News
News
X

Breaking News Live Telugu Updates: బంటుమిల్లిలో విషాదం, బావిలో పూడికతీసేందుకు దిగి నలుగురు దుర్మరణం

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

FOLLOW US: 
బంటుమిల్లిలో విషాదం, బావిలో పూడికతీసేందుకు దిగి నలుగురు దుర్మరణం 

కృష్ణా జిల్లా బంటుమిల్లిలో విషాదం చోటుచేసుకుంది. బావిలో పూడికతీసేందుకు దిగిన నలుగురు మృతి చెందారు. మృతులు రంగా,శ్రీనివాసరావు, రామారావు , లక్ష్మణరావుగా గుర్తించారు.  

నాకు ఎలాంటి ఈడీ నోటీసులు రాలేదు- ఎమ్మెల్సీ కవిత

ఈడీ నోటీసులపై తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. తనకు ఎలాంటి నోటీసులు అందలేదన్నారు.  అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. దిల్లీలో కూర్చొన్న కొందరు నేతలు మీడియాను తప్పుదోవ పట్టించారన్నారు. వార్తలు ప్రసారం చేసే ముందు నిజనిర్థారణ చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. 

తెలంగాణ కొత్త సచివాలయానికి అంబేడ్కర్ పేరు 

తెలంగాణ నూతన సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెడుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు జీవో జారీ చేయనుంది. 

Kishan Reddy: బీజేపీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ ప్రారంభించిన కిషన్ రెడ్డి

బీజేపీ ఆధ్వర్యంలో వందల మంది మహిళలతో ఆరెంజ్ బ్రిగేడ్ బైక్ ర్యాలీని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం నుంచి పెరెడ్ గ్రౌండ్స్ మీదుగా అసెంబ్లీ ముందున్న సర్దార్ పటేల్ విగ్రహం వరకు మహిళల బైక్ ర్యాలీ సాగనుంది. కేంద్ర మంత్రి స్వయంగా బైక్ నడిపి ర్యాలీని ప్రారంభించారు. సెప్టెంబరు 17న కేంద్రం ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్స్‌లో హైదరాబాద్ విమోచన అమృత మహోత్సవాల్లో భాగంగా మహిళలు ఈ బైక్ ర్యాలీ చేపట్టారు. అమృత మహోత్సవాల్లో భాగంగా పార్టీ తరపున వివిధ కార్యక్రమాలు బీజేపీ నిర్వహిస్తోంది.

Amit Shah Hyderabad Tour: అమిత్ షా హైదరాబాద్ పర్యటన వేళ పోస్టర్లు కలకలం

ఈ నెల 17 కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్‌లో పర్యటించనున్న వేళ, నగరంలో పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. అమిత్ షా పర్యటనను వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో అర్ధరాత్రి పోస్టర్లు వెలిశాయి. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా సాయపడిందో చెప్పాలని డిమాండ్ చేస్తూ పరేడ్ గ్రౌండ్స్ పరిధిలో పోస్టర్లు కనిపించాయి. కంటోన్మెంట్ యువత పేరుతో వెలిసిన ఈ పోస్టర్లలో కేంద్ర ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు.

Gutta Sukhender Reddy: ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవద్దు, గవర్నర్ వ్యాఖ్యలు సరికాదు - మండలి ఛైర్మన్

తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొంత మంది బాధ్యత లేకుండా సెప్టెంబర్ 17ను విలీనం, విమోచన దినం అంటూ ప్రజల భావోద్వేగాలతో చెలగాటం ఆడుతున్నారని అన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర గవర్నర్ తమిళి సై విమోచన దినం అని వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. గవర్నర్ వ్యవస్థకు గౌరవం పోగొట్టొద్దని తెలిపారు. కేంద్రం హైదరాబాద్ పరేడ్ గ్రౌడ్‌లో సభ నిర్వహించడం సరికాదని అన్నారు. కేంద్రం రాష్టాల హక్కులను హరిస్తూ ఇబ్బందులు పెడుతోందని గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు.

