Breaking News Live Telugu Updates: ఎస్సారెస్పీ కెనాల్ లో పడిపోయిన కారు... యువకుడు మృతి
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
సంక్రాంతి అనంతరం తగ్గుముఖం పట్టిన చలి, తెలంగాణలో తాజాగా పెరిగింది. కొన్ని జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ విభాగం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం ఉంటుండగా, అదే కొనసాగుతుందని రెండు రాష్ట్రాల వాతావరణ కేంద్రాల అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌తో పోల్చుకుంటే తెలంగాణలో చలి తీవ్రత కాస్త ఎక్కువగా ఉండబోతుంది. నేడు మూడు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు.
కొద్ది రోజులుగా తెలంగాణలో చలి సాధరణంగా ఉండగా, ఇప్పుడు మరింత పెరిగింది. రాష్ట్రంలో ఉత్తర, పశ్చిమ తెలంగాణలోని 13 జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ విభాగం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉత్తర తెలంగాణలోని మూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 5 నుంచి 10 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందనిపిస్తే వాతావరణ విభాగం ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. 11 నుంచి 15 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంటే ఎల్లో అలెర్ట్ జారీ చేస్తుంటారు. రాబోయే ఐదు రోజులకు సంబంధించి తెలంగాణ వాతావరణ విభాగం నమోదు కానున్న ఉష్ణోగ్రతల అంచనాలను వెదర్ బులెటిన్‌లో వివరించింది.
ఆరెంజ్ అలర్ట్ ఈ మూడు జిల్లాల్లో
ఆదిలాబాద్, కుమ్రుం భీమ్, మంచిర్యాల జిల్లాలకు నేడు ఆరెంజ్ అలర్ట్ ఉంది. కరీంనగర్, జయశంకర్ భూపాల్‌పల్లి, పెద్దపల్లి, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. రేపు, ఎల్లుండి నుంచి క్రమంగా చలి తగ్గిపోతుందని వెదర్ బులెటిన్ లో వివరించారు. తెలంగాణ ప్రాంతంలో ఎలాంటి వర్ష సూచన లేదు.
ఖమ్మంలో గరిష్ణ ఉష్ణోగ్రత నమోదు అయింది. 33.6 డిగ్రీలు నమోదైనట్టు వాతావరణ విభాగం తెలిపింది. అత్యల్ప ఉష్ణోగ్రత 9.2 డిగ్రీలు ఆదిలాబాద్‌లో నమోదైంది. ఇవాళ అత్యధిక ఉష్ణోగ్రత 30 డిగ్రీలుగా ఉంటుందని... అత్యల్పం 15 డిగ్రీలుగా ఉంటుందని అంచనా వేసింది.
ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ మాత్రం ఎలాంటి వెదర్ బులెటిన్ విడుదల చేయలేదు. రెండు రోజుల క్రితం విడుదల చేసిన బులెటిన్‌లో చెప్పిన వివరాల ప్రకారం... ఈ మధ్య శ్రీలంకలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం రాష్ట్రంలోని కోస్తా ప్రాంతంపై పెద్దగా ఉండబోదని తెలిపింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పొడి వాతావరణమే ఉంటుందని పేర్కొంది. ఎలాంటి వర్ష సూచన కూడా లేదని తేల్చేసింది.
ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో మొన్నటి వరకు అత్యంత కనిష్ణ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఇప్పుడిప్పుడు ఆ పరిస్థితి నుంచి ఆ ప్రాంతాలు తేరుకుంటున్నాయి. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. చలి గణనీయంగా తగ్గింది. ఎత్తైన పర్వత ప్రాంతాల్లో హిమపాతాలు, లోతట్టు మైదానాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికీ చాలా చోట్ల ఉదయం, సాయంత్రం పొగమంచు కనిపిస్తోంది.
బంగారం, వెండి ధరలు
Gold-Silver Price 05 February 2023: పసిడి ధర భారీగా దిగి వచ్చింది. ఇవాళ, 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం ₹ 700, స్వచ్ఛమైన పసిడి ₹ 770 చొప్పున తగ్గింది. బిస్కట్ బంగారం ధర ఈ రెండు రోజుల్లోనే ₹1200 మేర పడిపోయింది. కిలో వెండి ధర కూడా ఒకేసారి ₹ 2,600 క్షీణించింది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఇలా ఉన్నాయి:
తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల (తులం) 22 క్యారెట్ల బంగారం ధర ₹ 52,400 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ₹ 57,160 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 74,200 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో (Gold Rate in Vijayawada) 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ₹ 52,400 కి చేరింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ₹ 57,160 గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 74,200 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ మార్కెట్ రేటే అమలవుతోంది.
ఎస్సారెస్పీ కెనాల్ లో పడిపోయిన కారు... యువకుడు మృతి
జగిత్యాల ధరూర్ క్యాంప్ ఎస్సారెస్పీ కెనాల్ లో పడిపోయిన కారు...
కారులో ఐదుగురు ప్రయాణిస్తున్న యువకులు
జగిత్యాల బీట్ బజార్ కు చెందిన రిజ్వాన్ అనే యువకుడు మృతి
సోమవారం అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్ పెట్టనున్న మంత్రి హరీష్ రావు
సోమవారం అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్
10.30 కి అసెంబ్లీలో బడ్జెట్ పెట్టనున్న ఆర్థిక మంత్రి హరీష్ రావు
ఈ సారి మూడు లక్షల కోట్ల బడ్జెట్ పెట్టే ఛాన్స్
ఉదయం జూబ్లీహిల్స్ టీటీడీ ఆలయంలో హరీష్ రావు పూజలు
మండలిలో బడ్జెట్ పెట్టనున్న శాసన సభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డి
నాందేడ్ లో బీఆర్ఎస్ జాతీయ సభ అట్టర్ ఫ్లాప్ అయింది: బండి సంజయ్
మహారాష్ట్రలోని నాందేడ్ లో బీఆర్ఎస్ నిర్వహించిన జాతీయ సభ తుస్సు మందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మహారాష్ట్ర జనం అసలు పట్టించుకోనేలేదు. 30 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులు, ఇద్దరు ఎంపీలు 25 రోజులుగా నాందేడ్ లోనే మకాం వేసి ఏర్పాట్లు చేసినా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. చివరకు తెలంగాణ సరిహద్దు జిల్లాల నుండి ఒక్కొక్కరికి రూ.500లు ఇచ్చి జనాన్ని పట్టుకొచ్చి నాందేడ్ వేదికగా కేసీఆర్ పెద్ద డ్రామా చేశారు. తెలంగాణలోనే అతీగతి లేదు.. నాందేడ్ లో బీఆర్ఎస్ ను ఎవరు పట్టించుకుంటారు?
మహారాష్ట్రలోని రైతుల ఆత్మహత్యల గురించి కేసీఆర్ ప్రస్తావించడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. తెలంగాణ జనాభాతో పోలిస్తే మహారాష్ట్ర జనాభా మూడు రెట్లు ఎక్కువ. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలోనే 4వ స్థానంలో ఉంది. రెండు సార్లు అధికారమిస్తే ఆత్మహత్యలను నిలువరించలేకపోయిన అసమర్థుడు కేసీఆర్. సొంత నియోజకవర్గమైన గజ్వేల్ లోనే రైతు ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో సగటున రెండ్రోజులకో రైతు ఆత్మహత్య చేసుకుంటున్నడు. ఇవన్నీ దాచిపెట్టి రైతులను ఉద్దరిస్తానని నువ్వు చెబుతుంటే... తెలంగాణ రైతులు నవ్వుకుంటున్నరు.
Governor Tamilisai: ఢిల్లీ పర్యటనకు గవర్నర్ తమిళిసై
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఢిల్లీకి వెళ్లనున్నారు. తెలంగాణలో తాజా పరిస్థితులను కేంద్రానికి వివరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో వివిధ కార్యక్రమాల్లో గవర్నర్ తమిళిసై పాల్గొంటారని సమాచారం. దీంతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా భేటీ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.
KCR in Nanded: నాందేడ్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ నాందేడ్‌కు చేరుకున్నారు. సీఎం కేసీఆర్ వెంట ఎమ్మెల్సీ కవిత, పలువురు మంత్రులు ఉన్నారు. మరికాసేపట్లో నాందేడ్ గురుద్వారాను సందర్శించనున్నారు. అక్కడ కాసేపు ప్రార్థన చేస్తారు.