అన్వేషించండి

Breaking News Live Telugu Updates: రాజ్యసభకు నామినేట్ అయిన ఇళయరాజా, విజయేంద్ర ప్రసాద్, పీటీ ఉష

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

LIVE

Key Events
Breaking News Live Telugu Updates: రాజ్యసభకు నామినేట్ అయిన ఇళయరాజా, విజయేంద్ర ప్రసాద్, పీటీ ఉష

Background

ఉత్తర ఒడిశా దాని పరసర ప్రాంతాల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో పలు జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి సాధారణ వర్షపాతం నమోదైంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అదే సమయంలో నైరుతి బంగాళాఖాతం నుంచి సైతం 50 కిలోమీటర్ల వేగంతో తీరంలో బలమైన గాలులు వీస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీ, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. ఏపీలోని కోస్తాంధ్రలో నేడు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనుండగా, రాయలసీమ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడతాయి. తెలంగాణలో హైదరాబాద్‌లో ప్రతిరోజూ మధ్యాహ్నం, రాత్రి వర్షం కురుస్తుండగా.. పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఏపీలోని ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలకు, తెలంగాణకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఇలా..
ఉత్తర కోస్తాంధ్ర నేడు ఓ మోస్తరు నుంచి వర్షాలు కురనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. యానాంలలోనూ నేటి నుంచి మూడు రోజులపాటు వర్ష సూచన ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరిస్తూ వర్షాల నేపథ్యంలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. జూలై రెండు, మూడు వారాల్లో రెండు నుంచి మూడు అల్పపీడనాలు ఏర్పడనున్నాయి. వీటి ప్రభావంతో ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి. మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు పేర్కొన్నారు. కొన్ని జిల్లాల్లో నేటికి వర్షాలు మొదలుకాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలం పనులు ఎప్పుడు మొదలుపెట్టాలో అర్థం కాని పరిస్థితి ఆ జిల్లాల రైతుల్లో నెలకొంది.

దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్రలో ఉమ్మడి జిల్లాలైన గుంటూరు, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో మరో రెండు రోజులపాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షం పడుతుంది. రాయలసీమలో మాత్రం తేలికపాటి జల్లులు పడతాయి. ఇక్కడ ఎలాంటి వర్ష హెచ్చరిక జారీ కాలేదు. కొన్ని చోట్ల ఇంకా చినుకు కూడా పడలేదు. దీంతో వ్యవసాయంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.

హెచ్చరిక: వర్షాలతో రైతుల పంట, ధాన్యానికి నష్టం జరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అన్నదాతలను హెచ్చరించింది. భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.

తెలంగాణలో వర్షాలు
తెలంగాణలో ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సరిసిల్ల, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం సాయంత్రం, రాత్రి హైదరాబాద్ లోని పంజాగుట్ట, బంజారాహిల్స్, అమీర్‌పేట, ఖైరతాబాద్, మణికొండ​, గచ్చిబౌలి, లింగంపల్లి, జూబ్లీ హిల్స్, కూకట్‌పల్లి, బేగంపేట, సికింద్రాబాద్, పలు ప్రాంతాల్లో రాత్రి వర్షం కురిసింది. వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రేపటి నుంచి రెండు రోజులపాటు ఆరెంజ్ అలర్ట్‌ కూడా జారీ చేశారు. 

20:32 PM (IST)  •  06 Jul 2022

రాజ్యసభకు ఇళయరాజా, విజయేంద్ర ప్రసాద్

పరుగుల రాణి పీటీ ఉష, మ్యూజికల్ మేస్ట్రో ఇళయ రాజా, బాహుబలి సిరీస్, ఆర్ఆర్ఆర్ వంటి ప్రముఖ చిత్రాల రచయత విజయేంద్ర ప్రసాద్‌లను కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేసింది.

