవిధంగా జీర్జించుకుంటారని సంజయ్ ప్రశ్నించారు. అవకాశ వాదం కోసం కేసీఆర్ ఎన్ని వేషాలైనా వేస్తారని ఆయన విమర్శించారు. వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రకు పోయినట్లు కేసీఆర్ ఆంధ్ర ప్రజల విషయంలో సత్తెపూసలా మాట్లాడుతున్నారని అన్నారు. రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా రాష్ట్రంలో ఎక్కడ ఉందని సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ అనాలోచిత నిర్ణయాల వల్ల విద్యుత్ సంస్థలు రూ.60 వేల కోట్ల నష్టాల్లో కూరుకుపోయాయని చెప్పారు. కేవలం ప్రభుత్వ శాఖలే రూ.20 వేల కోట్లు బాకీ పడ్డాయని గుర్తు చేశారు. పొలం కాడా ఫ్రీ ఇస్తూ, ఇంట్లో కరెంట్ ఛార్జీలు పెంచారని ఆరోపించారు. 

నీటిపారుదల రంగంలో కేసీఆర్ రాష్ట్రానికి తీరని ఆన్యాయం చేశారని బండి విమర్శించారు. 30 వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టును లక్షా 30 వేల కోట్లకు పెంచి నిర్మించినప్పటికీ అదనంగా ఒక్క ఎకరానికి కూడా సాగునీరు అందలేదని ఆయన పేర్కొన్నారు. పైగా మొన్నటి వర్షాలకు ప్రాజెక్టు పంపుసెట్లు మునిగిపోయాయని అన్నారు. ఆర్డీఎస్ దగ్గర కుర్చీ వేసుకుని కూర్చుంటా అన్న కేసీఆర్ ఇన్ని రోజులు ఎటుపోయారని ప్రశ్నించారు. ఆంధ్ర ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై కేసీఆర్ వైఖరి చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్ తీరు వలనే కృష్ణానదీ జాలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. కృష్ణా జలాల్లో 575 టీఎంసీలు రావాల్సి ఉండగా కేసీఆర్ సీఎం అయ్యాక కేవలం 299 టీఎంసీలకే ఒప్పుకున్నారని, కనీసం వాటిని కూడా పూర్తిగా వినియోగించుకునే పరిస్థితిలో తెలంగాణ లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఇక్కడ 18 లక్షల వ్యవసాయ పంపుసెట్లు ఉంటే ఇప్పుడు 23 లక్షలకు పెరిగాయని, కేసీఆర్ సాగును పెంచితే ఇదెలా సాధ్యం అని సంజయ్ ప్రశ్నించారు. 

మిగులు ఆదాయంతో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా అధోగతికి పడేసిన కేసీఆర్ దేశ ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడటం వింతగా ఉందన్నారు. కేసీఆర్ పాలనలో పాఠశాల విద్యలో దేశంలోనే తెలంగాణ 4వ గ్రేడ్ లో, నిరుద్యోగంలో దేశంలో 5వ స్థానం, దక్షిణాది రాష్ట్రాల్లో నంబర్ వన్ స్థానంలో ఉందని అన్నారు. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలోనే 4వ స్థానంలో ఉందని, 2022లో మహిళలపై అత్యాచారాలు, హత్యలు 17 శాతం పెరిగాయని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడ్డప్పుడు మద్యం ద్వారా ఆదాయం రూ.10 వేల కోట్లుంటే నేడు రూ.44 వేల కోట్లకు పెరిగిందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, ఆసరా లాంటి స్కీంలకు రూ.20 నుంచి 30 వేల కోట్లే ఖర్చవుతాయని, మిగతావి ఎటు పోతున్నాయని ప్రశ్నించారు. ఫీజ్ రీయంబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయడం లేదని, ఉద్యోగస్థులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందని చెప్పారు. కేంద్ర నిధుల్ని 32 శాతం నుంచి 41 శాతానికి పెంచి గొప్ప వ్యక్తి అని ప్రధాని మోడీ గారని పొగిడిన కేసీఆర్ ఆ నిధుల్ని ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. 

మేకిన్ ఇండియాపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సంజయ్ మండిపడ్డారు. కరోనా సమయంలో 100కు పైగా దేశాలకు వ్యాక్సిన్ ను అందించిన దేశం భారత్ అని, ఎన్నో దేశాలకు నేడు ఆయుధాలను మన దేశం ఎగుమతి చేస్తోందని వివరించారు. కేసీఆర్ ఇంకా 2014కు పూర్వం ఉన్న పరిస్థితుల గురించే మాట్లాడుతున్నారని, ఆయన అప్ డేట్ కావాలని సూచించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా పెద్ద కుట్ర అని ఆయన అన్నారు. కేవలం నోటిఫికేషన్లే తప్ప అపాయింట్ మెంట్లు లేవని ప్రశ్నించారు. కేసీఆర్ తరుచుగా చైనా, పాకిస్థాన్, జింబాంబ్వే, సింగపూర్ అంటూ మాట్లాడుతున్నారని, కేసీఆర్ డీఎన్ఏలో ఏమైనా తేడా ఉందేమోనని సంజయ్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ చేసే జిమ్మిక్కుల్ని ఇప్పుడు నమ్మడానికెవరూ సిద్ధంగా లేరని ఆయన అన్నారు. గతంలో మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే బయటకు వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే విమర్శించిన కేసీఆర్ మరి ఆంధ్రా సిట్టింగ్ ఎమ్మెల్యేలు టచ్ ఉన్నారంటే దాని అర్థం ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. 

తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడేది బీజేపీ మాత్రమే అన్న విశ్వాసం తెలంగాణ ప్రజల్లో ఉందని, వారు మార్పు కొరుకుంటున్నారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన చెప్పారు. రాష్ట్రాన్ని కాపాడలేని వారు దేశాన్ని ఎట్లా ఉద్ధరిస్తారని ప్రశ్నించారు. దళిత బంధు పేరుతో, దళితుడికే ముఖ్యమంత్రి, దళితులకు 3 ఎకరాల భూమి పేరుతో కేసీఆర్ మోసం చేశారని సంజయ్ విమర్శించారు.  అదే మోదీ గారి ప్రభుత్వం దేశంలోని లక్షా 25 వేల బ్యాంకు బ్రాంచీల్లో ప్రతి ఏటా 10 కోట్ల రుణాలివ్వాలనే నిబంధనతో 10 లక్షల మంది దళితుల్ని వ్యాపారులు, పారిశ్రామికవేత్తల్ని చేసిందని చెప్పారు. రోజ్ గార్ మేళా పేరుతో మోదీ గారి ప్రభుత్వం సంవత్సరంలో 10 లక్షల మందికి ఉద్యోగాలిస్తోందని చెప్పారు. ఎన్నికలు రాగానే నోటిఫికేషన్ల డ్రామా ఆడటం కేసీఆర్ కు పరిపాటిగా మారిందన్నారు. నోటిఫికేషన్లలో అన్ని లోపాలే అన్నారు. పోలీసు ఉద్యోగాల్లో ఏ రాష్ట్రంలో లేని నిబంధనలతో 2 లక్షల మంది అభ్యర్థులు ఇబ్బంది పడ్డారని సంజయ్ అన్నారు.

భారత్ ను ప్రపంచంలో విశ్వగురుగా నిలపాలి, ఆత్మనిర్భర్ భారత్, మేకిన్ ఇండియా, 5 ట్రిలియన్ ఎకానమి, అభివృద్ధి చెందిన భారత్ గా నిలపడమే లక్ష్యంగా ప్రధాని మోదీ పని చేస్తున్నారని సంజయ్ చెప్పారు.  ప్రపంచంలో ఆర్థిక సుస్థిరత ఉన్న దేశాల్లో 11 స్థానంలో ఉన్న భారత్ నేడు 5 స్థానంలో, 2030 వరకు 3వ స్థానానికి చేర్చడమే లక్ష్యం అన్నారు. కేసీఆర్ లాంటి వారికి దేశాన్ని అప్పుల పాలు చేయడం, దేశాన్ని లిక్కర్ తాగించి ఉగేలా చేయడం, కుటుంబం లిక్కర్ దందా చేయడం, దేశంలోని భూముల్ని కబ్జా చేయడం, విదేశాల్లో డబ్బులు దాచుకోవడమే లక్ష్యం అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ స్వయం ప్రకటిత మేధావి, ఇంజనీర్, ప్యారసిటమాల్ డాక్టర్ అంటూ సంజయ్ ఎద్దేవా చేశారు. గ్రామ పంచాయతీ నిధుల విషయంలో తెలంగాణలో దొంగలు పడ్డారని, ఆ దొంగల ముఠా నాయకుడు కేసీఆర్ అని దేశం అంతా చర్చ జరుగుతోందని ఆరోపించారు. త్వరలోనే సర్పంచిలంతా తిరగబడటం ఖాయం అని చెప్పారు. వెంటనే దారి మళ్లించిన గ్రామ పంచాయతీ నిధుల్ని డిపాజిట్ చేయాలని డిమాండ్ చేశారు. పక్క రాష్ట్ర సర్పంచిలు బీఆర్ఎస్ లో చేరతున్నారని కేసీఆర్ పత్రికల్లో రాసుకుంటే అక్కడి వాళ్లు ఖండించారని సంజయ్ గుర్తు చేశారు. వాస్తవాల్ని దాచలేరని ఆయన అన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, భారీ పేలుడుతో చెలరేగిన మంటలు - 28 మంది మృతి
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, భారీ పేలుడుతో చెలరేగిన మంటలు - 28 మంది మృతి
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, భారీ పేలుడుతో చెలరేగిన మంటలు - 28 మంది మృతి
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, భారీ పేలుడుతో చెలరేగిన మంటలు - 28 మంది మృతి
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Hyderabad News: డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Embed widget