అన్వేషించండి

Bandi Sanjay Kumar: మీ నిర్వాకంతో పండుగ పూట కోట్ల మందికి పస్తులే: సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ లేఖ

మీ నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం కారణంగా రాష్ట్రంలోని పేదలకు రేషన్‌ బియ్యం అందక పండుగ పూట పస్తులుండే దుస్థితి ఏర్పడటం క్షమించరాని నేరం అని సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు.

Bandi Sanjay Kumar Open Letter To Telangana CM KCR: సీఎం కేసీఆర్ నిర్వాకం కారణంగా తెలంగాణలోని మూడున్నర కోట్ల మంది ప్రజలు రేషన్‌ బియ్యం అందక సంక్రాంతి పండుగ పూట పస్తులుండబోతున్నారు. దేశంలోని పేద ప్రజలందరికీ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రేషన్‌ కార్డులున్న పేదలందరికీ ప్రతినెలా 5 కిలోల బియ్యాన్ని అందించాలని నిర్ణయం తీసుకుంది. జాతీయ ఆహార భద్రత చట్టం కింద తెలంగాణలోని సుమారు 55 లక్షలు కార్డుదారులకు అంటే 1 కోటి 92 లక్షల మంది లబ్ధిదారులకు సుమారు రూ.4,300 కోట్ల విలువైన 13 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని ఈనెల (జనవరి) ఒకటో తేదీ నుండి తెలంగాణకు అందిస్తోంది. ఆ సొమ్ముతో రాష్ట్రంలోని 90 లక్షల రేషన్‌ కార్డుదారులందరికీ (2.83 కోట్ల మంది ప్రజలకు) ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేసినా ఇంకా రూ.80 కోట్లకుపైగా ఆదాయం మిగులుతుంది. మీ నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం కారణంగా రాష్ట్రంలోని పేదలకు రేషన్‌ బియ్యం అందక పండుగ పూట పస్తులుండే దుస్థితి ఏర్పడటం క్షమించరాని నేరం అని సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు.

కేంద్రానికి పేరొస్తుందనే అక్కసుతో పేదల కడుపు కొట్టడం న్యాయమేనా ! 
కరోనా కాలంలోనూ కేంద్రం గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన పథకం కింద ఇచ్చిన బియ్యాన్ని కూడా పేదలకు అందకుండా రాష్ట్ర ప్రభుత్వం అనేకసార్లు అడ్డుకుంటూ పేదల కడుపు కొట్టడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. పేదలకు బియ్యాన్ని పంపిణీ చేస్తే కేంద్రానికి పేరొస్తుందనే అక్కసుతో పేదల కడుపు కొట్టడం ఎంతవరకు న్యాయమో ఆలోచించాలన్నారు. ఒక పక్కన రాష్ట్ర మంత్రులు, బీఆర్‌ఎస్‌ నాయకులు, అనామక ఎన్టీవో సంస్థ తయారు చేసిన గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌  పేరుతో  దేశ ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారంటూ నిత్యం కేంద్రాన్ని బదనాం చేసేందుకు దుష్ప్రచారం చేస్తున్న మీరు కేంద్రం ఉచితంగా ఇస్తున్న 5 కిలోల బియ్యాన్ని పేదలకు అందివ్వకపోవడం ఎంతవరకు సమంజసమో మీరే ఆలోచించాలన్నారు.

పేదలకు తక్షణ ఆసరా కోసం అందజేస్తున్న బియ్యాన్ని మీరు సకాలంలో పంపిణీ చేయకపోవడం వల్ల కోట్లాది మంది ప్రజలు ఆకలితో అలమటిస్తారనే కనీస అవగాహన మీకు లేకపోవడం బాధాకరం. ప్రభుత్వ హాస్టళ్లు, పాఠశాల్లలోని విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తూ అనారోగ్యం బారిన పడకుండా చూడాలనే గొప్ప లక్ష్యంతో ఎఫ్‌సీఐ కొనుగోలు చేస్తున్న బియ్యాన్ని ఫోర్టిఫైడ్‌ రైస్‌గా సరఫరా చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంటే దాన్ని కూడా బీఆర్‌ఎస్‌ విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని రేషన్‌ కార్డుదారులందరికీ కేంద్రం అందిస్తున్న బియ్యంగా ఉచితంగా పంపిణీ చేయడంతోపాటు  ఎఫ్‌సీఐ కోసం కొనుగోలు చేస్తున్న బియ్యాన్ని మొత్తం ఫోర్టిఫైడ్‌ రైస్‌గా ఇవ్వాలని బిజెపి తెలంగాణ శాఖ పక్షాన డిమాండ్‌ చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

