News
News
వీడియోలు ఆటలు
X

Breaking News Live Telugu Updates: మాజీ మంత్రి యర్రా నారాయణస్వామి కన్నుమూత

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

FOLLOW US: 
వైఎస్ జగన్ కు నోటీసుల జారీకి సీజేఐ ఆదేశాలు

వాలంటీర్లకి నెలకి 200 రూపాయలు ఇచ్చి, సాక్షి పేపర్ని కొనిపించడం అధికార దుర్వినియోగం అని ఈనాడు యాజమాన్యం సుప్రీం కోర్టుని ఆశ్రయించింది. సాక్షి ఓనర్ కు, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇవ్వాలని సిజెఐ ఆదేశాలు జారీ చేశారు.

మాజీ మంత్రి యర్రా నారాయణస్వామి కన్నుమూత

ప.గో.జిల్లా:

సీనియర్ నాయకులు, పార్లమెంట్ మాజీ సభ్యులు, మాజీ మంత్రి యర్రా నారాయణస్వామి భీమవరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు..

అయన భౌతిక కాయాన్ని మరికొద్ది సేపట్లో ఆయన స్వగ్రామమైన  ఉండి మండలం ఉప్పులూరుకు తరలించనున్నారు..

BJP Office: బీజేపీ కార్యాలయం గేటుపై నీలి రంగు చల్లిన గుర్తు తెలియని దుండగులు
 • అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో బీజేపీ కార్యాలయం ప్రధాన గేటుపై నీలి రంగు చల్లిన గుర్తు తెలియని దుండగులు 
 • రెండు బైక్ లపై వచ్చి నీలి రంగు చల్లి దుండగులు పరార్
 • అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బిజేపీ కార్యాలయ కార్యదర్శి
 • అర్ధరాత్రి 1.45 గంటలకు ఘటన జరిగినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా గుర్తించిన పోలీసులు 
 • కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Extra Charges for UPI Payments: UPI పేమెంట్స్‌ ఛార్జీలపై NPCI క్లారిటీ

ఏప్రిల్‌ 1 నుంచి ఆన్‌లైన్‌ వ్యాలెట్లు, ప్రీ-లోడెడ్‌ గిఫ్ట్‌ కార్డుల వంటి ‘ప్రీపెయిడ్‌ పేమెంట్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ (PPI)’ ద్వారా చేసే యూపీఐ మర్చంట్‌ లావాదేవీలపై మాత్రమే అదనపు ఛార్జీలను విధించనున్నట్లు ‘నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా’ (NPCI) వెల్లడించింది. పీపీఐ ద్వారా ₹ 2 వేల కంటే ఎక్కువ యూపీఐ లావాదేవీ జరిపితే 1.1 శాతం ఇంటర్‌ఛేంజ్‌ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.

అయితే, ఒక వ్యక్తి బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి మరో బ్యాంక్‌ అకౌంట్‌కు, వినియోగదారుల నుంచి వ్యాపారుల మధ్య జరిగే యూపీఐ లావాదేవీలపై ఎలాంటి అదనపు రుసుము ఉండదని స్పష్టం చేసింది. అంటే సామాన్య ప్రజలు రోజువారీ చెల్లింపుల కోసం యూపీఐ యాప్‌లను వినియోగిస్తే ఎలాంటి అదనపు రుసుము వర్తించదు.

Viveka Murder Case Update: వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తునకు సీబీఐ కొత్త సిట్ ఏర్పాటు

వివేకానందరెడ్డి హత్య కేసును ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారి రాంసింగ్‌ను సుప్రీంకోర్టు తొలగించింది. దర్యాప్తు కోసం కొత్త టీమ్‌ను నియమించి ఏప్రిల్ 30 లోగా కేసు దర్యాప్తును ముగించాలని సుప్రీంకోర్టు గడువు విధించింది. ప్రత్యేక అధికారులుగా సీబీఐ డీఐజీ చౌరాసియా నేత్రుత్వంలో సభ్యులుగా ఎస్పీ వికాస్ సింగ్, ఏఎస్పీ ముఖేష్ కుమార్, సీఐ శ్రీమతి, నవీన్ పునియా, ఎస్సై అంకిత్ యాదవ్ ను నియమించింది.

