అన్వేషించండి

BJP On Rajagopal : పోతే పొండి నిందలు ఎందుకు ? - రాజగోపాల్ రెడ్డిపై బీజేపీ నేతలఆగ్రహం !

రాజీనామా చేసి పార్టీపై విమర్శలు చేయడం సరి కాదని బీజేపీ నేతలు రాజగోపాల్ రెడ్డికి హితవు పలికారు. బీఆర్ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయం అన్నారు.

 

BJP On Rajagopal :  తెలంగాణలో  బీఆర్ఎస్‌ను ఓడించేది కాంగ్రెస్ పార్టీనేనని ఆ పార్టీలో చేరేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సిద్ధమయ్యారు. అయితే ఆయన రాజీనామాపై తెలంగాణ బీజేపీ నేతలు భిన్నంగా స్పందించారు. రాజీనామా వ్యక్తిగతమని  కానీ బీజేపీపై నిందలు వేయడం ఏమిటని ప్రశ్నించారు. 

బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే : కిషన్ రెడ్డి 
 

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపికి రాజీనామా చేయడంతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను కిషన్ రెడ్డి ఖండించారు. రాజగోపాల్ రెడ్డి అనుకున్నట్టు బిఆర్‌ఎస్‌కు బిజెపి పోటీ కాకుండా పోదన్నారు. ఎవరి ఇష్టం వారిది.. ఎవరి ఆలోచనలు వారివని వ్యాఖ్యానించారు. బీజేపీకి రాజీనామా చేస్తూ రాజగోపాల్‌రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలను కిషన్ రెడ్డి తప్పుబట్టారు. బీజేపీ పోటీలో లేదని వారు అనుకుంటే సరిపోతుందా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనకు చెక్ పెట్టేది తామేనని కిషన్ రెడ్డి మరోమారు స్పష్టం చేశారు.

పార్టీపై నిందలు వేయడం సరి కాదు : లక్ష్మణ్ 

మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేయడంపై ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ తీవ్రంగా స్పందించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... పార్టీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలు ఓ వైపు రక్తం చిందిస్తుంటే ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదని మండిపడ్డారు. జాతీయ నాయకత్వం సమక్షంలో ఆయన తమ పార్టీలో చేరారని, ఇప్పుడు నిందలు వేయడం సరికాదన్నారు. రాజగోపాల్ రెడ్డికి జాతీయస్థాయిలో పార్టీ మంచి స్థానం కల్పించిందన్నారు. నరేంద్ర మోదీ కచ్చితంగా మూడోసారి ప్రధాని అవుతారన్నారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఏం చేసిందో తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్నారు. బీజేపీ అందరిలోనూ జాతీయ భావాన్ని పెంపొందిస్తుందన్నారు. జనసేన, బీజేపీ కలిసి తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఆయన చెప్పారు.

జీవితాంతం బీజేపీలో ఉంటానన్నారు : ఈటల 
 
రాజ గోపాల్ రెడ్డి రాజీనామా చేయాల్సింది కాదని ఈటల రాజేందర్ అన్నారు.  రాజకీయాల్లో రాజ గోపాల్ రెడ్డి సీనియర్ నాయకులని అన్నారు. పార్టీ మారె ముందు అలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుండేది కాదని తెలిపారు. మొన్ననే బీఆరెస్ కు.. బీజేపీయే ప్రత్యామ్నాయమని చెప్పిన రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు ఎలా మాట మార్చారు? అని ప్రశ్నించారు.   ఈ ఎన్నికల్లో కేసీఆర్ ని తాను ఓడించడం ఖాయమని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. 

కొందరు అలా వచ్చి వెళ్తుంటారు: జితేందర్ రెడ్డి

రాజగోపాల్ రెడ్డి పాసింగ్ క్లౌడ్ వంటి వారని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు. బీజేపీ తెలంగాణలో ఎప్పుడూ బలంగానే ఉందని... ఉంటుందని, కానీ కొందరు నేతలు అలా వచ్చి వెళ్తుంటారన్నారు. తాను లోక్ సభకు పోటీ చేయాలనుకుంటున్నట్లు స్పష్టం చేశారు.

రాజగోపాల్ రెడ్డి శరీరం మాత్రమే బీజేపీలో : బూర నర్సయ్య గౌడ్ 

రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరినప్పటి నుంచి ఆయన శరీరం మాత్రమే బీజేపీలో ఉందని, కానీ ఆత్మ కాంగ్రెస్ పార్టీలో ఉండిపోయిందని బూర నర్సయ్య గౌడ్ అన్నారు. ఆయన బీజేపీకి రాజీనామా చేయడం బ్రేకింగ్ న్యూస్ ఏమీ కాదని, అందరూ ఊహించిందే అన్నారు. రాజగోపాల్ రెడ్డి చెప్పినంత మాత్రాన బీఆర్ఎస్‌కు తమ పార్టీ ప్రత్యామ్నాయం కాకుండా పోదన్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. కేసీఆర్‌ను ప్రగతి భవన్ నుంచి పంపించివేయాలని రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ చూస్తున్నారన్నారు. బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే అన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
Look Back 2024: అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
Stock Market: కేంద్ర బడ్జెట్ శనివారం రోజున వస్తే స్టాక్ మార్కెట్లకు సెలవు ఇస్తారా, ఓపెన్‌ చేస్తారా?
కేంద్ర బడ్జెట్ శనివారం రోజున వస్తే స్టాక్ మార్కెట్లకు సెలవు ఇస్తారా, ఓపెన్‌ చేస్తారా?
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Embed widget