జీతాలు, పెన్షన్లు ఇవ్వకపోవడం దురదృష్టకరం 
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులతో పాటు ఉద్యోగ విరమణ చేసిన పెన్షనర్లకు నేటికీ చాలా జిల్లాల్లో జీతాలు, పెన్షన్లు అందకపోవడం అత్యంత దురదృష్టకరం. మీ ప్రభుత్వ నిర్వాకం, అసమర్థత కారణంగా 10వ తేదీ వచ్చినా నేటికీ కామారెడ్డి, నిజామాబాద్‌, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, జనగాం, గద్వాల్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లోని ఉద్యోగుల, పెన్షనర్ల ఖాతాల్లో జీతాలు, పెన్షన్‌ సొమ్ము పడలేదన్నారు.

సంక్రాంతి పండగ  సందర్భంగా పెండింగ్‌లో ఉన్న 4 డీఏల్లో కనీసం ఒకటో, రెండో డీఏలు ఇస్తారని ఉద్యోగులు గంపెడాశతో ఎదురు చూస్తుంటే కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడబీకినట్లు జీతాలే ఇవ్వకపోవడం దురదృష్టకరం. సంక్రాంతి పండుగ పూట ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు పండగ చేసుకోలేకపోతున్నారు. మీ నిర్వాకం కారణంగా పెన్షనర్లు వృద్దాప్యంలో అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రులకు వెళ్లి చికిత్స చేయించుకోలేని, మందులు కూడా కొనలేని దుస్థితి నెలకొంది.  ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు తీసుకోవడమనేది ఉద్యోగుల హక్కు. ఈ హక్కును కాలరాసే అధికారం తెలంగాణ ప్రభుత్వానికి లేదు. ఈ హక్కును కాలరాయడమంటే రాజ్యాంగ మౌలిక సూత్రాలను ఉల్లంఘించడమే. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులందరికీ తక్షణమే జీతాలతోపాటు పెన్షనర్లకు  పెన్షన్‌ సొమ్మును విడుదల చేయాలని బిజెపి రాష్ట్రశాఖ డిమాండ్‌ చేస్తోందని కేసీఆర్ కు రాసిన లేఖలో ప్రస్తావించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
Love Jihad Fack Check: హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Case Sritej Health Update | 13 రోజుల తర్వాత శ్రీతేజ్ హెల్త్ పై పోలీసుల అప్డేట్ | ABP Desamటీమిండియా పరువు కాపాడిన బౌలర్లుత్వరలోనే టెస్ట్‌ మ్యాచ్‌లకి రోహిత్ శర్మ గుడ్‌బై!జమిలి ఎన్నికలపై జేపీసీ, ప్రతిపక్షాల డిమాండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
Love Jihad Fack Check: హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
KTR vs Revanth: నువ్వు మగాడివైతే అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్
నువ్వు మగాడివైతే అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్
Rains: అల్పపీడనం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, తెలంగాణలో ఇదీ పరిస్థితి
అల్పపీడనం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, తెలంగాణలో ఇదీ పరిస్థితి
Tirumala News: తిరుమలలో వైకుంఠ ఏకాదశి - టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారంటే?, టీటీడీ కీలక నిర్ణయాలివే!
తిరుమలలో వైకుంఠ ఏకాదశి - టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారంటే?, టీటీడీ కీలక నిర్ణయాలివే!
Telangana Assembly: విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
Embed widget