అన్వేషించండి

Breaking News Live Telugu Updates: హైదరాబాద్ మెట్రోలో సాంకేతిక లోపం, నిలిచిన టికెట్ల జారీ

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

LIVE

Key Events
Breaking News Live Telugu Updates: హైదరాబాద్ మెట్రోలో సాంకేతిక లోపం, నిలిచిన టికెట్ల జారీ

Background

తెలుగు రాష్ట్రాలపై ఉపరితల ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం తుఫాను ప్రసరణ జార్ఖండ్ మరియు దాని పరిసర ప్రాతాల్లో అధికంగా ఉంది. ఇది 5.8 కిలో మీటర్ల ఎత్తు వరకూ విస్తరించి దక్షిణం దిశగా వంగి ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో  శుక్రవారం (జూన్ 22) భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు.

ఈ వాతావరణ పరిస్థితుల వేళ ఉత్తర కోస్తా, యానం ప్రాంతాల్లో భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు కూడా వచ్చే అవకాశం ఉంది. రానున్న రెండు రోజుల్లో ఉత్తర కోస్తాలో చాలా చోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇటు దక్షిణ కోస్తాలో కూడా రానున్న రెండు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. రాయలసీమలోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షపాతం కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.

హెచ్చరికలు
భారీ వర్షాలు, ఉరుములు, మెరుపుల నేపథ్యంలో ఐఎండీ కీలక వ్యాఖ్యలు చేసింది. వర్షాలు పడే సమయంలో ప్రజలు సరైన ప్రదేశంలో ఉండాలని, చెట్ల కింద అస్సలు ఉండొద్దని సూచించింది. చెట్ల కింద ఉండే పిడుగుపాటుకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. రైతులు ఈ భారీ వర్షం తగ్గే వరకూ పనులను వాయిదా వేసుకోవాలని సూచించింది. చెరువులు, కుంటలు, నాలాలు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని నిర్దేశించింది.

Telangana Weather: తెలంగాణలో ఇలా
తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ లోని వాతావరణ కేంద్రం తెలిపింది.  పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, నిజామాబాద్‌, జగిత్యాల, ములుగు, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవవచ్చని అధికారులు అంచనా వేశారు. ఈ నెల 25 వరకు మిగతా చోట్ల తేలికపాటి వానలు కురుస్తాయని చెప్పారు. ఈ 13 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు.

నేడు ఉదయం (22 జూన్ ఉదయం 5 గంటలకు) ట్వీట్ చేసిన వివరాల ప్రకారం.. రాబోయే 3 గంటల్లో సంగారెడ్డి, రంగారెడ్డి, యాదాద్రి, సూర్యాపేట, మహబూబాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ట్వీట్ చేశారు.

20:17 PM (IST)  •  22 Jul 2022

హైదరాబాద్ మెట్రోలో సాంకేతిక లోపం, నిలిచిన టికెట్ల జారీ

Hyderabad Metro Trains :హైదరాబాద్ మెట్రోలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో టికెట్ల జారీ నిలిచిపోయింది. నగరంలోని పలు మెట్రో స్టేషన్లలో భారీ క్యూలైన్లలో ప్రయాణికులు టికెట్ల కోసం వేచిఉన్నారు. హైదరాబాద్ లో భారీ వర్షానికి ఉద్యోగులు, వ్యాపారస్తులు మెట్రోలో ప్రయాణిస్తున్నారు. దీంతో మెట్రో ట్రైన్లలో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంది.  

20:11 PM (IST)  •  22 Jul 2022

సుల్తానాబాద్ రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం, ఐదుగురికి గాయాలు 

Karimnagar News : కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ రాజీవ్ రహదారిపై కారును లారీ ఢీకొట్టింది. అతి వేగంతో వచ్చిన లారీ వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో కారు డివైడర్ దాటి ఎదురుగా వచ్చిన మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సుల్తానాబాద్ పోలీసులు సీసీటీవీ ఫుటేజి ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

13:04 PM (IST)  •  22 Jul 2022

Palnadu District: పెదకూరపాడులో రాత్రి నుంచి దంచి కొడుతున్న వర్షం

  • పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం పరిధిలో రాత్రి నుంచి దంచి కొడుతున్న వర్షం
  • బెల్లంకొండ, అచ్చంపేట, అమరావతి,క్రోసూరు, పెదకూరపాడు మండలాల్లో భారీ వర్షం
  • రోడ్లపై నీరు చేరడంతో ఇబ్బందులు పడుతున్న వాహన దారులు
  • అచ్చంపేట -మాదీపాడు ప్రధాన రహదారిపై నిలిచిన వర్షపునీరు
12:58 PM (IST)  •  22 Jul 2022

Adilabad: సోనియాపై ఈడీ కేసులను నిరసిస్తూ ప్రధాని మోదీ ఫ్లెక్సీ దహనం

దేశం కోసం తమ కుటుంబ సభ్యులను త్యాగం చేసిన గాంధీ కుటుంబాన్ని అప్రతిష్ఠ పాలు చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ ఆరోపించారు.  సోనియా గాంధీ పై ఈడీ కేసులను నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదుట జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు సాజిద్ ఖాన్ తో పాటు ఎఐసిసి సభ్యురాలు గండ్రత్ సుజాత, జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొని కేంద్రం తీరును ఖండించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడి ఫ్లెక్సీని దహానం చేసి నిరసన తెలియజేశారు.  సోనియాగాంధీ ని ఈడి కేసులతో అప్రతిష్టపాలు చేయడం సరికాదని, ఇప్పటికైనా బిజెపి కేంద్ర ప్రభుత్వం తమ మొండి వైఖరిని మానుకోవాలని డిమాండ్ చేశారు.