Background

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో తెలుగు రాష్ట్రాలపై ప్రభావం తగ్గింది. వాయుగుండం ఆగ్నేయ మధ్యప్రదేశ్ వైపు కదులుతూ వాయువ్య మధ్యప్రదేశ్ కు చేరుకుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశల నుంచి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఏపీ, యానాంలలో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనుండగా.. తెలంగాణలలో అక్కడక్కడా తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు పడతాయి. వర్షాల ప్రభావం తగ్గడంతో ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు వాతావరణ కేంద్రం.  

తెలంగాణలో వర్షాలు 
రాష్ట్రంలో వర్షాలు క్రమంగా తగ్గుతున్నాయి. వారం రోజుల తరువాత తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. నిన్న ఉత్తర తెలంగాణలో పలు జిల్లాల్లో, రంగారెడ్డి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి.  నేడు సైతం హైదరాబాద్ ను మేఘాలు కమ్మేస్తాయి. నగరంలో కొన్ని చోట్ల చిరు జల్లులు పడే ఛాన్స్ ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల వర్ష సూచన ఉంది. కనిష్ట ఉష్ణోగ్రత 22, గరిష్ట ఉష్ణోగ్రత 30గా నమోదైంది. నైరుతి దిశ నుంచి గంటకు 10 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. 

ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో నేడు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు  కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో వర్షాలు తగ్గినా.. కొన్నిచోట్ల నేడు సైతం వర్షాలు కురుస్తాయి. తూర్పు గోదావరి, యానాం, పశ్చిమ గోదావరిలలో ఆకాశం మేఘావృతమై ఉండనుంది. ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. 

దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలల్లో ఉన్నంత వర్షపాతం దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో నమోదు కాదు. ఈ ప్రాంతాల్లో నేడు సాధారణ వర్షపాతం నమోదు కానుంది. పశ్చిమ గాలులు బలపడుతున్నాయి కనుక తిరుపతి నగరంలో, చిత్తూరు జిల్లాలో వర్షాలు, నెల్లూరు జిల్లాకు విస్తరించి అక్కడ నుంచి కొనసీమ జిల్లాలోకి విస్తరించనున్నాయి. తమిళనాడు - ఆంధ్ర సరిహద్దు భాగాల్లో విస్తారంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. దక్షిణ కోస్తాంధ్రలో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, క్రిష్ణా జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల వర్షాలుంటాయి. 

భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.

టాప్ స్టోరీస్

KCR Warangal Tour: వరంగల్‌లో ప్రతిమ మెడికల్‌ కాలేజ్‌‌ ప్రారంభించిన కేసీఆర్, అప్రమత్తంగా ఉండాలని వ్యాఖ్యలు

KCR Warangal Tour: వరంగల్‌లో ప్రతిమ మెడికల్‌ కాలేజ్‌‌ ప్రారంభించిన కేసీఆర్, అప్రమత్తంగా ఉండాలని వ్యాఖ్యలు

Srikalahasti News : రెచ్చిపోయిన శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్, మహిళపై అమానుష దాడి!

Srikalahasti News : రెచ్చిపోయిన శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్, మహిళపై అమానుష దాడి!

IND W vs SL W T20: గెలుపుతో ఆసియా కప్‌ ప్రారంభించిన టీమిండియా - శ్రీలంక మహిళల జట్టుపై భారీ విజయం!

IND W vs SL W T20: గెలుపుతో ఆసియా కప్‌ ప్రారంభించిన టీమిండియా - శ్రీలంక మహిళల జట్టుపై భారీ విజయం!

Pawan Kalyan's Footwear Price: పవన్ కళ్యాణ్ షూ ఖరీదు రూ.10 లక్షలా? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమేనా?

Pawan Kalyan's Footwear Price: పవన్ కళ్యాణ్ షూ ఖరీదు రూ.10 లక్షలా? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమేనా?