Breaking News Live Telugu Updates: జాతీయ పతాకరూపశిల్పి పింగళి వెంకయ్య కుమార్తె కన్నుమూత
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
తెలుగు రాష్ట్రాలపై ఉపరితల ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. ఇది సముద్రమట్టం నుంచి 4.5 కిలో మీటర్ల నుంచి 5.8 కిలో మీటర్ల ఎత్తు వరకూ విస్తరించి స్థిరంగా కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పలుచోట్ల కురిసే అవకాశముందని అధికారులు అంచనా వేశారు.
దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో ఉత్తర కోస్తాలో చాలా చోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇటు దక్షిణ కోస్తాలో కూడా రానున్న రెండు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. రాయలసీమలోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షపాతం కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. అయితే, ఏపీలో వచ్చే రెండు రోజులు వర్షాలకు సంబంధించి ఎలాంటి హెచ్చరికలను జారీ చేయలేదు.
Telangana Weather: తెలంగాణలో ఇలా
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గురు, శుక్రవారాల్లో (జూలై 21, 22 తేదీలు) తెలంగాణలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓమోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడింది. గురువారం అక్కడక్కడ తేలికపాటి వర్షం పడుతుందని తెలిపింది. అయితే, ప్రస్తుతానికి ఎలాంటి హెచ్చరికలు లేవని అధికారులు అంచనా వేశారు. బుధవారం కామారెడ్డి జిల్లా లింగంపేట్‌లో అత్యధికంగా 33.1 మిల్లీమీటర్ల వర్షం పడింది. రాష్ట్రంలోని 27 జిల్లాల్లో 60 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ విభాగం అధికారులు తెలిపారు.
బంగారం, వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు (Todays Gold Rate) పెరిగింది. పది గ్రాములకు రూ.100 పెరిగింది. వెండి ధర మాత్రం నిన్నటితో పోలిస్తే నేడు కిలోకు రూ.300 పెరిగింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో రూ.46,400 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.50,620 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.61,000 గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhrapradesh)
Gold Rates Today విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,400 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,620గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.61,000 గా ఉంది. విజయవాడలో పసిడి ధర ఇలా ఉంది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.46,400 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.50,620గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.61,000 గా ఉంది.
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర (Todays Gold Rate) ఇలా..
అయితే, ఇతర నగరాల్లోనూ బంగారం ధర నేడు తగ్గింది. చెన్నై నగరంలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.46,670గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,920 గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,400 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,620 గా ఉంది.
జాతీయ పతాకరూపశిల్పి పింగళి వెంకయ్య కుమార్తె కన్నుమూత
జాతీయ పతాకరూప శిల్పి పింగళి వెంకయ్య కుమార్తె ఘంటశాల సీతామహాలక్ష్మి (101) మృతి చెందారు. మాచర్లలోని తన కుమారుని ఇంటిలో సీతామహాలక్ష్మి ఉంటున్నారు. గత కొంత కాలం నుంచి ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇవాళ సాయత్రం మాచర్లలోని కుమారుని స్వగృహంలో తుది శ్వాస విడిచారు. స్వతంత్ర వచ్చి 75 వసంతాలు పూర్తి అయిన ఏపీ సీఎం జగన్ గత ఏడాది ఆగస్టు 15వ తేదిన స్వయంగా వారి ఇంటికి వెళ్లి సీతామహాలక్ష్మిని ఘనంగా సన్మానించారు.
చంద్రబాబుకు తప్పిన ప్రమాదం, నదిలో పడిపోయిన టీడీపీ నేతలు
టీడీపీ అధినేత చంద్రబాబుకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న బోటు ప్రమాదానికి గురైంది.
రెండు పడవలు ఢీకొనడంతో టీడీపీ నేతలు కొందరు నీటిలో పడిపోయారు. దేవినేని ఉమ, ఉండి ఎమ్మెల్యే రామరాజు నదిలో పడినట్లు తెలుస్తోంది. తణుకు మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ, పితాని సత్యనారాయణ నీటిలో పడిన వారిని మత్స్యకారుల సాయంతో రక్షించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేం, తేల్చిచెప్పిన కేంద్రం
Kaleswaram Project : తెలంగాణకు కేంద్రం మరో షాక్ ఇచ్చింది. రాష్ట్ర నేతలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న కాళేశ్వరంప్రాజెక్టు జాతీయ హోదాపై కేంద్రం మరోసారి స్పష్టత ఇచ్చింది. కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వలేమని తేల్చిచెప్పండి. కాళేశ్వరానికి పెట్టుబడులు క్లియరెన్స్ లేదని కేంద్ర సహాయ మంత్రి చెప్పారు.
Sonia Gandhi: సోనియా ఈడీ విచారణ నేడు పూర్తి
నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుట నేడు ఉదయం హాజరైన సోనియా గాంధీ విచారణ ముగిసింది. ఆమెను అధికారులు కేసుకు సంబంధించి 2 గంటల పాటు ప్రశ్నించారు. ఆరోగ్యం బాగాలేదని సోనియా చెప్పడంతో అధికారులు పంపినట్లు తెలుస్తోంది.
Hyderabad: యూట్యూబ్‌లో వ్యూస్ రావడం లేదని యువకుడు ఆత్మహత్య
హైదరాబాద్‌లోని సైదాబాద్‌లో ఓ యువకుడు అపార్ట్‌మెంట్ పైనుంచి ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి యూట్యూబ్ ఛానెల్ ఉండగా, దానికి వ్యూస్ రావడం లేదని మనస్తాపంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. కొద్ది రోజులుగా ధీనా అనే 24 ఏళ్ల యువకుడు గేమింగ్ ఛానెల్ నడుపుతున్నాడు. ప్రస్తుతం అతను ఐఐటీ గ్వాలియర్ లో చదువుతున్నట్లుగా స్థానికులు తెలిపారు. పోలీసులు అనుమానాస్పదంగా చనిపోయినట్లుగా కేసు నమోదు చేసుకున్నారు.