అన్వేషించండి

Mallu Nandini: ఖమ్మం ఎంపీ టిక్కెట్ కోసం బలప్రదర్శన - డిప్యూటీ సీఎం సతీమణి భారీ ర్యాలీ

Bhatti Vikramarka wife : ఖమ్మం ఎంపీ టిక్కెట్ కోసం భట్టి విక్రమార్క సతీమణి నందిని భారీ ర్యాలీ నిర్వహించారు. ఐదు వందల కార్లతో ర్యాలీగా వచ్చి ఎంపీ టిక్కెట్ కోసం దరఖాస్తు సమర్పించారు.

Mallu Nandini: తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని ఖమ్మం పార్లమెంట్ సీట్ కోసం దరఖాస్తు సమర్పించారు. తన మద్దతుదారులతో కలిసి అట్టహాసంగా గాంధీ భవన్‌కు వచ్చి స్వయంగా దరఖాస్తు చేశారు. ఇప్పటికే ఆమె మద్దతుదారులు ఒకసారి దరఖాస్తు సమర్పించారు. ఈరోజు ఆమె స్వయంగా వచ్చి అప్లికేషన్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆమె అనుచరులు బ్యాండ్ మేళా, టపాసుల మోతలతో గాంధీ భవన్ వద్ద హంగామా చేశారు. అంతకుముందు దాదాపు 500 కార్ల కాన్వాయ్ తో ఖమ్మం నుంచి ఆమె భారీ ర్యాలీగా తరలివచ్చారు. ఖమ్మం నగరంలోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత భారీ కాన్వాయ్ తో ర్యాలీగా హైదరాబాద్ వచ్చారు.   ప్రత్యక్ష రాజకీయాలలో వస్తున్నానని, ఖమ్మం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. సోనియా, ప్రియాంక పోటీకి దిగినా.. లేక హైకమాండ్ ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పని చేస్తామని తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే తమందరి లక్ష్యమని చెప్పుకొచ్చారు. 

ఖమ్మం లోక్​సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు పలువురు నాయకులు ఆసక్తి చూపడంతో  ఆసక్తి నెలకొంది. ఇటీవల మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరి ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడి నుంచి సోనియా గాంధీ పోటీ చేస్తారని లేకుంటే, తానే బరిలో నిలుస్తానని స్పష్టం చేశారు. ఇదే సీటు కోసం కేంద్ర మాజీమంత్రి రేణుకాచౌదరి, మరో రాష్ట్రమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాదరెడ్డి, ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌లు కూడా పోటీలో ఉన్నారనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే.. ఖమ్మం లోక్‌సభ సెగ్మెంట్‌ నుంచి బరిలో ఉంటారనే వార్తలు కూడా వస్తున్నాయి. దీంతో ఇప్పుడు ఖమ్మం కాంగ్రెస్‌ పార్టీ హాట్‌సీటుగా మారిందనే చెప్పవచ్చు.                                      

తెలంగాణ రాష్ట్రంలో  పార్లమెంట్ ఎన్నికలను  కాంగ్రెస్ పార్టీ  ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్రంలోని 19 పార్లమెంట్ స్థానాలున్నాయి.ఈ 17 స్థానాల్లో  మెజారిటీ స్థానాలను దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తుంది.ఈ మేరకు ఆయా పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఇంచార్జీలుగా మంత్రులను ఆ పార్టీ నియమించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఖమ్మంలో భారీ మెజార్టీ వచ్చింది.   అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రత్యర్థులకు అందనంత దూరంలో ఉండటంతో గెలుపు ఖాయమని భావిస్తున్నారు. దీంతో టిక్కెట్ కోసం పోటీ పడే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. 

మల్లు భట్టి విక్రమార్క హైకమాండ్ వద్ద కూడా తన భార్యకు టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎవరి పేరునూ సిఫారసు చేయడం లేదని..  సోనియా గాంధీని మాత్రం పోటీ చేయాలని కోరుతున్నారని అంటున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ ఎవరికి సీటిస్తే వారిని గెలిపిస్తామని చెబుతున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Russia Ukraine War: ట్విన్ టవర్స్ పై  9/11 అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
రష్యాపై 9/11 తరహా దాడి.. కజాన్ నగరంలో భారీ టవర్స్‌పై డ్రోన్లతో ఎటాక్ర- వీడియో
2025 Upcoming Hybrid Cars: 2025లో లాంచ్ కానున్న హైబ్రిడ్ కార్లు- తక్కువ రేటు, బెస్ట్ మైలేజీ!
2025లో లాంచ్ కానున్న హైబ్రిడ్ కార్లు- తక్కువ రేటు, బెస్ట్ మైలేజీ!
Pawan Kalyan News: గిరిజనులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ - డోలీ మోతలకు చెక్ పెడుతూ రోడ్ల నిర్మాణం
Pawan Kalyan News: గిరిజనులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ - డోలీ మోతలకు చెక్ పెడుతూ రోడ్ల నిర్మాణం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడుశ్రీతేజ్‌ హెల్త్‌‌ బులెటిన్ రిలీజ్, బిగ్ గుడ్ న్యూస్!హైటెక్ సిటీలో పేలుడు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు పరుగో పరుగుAmbani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Russia Ukraine War: ట్విన్ టవర్స్ పై  9/11 అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
రష్యాపై 9/11 తరహా దాడి.. కజాన్ నగరంలో భారీ టవర్స్‌పై డ్రోన్లతో ఎటాక్ర- వీడియో
2025 Upcoming Hybrid Cars: 2025లో లాంచ్ కానున్న హైబ్రిడ్ కార్లు- తక్కువ రేటు, బెస్ట్ మైలేజీ!
2025లో లాంచ్ కానున్న హైబ్రిడ్ కార్లు- తక్కువ రేటు, బెస్ట్ మైలేజీ!
Pawan Kalyan News: గిరిజనులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ - డోలీ మోతలకు చెక్ పెడుతూ రోడ్ల నిర్మాణం
Pawan Kalyan News: గిరిజనులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ - డోలీ మోతలకు చెక్ పెడుతూ రోడ్ల నిర్మాణం
Sandhya Theatre Incident: రేవతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం, అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి ప్రకటన
రేవతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం, అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి ప్రకటన
BSNL Broadband Plan: బీఎస్ఎన్ఎల్ బెస్ట్ వైఫై ప్లాన్ - రోజుకు 200 జీబీ హైస్పీడ్ డేటా!
బీఎస్ఎన్ఎల్ బెస్ట్ వైఫై ప్లాన్ - రోజుకు 200 జీబీ హైస్పీడ్ డేటా!
Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Asifabad Student Dies: ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
Embed widget