Viveka Murder Case Update: వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తునకు సీబీఐ సిట్ ఏర్పాటు

వివేకానందరెడ్డి హత్య కేసును ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారి రాంసింగ్‌ను సుప్రీంకోర్టు తొలగించింది. దర్యాప్తు కోసం కొత్త టీమ్‌ను నియమించి ఏప్రిల్ 30 లోగా కేసు దర్యాప్తును ముగించాలని సుప్రీంకోర్టు గడువు విధించింది. ప్రత్యేక అధికారులుగా సీబీఐ డీఐజీ చౌరాసియా నేత్రుత్వంలో సభ్యులుగా ఎస్పీ వికాస్ సింగ్, ఏఎస్పీ ముఖేష్ కుమార్, సీఐ శ్రీమతి, నవీన్ పునియా, ఎస్సై అంకిత్ యాదవ్ ను నియమించింది.

Viveka Murder Case: వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. హత్య కేసు దర్యాప్తును ఏప్రిల్ 30 కల్లా ముగించాలని ఆదేశించింది. 

Hanamkonda Latest News: తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల సంఘర్షణ సభ వాయిదా
 • హనుమకొండ జిల్లా కేయూలో నేడు జరగనున్న తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల సంఘర్షణ సభ వాయిదా
 • సభకు అనుమతి ఇవ్వని కేయూ అధికారులు
 • హై కోర్టులో తెల్చుకుంటామంటున్న కేయూ జాక్ నేతలు
 • సభ రద్దు కావడంతో కాకతీయ యునివర్సిటీ లైబ్రెరీ వద్ద మహా ధర్నాకు దిగిన విద్యార్థులు, నిరుద్యోగులు
 • భారీగా తరలివస్తున్న విద్యార్థులు, నిరుద్యోగులు, గ్రూప్ 1 అభ్యర్థులు
 • అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న పోలీసులు, వీసీ ఛాంబర్ ముందు నిరసన
కర్ణాటక ఎన్నికల తేదీలు ఖరారు

కర్ణాటక ఎన్నికల షెడ్యూల్‌ని కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం ఈ పేజ్‌ను రిఫ్రెష్ చేస్తూ ఉండండి. 

TDP News: నేడు టీడీపీ ఆవిర్భావ వేడుకలు, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో
 • ఈ రోజు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో టీడీపీ 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
 • హాజరుకానున్న పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు
 • తెలుగు రాష్ట్రాల నుండి హాజరుకానున్న టీడీపీ ప్రజాప్రతినిధులు
 • మధ్యాహ్నం 3 గంటలకు ఇంటి నుండి ఎన్టీఆర్ ఘాట్ కు చంద్రబాబు
 • సాయంత్రం 4 గంటలకు నాంపల్లిలోని సభా వేదిక వద్దకు చేరుకోనున్న చంద్రబాబు
Hanamkonda Accident: హన్మకొండ జిల్లాలో ఆటో-కారు ఢీ, పలువురి పరిస్థితి విషమం
 • హన్మకొండ జిల్లాలో ఆటో-కారు ఢీ, పలువురి పరిస్థితి విషమం
 • హన్మకొండ జిల్లా పరకాల భూపాలపల్లి ప్రధాన రహదారి చలివాగు వద్ద కూలీలతో వెళుతున్న ఆటోను ఢీకొట్టిన కారు
 • పలువురు కూలీలకు తీవ్ర గాయాలు ముగ్గురి పరిస్థితి విషమం
 • పత్తి పాక నుండి పోచంపల్లి గ్రామానికి మిర్చి ఏరడానికి వెళుతున్న కూలీలు
 • పరకాల సివిల్ హాస్పిటల్ కు తరలించిన పోలీసులు
Background

నిన్న మధ్య చత్తీస్‌గఢ్ నుంచి ఉన్న ద్రోణి నేడు మరఠ్వాడ నుంచి ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వద్ద కొనసాగుతూ ఉందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

ఇక ఇప్పటిదాకా అక్కడక్కడ జల్లులు కురవగా.. నేటి నుంచి వాతావరణం తెలంగాణలో పొడిగా ఉండనుందని వాతావరణ అధికారులు తెలిపారు. మార్చి 29 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని తెలిపారు. మార్చి 31న మాత్రం తెలంగాణలో ఓ మోస్తరు నుంచి అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

హైదరాబాద్ లో ఇలా
‘‘హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఉరుములతో కూడిన మేఘాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 37 డిగ్రీలు, 24 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశల నుంచి గాలులు గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 36.0 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 24.0 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 069 శాతం నమోదైంది.