12:36 PM (IST)  •  22 Jul 2022

CM Jagan News: గనుల శాఖ మంత్రి, అధికారులను అభినందించిన సీఎం  వైఎస్‌ జగన్‌

  • గనుల శాఖ అనుసరిస్తున్న పారదర్శక విధానాలకు జాతీయ స్థాయిలో ప్రశంసలు, గుర్తింపు.
  • ప్రధాన ఖనిజాల అన్వేషణ, వేలం, మైనింగ్‌  కార్యకలాపాల పర్యవేక్షణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ గనుల శాఖ పాటిస్తున్న అత్యుత్తమ విధానాలను ప్రశంసిస్తూ కేంద్ర బొగ్గు, గనుల శాఖ నుంచి ఖనిజ వికాస్‌ అవార్డు.
  • ఇటీవల ఢిల్లీలో మైన్స్‌ అండ్‌ మినరల్స్‌పై జరిగిన సదస్సులో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చేతుల మీదుగా అవార్డు అందుకున్న గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, గనుల శాఖ డైరెక్టర్‌ వీజీ.వెంకటరెడ్డి.
  • ఖనిజ వికాస్‌ అవార్డు క్రింద కేంద్ర గనుల శాఖ అందజేసిన రూ.2.40 కోట్లు ప్రోత్సాహక చెక్‌ను సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రికి చూపిన గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ద్వివేది, డెరెక్టర్‌ వీజీ.వెంకటరెడ్డి.
Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala Tirupati Laddu : తిరుపతి లడ్డూ వివాదంలో మరో మలుపు- ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు
తిరుపతి లడ్డూ వివాదంలో మరో మలుపు- ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు
Supreme Court On Note For Vote Case: ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
IND vs BAN : బంగ్లా పతనం ఆరంభం, మెరిసిన ఆకాశ్‌ దీప్
బంగ్లా పతనం ఆరంభం, మెరిసిన ఆకాశ్‌ దీప్
Chandra Babu Vs YS Jagan 100 Days Ruling: 100 రోజుల పాలనలో చంద్రబాబు చేసిందేంటీ? గతంలో జగన్ అమలు చేసిన విధానాలేంటీ?
100 రోజుల పాలనలో చంద్రబాబు చేసిందేంటీ? గతంలో జగన్ అమలు చేసిన విధానాలేంటీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చార్మినార్ వద్ద అగ్ని ప్రమాదం, భారీగా ఎగిసిపడిన మంటలుJani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABPTDP revealed reports on TTD Laddus | టీటీడీ లడ్డూల ల్యాబ్ రిపోర్టులు బయటపెట్టిన టీడీపీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Tirupati Laddu : తిరుపతి లడ్డూ వివాదంలో మరో మలుపు- ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు
తిరుపతి లడ్డూ వివాదంలో మరో మలుపు- ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు
Supreme Court On Note For Vote Case: ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
IND vs BAN : బంగ్లా పతనం ఆరంభం, మెరిసిన ఆకాశ్‌ దీప్
బంగ్లా పతనం ఆరంభం, మెరిసిన ఆకాశ్‌ దీప్
Chandra Babu Vs YS Jagan 100 Days Ruling: 100 రోజుల పాలనలో చంద్రబాబు చేసిందేంటీ? గతంలో జగన్ అమలు చేసిన విధానాలేంటీ?
100 రోజుల పాలనలో చంద్రబాబు చేసిందేంటీ? గతంలో జగన్ అమలు చేసిన విధానాలేంటీ?
New Ration Cards In Telangana: రేషన్ కార్డుల కోసం చూస్తున్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డుల కోసం చూస్తున్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
Samantha: గుడ్ న్యూస్ చెప్పిన సమంత... ఫుల్ ఖుషీగా సామ్ ఫ్యాన్స్
గుడ్ న్యూస్ చెప్పిన సమంత... ఫుల్ ఖుషీగా సామ్ ఫ్యాన్స్
Andhra Politics : కూటమి పార్టీల్లో అందరికీ నో ఎంట్రీ - చేరాలంటే ఎంట్రన్స్ టెస్టు పాసవ్వాల్సిందే !
కూటమి పార్టీల్లో అందరికీ నో ఎంట్రీ - చేరాలంటే ఎంట్రన్స్ టెస్టు పాసవ్వాల్సిందే !
Ghaati Movie: ‘ఘాటీ’ షూటింగ్ మళ్లీ షురూ చేసిన అనుష్క శెట్టి... హైదరాబాద్‌లో కీలక సన్నివేశాల షూట్
‘ఘాటీ’ షూటింగ్ మళ్లీ షురూ చేసిన అనుష్క శెట్టి... హైదరాబాద్‌లో కీలక సన్నివేశాల షూట్
Embed widget