అన్వేషించండి

Breaking News Live Telugu Updates: KKR Vs SRH: సన్ రైజర్స్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ మెరుపు సెంచరీ, కేకేఆర్ ముందు భారీ టార్గెట్

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

Key Events
AP Telangana Breaking News Telugu Live Updates 14 april 2023 Ambedkar statue unveiling Breaking News Live Telugu Updates: KKR Vs SRH: సన్ రైజర్స్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ మెరుపు సెంచరీ, కేకేఆర్ ముందు భారీ టార్గెట్
ప్రతీకాత్మక చిత్రం

Background

నేడు (ఏప్రిల్ 14) ఉదయం నుంచే హైదరాబాద్ సహా తెలంగాణలోపి కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు నేడు ఉదయం 6 గంటలకు విడుదల చేసిన వెదర్ బులెటిన్ ప్రకారం.. వచ్చే 3 గంటల్లో నాగర్ కర్నూల్, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి, నారాయణపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కొనసాగుతుందని చెప్పారు. 

నిన్నటి ద్రోణి/ గాలిలోని అనిచ్చితి, ఈ రోజు తూర్పు విదర్భ నుండి మరాత్వాడ, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా కోస్తా కర్ణాటక వరకు సగటు సముద్రం మట్టంకి 0.9 కిలో మీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతుంది. దిగువ స్థాయిలో గాలులు ఈ రోజు ఆగ్నేయ దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయి.

రాగల మూడు రోజులు  తెలంగాణ రాష్ట్రంలో  తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. రాగల మూడు రోజులు  పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ   41 డిగ్రీల నుండి 44 డిగ్రీల మధ్యన రాష్ట్రంలో అనేక చోట్ల నమోదు అయ్యే అవకాశం ఉంది. GHMC, చుట్టు ప్రక్కల జిల్లాలలో  38 డిగ్రీల నుండి 41 డిగ్రీల మధ్యన నమోదు అయ్యే అవకాశం ఉంది.

హైదరాబాద్ లో ఇలా
‘‘హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఉరుములతో కూడిన మేఘాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 39 డిగ్రీలు, 26 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశ నుంచి గాలులు గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 38.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 26.4 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 36 శాతం నమోదైంది.

ఏపీలో ఎండలు ఇలా
నేటి నుంచి ఏపీలో ఎండల తీవ్రత మరింత పెరగనుంది. ఒక పక్కన ఆంధ్రాలో ప్రస్తుతం 41-42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చూస్తూ వచ్చాము. కానీ మరో మూడు రోజుల పాటు ఇది కాస్త 42 నుంచి 43 డిగ్రీల మధ్యలో ఉండనుంది. కారణం ఏమిటి అంటే పొడిగాలులు ఉత్తర భారత దేశం నుంచి నేరుగా మన వైపుగా వీస్తున్నాయి కాబట్టి వేడి తీవ్రత ఎక్కువవ్వనుంది. విశాఖ నగరంలో కూడ నేటి నుంచి మరో మూడు రోజులు వేడిగా ఉంటుంది. అనకాపల్లి, కాకినాడ​, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మణ్యం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల​, ఏలూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంధ్యాల​, కడప​, తూర్పు అనంతపురం, అన్నమయ్య​, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో వేడి 42 నుంచి 43 మధ్యలో ఉండనుంది.

ఆంధ్రప్రదేశ్ లో విరగ కాస్తోంది. ప్రస్తుతానికి పొడి గాలులు కోస్తా ప్రాంతం మీదుగా వీస్తోంది కాబట్టి వేడి అనేది చాలా ఎక్కువగా ఉంది. ప్రకాశం జిల్లాలోని గుండ్లపల్లిలో అత్యధికంగా 43.2 డిగ్రీలు నమోదయ్యింది. అలాగే నంద్యాల​, కడప​, చిత్తూరు జిల్లాలో కూడ 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలకు మించి నమోదయ్యింది. ప్రకాశం జిల్లా జువ్విగుంటలో 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఒక ప్రకాశం జిల్లానే కాదు కోస్తాంధ్ర వ్యాప్తంగా, రాయలసీమ జిల్లాలతో పాటుగా తూర్పు తెలంగాణలో వేడి భాగా పెరిగింది. చాలా చోట్లల్లో 42 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతోంది. రేపు ఈ వేడి కంటే ఇంకాస్త వేడి ఉండే అవకాశాలున్నాయి. జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. గత నెలలో వర్షాలు ఏంటి అని అనుకుంటూ ఉన్నాం, కానీ ఈ నెలలో ఎండలు మామూలుగా లేవు. మరి ఇంకా మంచి ఎండలు ముందు ఉంది’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.

21:16 PM (IST)  •  14 Apr 2023

KKR Vs SRH: సన్ రైజర్స్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ మెరుపు సెంచరీ, కేకేఆర్ ముందు భారీ టార్గెట్

కోల్‌కతా నైట్‌రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ అజేయ శతకంతో చెలరేగాడు. కేవలం 55 బంతుల్లో సెంచరీతో అజేయంగా నిలిచాడు. ఐపీఎల్ 16 సీజన్ లో నమోదైన తొలి శతకం హ్యారీ బ్రూక్ దే. సన్ రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది.

18:05 PM (IST)  •  14 Apr 2023

దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సీబీఐ నోటీసులు 

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ నోటీసులు ఇచ్చింది. దిల్లీ మద్యం కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ ప్రశ్నించనుంది. ఏప్రిల్ 16న విచారణకు రావాలని అరవింద్ కేజ్రీవాల్‌కు సీబీఐ సమన్లు ఇచ్చింది. 
 