ఏపీలో వర్షాలు ఇలా
ఏపీలో నేడు ఎక్కడా వర్షాలు పడే అవకాశం లేదని అమరావతిలోని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉరుములు, మెరుపులు లాంటి వాతావరణంతో పాటు బలమైన గాలులు దాదాపు 30 నుంచి 40 కిలో మీటర్ల వరకూ వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. ఉత్తర కోస్తా, యానం, దక్షిణ కోస్తాలోని అన్ని జిల్లాల్లో ఈ రకమైన వాతావరణం ఉంటుందని తెలిపారు. వచ్చే 5 రోజుల పాటు ఇదే రకం వాతావరణ పరిస్థితి ఉంటుందని తెలిపారు.

 

ఢిల్లీలో వాతావరణం ఇలా..
రానున్న నాలుగైదు రోజుల పాటు దక్షిణ భారతదేశంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షం కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, దక్షిణ అంతర్గత కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, కేరళ, మహేలలో వాతావరణం మరోసారి ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే, ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో బుధవారం (మార్చి 29) ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకునే అవకాశం ఉంది.

వాతావరణ శాఖ ప్రకారం, మండుతున్న వేడి తర్వాత, నెల చివరి రెండు రోజుల్లో (30-31 మార్చి) తాజా రౌండ్ వర్షం ప్రారంభమవుతుంది. ఈ రెండు రోజుల్లో న్యూ ఢిల్లీలో తేలికపాటి వర్షం లేదా చినుకులు పడవచ్చు. మార్చి 30న, న్యూఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 19 మరియు గరిష్ట ఉష్ణోగ్రత 32.0 ఉండవచ్చు. మార్చి 31న కనిష్ట ఉష్ణోగ్రత 18, గరిష్ట ఉష్ణోగ్రత 28గా నమోదయ్యే అవకాశం ఉంది.

ఈ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం

ఈరోజు (మార్చి 29) దక్షిణ భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, కేరళలో వర్షాలు కురిసిన తర్వాత ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నాయి. అదే సమయంలో, ఒడిశా, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం మరియు పశ్చిమ బెంగాల్‌లోని త్రిపుర, కేరళ, మహేలోని గంగా తీర ప్రాంతాలలో 30 నుండి 40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.

ఉత్తర భారతంలో కూడా వర్షాలు పడే అవకాశం

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈరోజు అంటే మార్చి 29న ఉష్ణోగ్రతలో చెప్పుకోదగ్గ మార్పులు ఏమీ ఉండవు. మార్చి 30, 31 తేదీల్లో లక్నోలో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీనితో పాటు గాలులతో పాటు వర్షం కూడా కనిపిస్తుంది. పంజాబ్‌లోని జలంధర్‌లోనూ వర్షాలు కొనసాగుతాయి. మార్చి 30 నుంచి ఏప్రిల్ 3 వరకు వర్షం కారణంగా వాతావరణం కాస్త చల్లగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

టాప్ స్టోరీస్

Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

Whatsapp: వాట్సాప్ ఛాటింగ్ ఇంతకు ముందులా ఉండదు - ఎందులో మార్పులు జరుగుతున్నాయో తెలుసా?

Whatsapp: వాట్సాప్ ఛాటింగ్ ఇంతకు ముందులా ఉండదు - ఎందులో మార్పులు జరుగుతున్నాయో తెలుసా?

Coromandel Express Accident: రాంగ్‌ ట్రాక్‌లోకి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, అందుకే ఘోర ప్రమాదం - ప్రాథమిక రిపోర్ట్

Coromandel Express Accident: రాంగ్‌ ట్రాక్‌లోకి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, అందుకే ఘోర ప్రమాదం - ప్రాథమిక రిపోర్ట్