16:10 PM (IST)  •  06 Jul 2022

హైదరాబాద్‌కు మరో అంతర్జాతీయ కంపెనీ - సుమారు రూ. 1200 కోట్ల పెట్టుబడి- 2000 మంది ఉద్యోగాలకు అవకాశం

హైదరాబాద్‌లో మరో విదేశీ సంస్థ భారీ పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయింది. విమానయాన రంగ ఉత్పత్తులను తయారుచేసే ఫ్రాన్స్ దిగ్గజ సంస్థ శాఫ్రాన్ తన మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్ హాల్ (MRO) కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. 15 కోట్ల అమెరికన్ డాలర్లతో తన కేంద్రాన్ని శాఫ్రాన్ ఏర్పాటుచేస్తుంది. ఇండియాలో తన తొలి MRO కేంద్రాన్ని ఏర్పాటుచేసేందుకు హైదరాబాద్‌ను ఎంచుకోవాలనుకున్న శాఫ్రాన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. శాఫ్రాన్ సంస్థకు చెందిన అతిపెద్ద నిర్వహణ కేంద్రం ఇదేనన్న కేటీఆర్... మన దేశంలో ఒక విదేశీ సంస్థ పెడుతున్న తొలి విమాన ఇంజన్ల నిర్వహణ కేంద్రం కూడా ఇదే అన్నారు. శాఫ్రాన్‌ ప్రతిపాదిత ఎంఆర్‌వోతో సుమారు వెయ్యి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. విమానాల్లో వాడే లీప్‌-1ఏ, లీప్‌-1బీ ఇంజన్ల నిర్వహణను హైదరాబాద్‌లోనే చేస్తారన్నారు. 

16:02 PM (IST)  •  06 Jul 2022

వెస్టిండీస్ సిరీస్‌కు కెప్టెన్‌గా ధావన్

వెస్టిండీస్ టూర్‌కు కెప్టెన్‌గా శిఖర్ ధావన్‌ను బీసీసీఐ నియమించింది.

వెస్టిండీస్ టూర్‌కు భారత జట్టు

శిఖర్ ధావన్ (కెప్టెన్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శామ్సన్ (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అవేష్ ఖాన్, ప్రసీద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్

14:33 PM (IST)  •  06 Jul 2022

Tenali Car Accident: తెనాలిలో కారు బీభత్సరం

  • గుంటూరు జిల్లా తెనాలిలో కారు బీభత్సం ‌
  • పట్టణంలోని టెలిఫోన్ ఎక్స్చేంజి రోడ్డు పక్కన రిక్షాలు మరమ్మతులు చేస్తున్న ముగ్గురు వ్యక్తులపై దూసుకు వెళ్లిన కారు
  • ప్రమాదంలో ఒకరి కాలు నుజ్జు నుజ్జు, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
  • కారు కింద పడి పలు వాహనాలు ధ్వంసం
  • కారు నడుపుతున్న ఇద్దరు మైనర్లు.. అతివేగం కారణంగా అదుపుతప్పిన కారు
  • ఘటనా స్థలానికి చేరుకున్న ఒకటో పట్టణ పోలీసులు
  • నిందితులను అదుపులో తీసుకున్న పోలీసులు
  • క్షతగాత్రులను తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు, ఘటనపై కేసు నమోదు
12:45 PM (IST)  •  06 Jul 2022

CPI Narayana Comments: ప్రధానిపై చేసిన వ్యాఖ్యలపై చర్చకు సిద్ధం: సీపీఐ నారాయణ

విజయవాడ: నా పైన హనుమాన్ చౌదరి క్రిమినల్ ప్రొసీడింగ్ చేపడతామన్నారు,దాన్ని స్వాగతిస్తున్నాను: సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ కామెంట్స్

మోడీ పై నేను చేసిన వ్యాఖ్యలు పబ్లిక్ అనుకునేవే దానిపై చర్చకు సిద్ధం

అల్లూరి సీతారామరాజు జయంతి రోజు ప్రధాని గిరిజనులపై పెద్ద పెద్ద వ్యాఖ్యలు చేశారు

నేటికి గిరిజనులపై కార్పొరేట్ సంస్థలు అడవుల్ని ఆక్రమించుకోవాలని దాడులు చేస్తున్నారు

సుమారు 3 లక్షల మంది గిరిజనులు రాష్ట్రంలో అడవుల్ని ఆధారం చేసుకుని జీవుస్తున్నారు

సహజ వనరుల కోసం అడవుల్ని కార్పొరేట్ సంస్థలు నాశనం చేయాలని చూస్తున్నారు

గుజరాత్ అల్లర్ల గురించి ప్రపంచానికి తెలుసు, సుప్రీం కోర్ట్ ఆ కేస్ కొట్టివేస్తూ న్యాయమూర్తి పరిధి దాటి వ్యాఖ్యలు చేశారు

న్యాయమూర్తి వ్యాఖ్యలు ఆధారం చేసుకుని అమిత్ షా పీటీషనర్ ని అరెస్ట్ చేయమని చెప్పడం దారుణం

పీటీషనర్ పై అలాంటి వ్యాఖ్యలు చేయడం పౌర హక్కులను కాలరాయడమే

 ఫెడరల్ వ్యవస్థ ను మోడీ దెబ్బ తీస్తున్నారు,ఇప్పుడు భాజపా కన్ను ఢిల్లీ, తెలంగాణపై పడింది

బీజేపి ,వైసీపీ బంధం చాలా అన్యోన్యంగా ,తల వంచి మెడ వంచి జపం చేస్తున్నారు

హోదా ,పోలవరం,నిధులు ఏమయ్యాయి,ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఉండాలి కదా

మోడీ భయపడి,గజగజ వానికి రాష్ట్ర ప్రజల గౌరవాన్ని తాకట్టు పెట్టారు

రక్తసిక్త హస్తాలతో రాష్ట్రాలను నాశనం చేస్తూ మోడీ ,అమిత్ షా, రాష్ట్రానికి వస్తే వారిని చూసి వణికిపోతున్నారు

నేటి వరకు మోడీ 24 ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేశారు,ఇంకో 100 అమ్మకానికి సిద్ధమయ్యారు

గుజరాత్ వాళ్ళకే అన్ని అమ్ముతున్నారు,డబ్బులు ఎగ్గొట్టి విదేశాలకు వెళ్ళిపోయేవాళ్ళు గుజరాత్ వాళ్లే

కేసీఆర్ ఎదురు తిరిగినా ,జగన్ మాత్రం ఏమి మాట్లాడరు, తీర ప్రాంతం అంతా గుజరాత్ వాళ్ళకే రాసిస్తున్నారు

బొగ్గు కొనుగోలు పై కేసీఆర్ ఎదురు తిరిగారు,ఆదాని దగ్గర కొనను అని చెప్పారు

బీజేపి వ్యతిరేక శక్తులన్ని కలిసి పోరాడాలి

జులై 13 నుంచి 17 వరకు జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తాం

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Chandra Babu News: సూపర్ హిట్ కాంబినేషన్ ఎప్పటికీ ఉంటుంది- అమరావతి, పోలవరం మోదీ ప్రారంభిస్తారు- విశాఖ వేదికగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
సూపర్ హిట్ కాంబినేషన్ ఎప్పటికీ ఉంటుంది- అమరావతి, పోలవరం మోదీ ప్రారంభిస్తారు- విశాఖ వేదికగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Tirumala Stampede: తిరుమల తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- టీటీడీ ఈవోతో అత్యవసర భేటీ
తిరుమల తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- టీటీడీ ఈవోతో అత్యవసర భేటీ
Game Changer: తెలంగాణలో 'గేమ్ చేంజర్' బెనిఫిట్ షోలు లేవు, కానీ టికెట్ రేట్లు పెరిగాయ్... ఎంతో తెలుసా?
తెలంగాణలో 'గేమ్ చేంజర్' బెనిఫిట్ షోలు లేవు, కానీ టికెట్ రేట్లు పెరిగాయ్... ఎంతో తెలుసా?
Telangana News: తెలంగాణలో బీర్ల పంచాయితీ- సప్లై నిలిపేసిన సంస్థ- రూ. 250 చేయాలా అని ప్రశ్నించిన మంత్రి జూపల్లి
తెలంగాణలో బీర్ల పంచాయితీ- సప్లై నిలిపేసిన సంస్థ- రూ. 250 చేయాలా అని ప్రశ్నించిన మంత్రి జూపల్లి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Tirupati Pilgrims Stampede 4died | వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల పంపిణీలో విషాదం | ABP DesamAndhra Tourist Incident at Goa Beach Truth Behind |  గోవా టూరిజం సూపరే కానీ సేఫ్ కాదా.? | ABP DesamTirupati Pilgrims Rush for Tokens | వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కోసం తోపులాట | ABP DesamAP Inter Board on First year Exams | ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల రద్దుకై ప్రజాభిప్రాయం కోరిన బోర్డు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Chandra Babu News: సూపర్ హిట్ కాంబినేషన్ ఎప్పటికీ ఉంటుంది- అమరావతి, పోలవరం మోదీ ప్రారంభిస్తారు- విశాఖ వేదికగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
సూపర్ హిట్ కాంబినేషన్ ఎప్పటికీ ఉంటుంది- అమరావతి, పోలవరం మోదీ ప్రారంభిస్తారు- విశాఖ వేదికగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Tirumala Stampede: తిరుమల తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- టీటీడీ ఈవోతో అత్యవసర భేటీ
తిరుమల తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- టీటీడీ ఈవోతో అత్యవసర భేటీ
Game Changer: తెలంగాణలో 'గేమ్ చేంజర్' బెనిఫిట్ షోలు లేవు, కానీ టికెట్ రేట్లు పెరిగాయ్... ఎంతో తెలుసా?
తెలంగాణలో 'గేమ్ చేంజర్' బెనిఫిట్ షోలు లేవు, కానీ టికెట్ రేట్లు పెరిగాయ్... ఎంతో తెలుసా?
Telangana News: తెలంగాణలో బీర్ల పంచాయితీ- సప్లై నిలిపేసిన సంస్థ- రూ. 250 చేయాలా అని ప్రశ్నించిన మంత్రి జూపల్లి
తెలంగాణలో బీర్ల పంచాయితీ- సప్లై నిలిపేసిన సంస్థ- రూ. 250 చేయాలా అని ప్రశ్నించిన మంత్రి జూపల్లి
Vizag Modi Speech :  చంద్రబాబు లక్ష్యాలకు ఎప్పుడూ అండగా ఉంటాం - విశాఖ సభలో మోదీ భరోసా
చంద్రబాబు లక్ష్యాలకు ఎప్పుడూ అండగా ఉంటాం - విశాఖ సభలో మోదీ భరోసా
Tirumala Stampede News: తిరుమలలో ఏం జరిగింది? తొక్కిసలాటకు కారణమేంటీ? టీటీడీ ఫెయిల్‌ అయ్యిందా?
తిరుమలలో ఏం జరిగింది? తొక్కిసలాటకు కారణమేంటీ? టీటీడీ ఫెయిల్‌ అయ్యిందా?
Job Notifications in Telangana : తెలంగాణలో మే 1 నుంచి జాబ్ నోటిఫికేషన్స్ - గ్రూప్ ఎగ్జామ్స్ రిజల్ట్ పై క్లారిటీ ఇచ్చిన టీజీపీఎస్సీ ఛైర్మన్
తెలంగాణలో మే 1 నుంచి జాబ్ నోటిఫికేషన్స్ - గ్రూప్ ఎగ్జామ్స్ రిజల్ట్ పై క్లారిటీ ఇచ్చిన టీజీపీఎస్సీ ఛైర్మన్
Pawan Kalyan: భారత్‌ను గొప్పదేశంగా మార్చేందుకు మోదీ కృషి - విశాఖ సభలో పొగడ్తలతో ముంచెత్తిన పవన్
భారత్‌ను గొప్పదేశంగా మార్చేందుకు మోదీ కృషి - విశాఖ సభలో పొగడ్తలతో ముంచెత్తిన పవన్
Embed widget