Load More
New Update
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Counter to YS Jagan: అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకలేకపోయావు? ఇప్పుడేం చేస్తావు? జగన్‌కు పవన్ స్ట్రాంగ్ కౌంటర్
అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకలేకపోయావు? ఇప్పుడేం చేస్తావు? జగన్‌కు పవన్ స్ట్రాంగ్ కౌంటర్
MBBS Students Suicide: మెడికోల ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం చర్యలు.. గ్రామీణ విద్యార్థులపై స్పెషల్ ఫోస్
మెడికోల ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం చర్యలు.. గ్రామీణ విద్యార్థులపై స్పెషల్ ఫోస్
T20 World Cup 2026 Team India Squad :టి20 ప్రపంచ కప్ ఇండియా స్క్వాడ్‌ నుంచి శుభ్‌మన్‌ గిల్ అవుట్‌! బీసీసీఐ ప్రకటించిన జాబితా ఇదే!
టి20 ప్రపంచ కప్ ఇండియా స్క్వాడ్‌ నుంచి శుభ్‌మన్‌ గిల్ అవుట్‌! బీసీసీఐ ప్రకటించిన జాబితా ఇదే!
Year Ender 2025: యాక్టింగ్ చింపేశారుగా... ధృవ్ విక్రమ్ to రుక్మిణి, కల్యాణీ - 2025లో సర్‌ప్రైజ్ చేసిన సౌత్ స్టార్లు 
యాక్టింగ్ చింపేశారుగా... ధృవ్ విక్రమ్ to రుక్మిణి, కల్యాణీ - 2025లో సర్‌ప్రైజ్ చేసిన సౌత్ స్టార్లు

వీడియోలు

Sanju Samson For T20 World Cup 2026 | మొత్తానికి చోటు దక్కింది...సంజూ వరల్డ్ కప్పును శాసిస్తాడా | ABP Desam
Ishan Kishan Named T20 World Cup 2026 | రెండేళ్ల తర్వాత టీ20ల్లో ఘనంగా ఇషాన్ కిషన్ పునరాగమనం | ABP Desam
Shubman Gill Left out T20 World Cup 2026 | ఫ్యూచర్ కెప్టెన్ కి వరల్డ్ కప్పులో ఊహించని షాక్ | ABP Desam
T20 World Cup 2026 Team India Squad Announced | ఊహించని ట్విస్టులు షాకులతో టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ | ABP Desam
Tilak Varma Innings Ind vs SA T20 | అహ్మదాబాద్‌లో రెచ్చిపోయిన తిలక్ వర్మ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Counter to YS Jagan: అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకలేకపోయావు? ఇప్పుడేం చేస్తావు? జగన్‌కు పవన్ స్ట్రాంగ్ కౌంటర్
అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకలేకపోయావు? ఇప్పుడేం చేస్తావు? జగన్‌కు పవన్ స్ట్రాంగ్ కౌంటర్
MBBS Students Suicide: మెడికోల ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం చర్యలు.. గ్రామీణ విద్యార్థులపై స్పెషల్ ఫోస్
మెడికోల ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం చర్యలు.. గ్రామీణ విద్యార్థులపై స్పెషల్ ఫోస్
T20 World Cup 2026 Team India Squad :టి20 ప్రపంచ కప్ ఇండియా స్క్వాడ్‌ నుంచి శుభ్‌మన్‌ గిల్ అవుట్‌! బీసీసీఐ ప్రకటించిన జాబితా ఇదే!
టి20 ప్రపంచ కప్ ఇండియా స్క్వాడ్‌ నుంచి శుభ్‌మన్‌ గిల్ అవుట్‌! బీసీసీఐ ప్రకటించిన జాబితా ఇదే!
Year Ender 2025: యాక్టింగ్ చింపేశారుగా... ధృవ్ విక్రమ్ to రుక్మిణి, కల్యాణీ - 2025లో సర్‌ప్రైజ్ చేసిన సౌత్ స్టార్లు 
యాక్టింగ్ చింపేశారుగా... ధృవ్ విక్రమ్ to రుక్మిణి, కల్యాణీ - 2025లో సర్‌ప్రైజ్ చేసిన సౌత్ స్టార్లు
IPS PV Sunil Kumar: రఘురామపై ఐపీఎస్ సునీల్ కుమార్ డైరక్ట్ ఎటాక్ - 420 అంటూ విమర్శలు - ఏం జరగబోతోంది?
రఘురామపై ఐపీఎస్ సునీల్ కుమార్ డైరక్ట్ ఎటాక్ - 420 అంటూ విమర్శలు - ఏం జరగబోతోంది?
SSC CGL Tier 2 Exam 2025: ఎస్సెస్సీ సీజీఎల్ టైర్ 2 అభ్యర్థులకు అలర్ట్.. ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చేసింది
SSC CGL Tier 2 అభ్యర్థులకు అలర్ట్.. ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చేసింది
Christmas offers Fraud: క్రిస్మస్ ఆఫర్ల పేరుతో మోసపోవద్దు.. ఈ 3 మార్గాలలో సైబర్ మోసాల నుండి రక్షించుకోండి
క్రిస్మస్ ఆఫర్ల పేరుతో మోసపోవద్దు.. ఈ 3 మార్గాలలో సైబర్ మోసాల నుండి రక్షించుకోండి
Rishabh Pant Ruled out T20 World Cup: గత టీ20 వరల్డ్ కప్ నెగ్గడంలో కీలకం.. రిషబ్ పంత్ సహా చోటు దక్కని 5 మంది స్టార్లు వీరే
గత టీ20 వరల్డ్ కప్ నెగ్గడంలో కీలకం.. పంత్ సహా చోటు దక్కని 5 మంది స్టార్లు వీరే
Embed widget