Breaking News Live Telugu Updates: పరిటాల సునీత పాదయాత్ర ప్రారంభం, భారీగా హాజరైన టీడీపీ నేతలు
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం పుదుచ్చేరి - చెన్నై మధ్యలో తీరాన్ని తాకింది. సాధారణంగా జరిగే ప్రక్రియకు భిన్నంగా ఉత్తర శ్రీలంక - ఉత్తర తమిళనాడు కాకుండా చెన్నై - పుదుచ్చేరిల మధ్య వాయుగుండం తీరాన్ని తాకినట్లు ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. నైరుతి బంగాళాఖాతం, హిందూ మహాసముద్రాలను ఆనుకొని ఏర్పడిన అల్పపీడనం ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కిలో మీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఇది క్రమంగా వాయువ్య దిశగా పయనించి తీరం దాటింది. దీని ప్రభావంతో ఏపీ, తమిళనాడులో మరో రెండు రోజులు పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. తమిళనాడు ప్రభుత్వం పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
ఆంధ్రప్రదేశ్ నేడు, రేపు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. తెలంగాణలో నేడు సైతం వాతావరణం పొడిగా మారిపోయింది. రాష్ట్రంలో మరో రెండు నుంచి మూడు రోజులు వాతావరణంలో ఏ మార్పులు ఉండవని అధికారులు తెలిపారు. ఏపీలో తీరం వెంట 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు సూచించారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో నవంబర్ 16న మరో అల్పపీడనం ఏర్పడనుంది. భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వెంకటగిరి మున్సిపల్ కమిషనర్ గంగాప్రసాద్ స్థానికులను హెచ్చరించారు. మున్సిపల్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, సహాయం కావాల్సిన వారు 9110564575, 08625-295015, 9849905894 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు, పాత భవనాల్లో నివసిస్తున్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచించారు.
తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather Updates)
తెలంగాణలో వాతావరణం మరింత పొడిగా మారింది. మరో మూడు రోజులవరకు వాతావరణంలో ఎలాంటి మార్పులు లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. రాష్ట్రానికి ఎలాంటి వర్ష సూచన లేదు. వర్షాలు లేకపోవడంతో తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు ఇంకా భారీగా నమోదవుతుండగా.. రాత్రివేళ చలి తీవ్రత అధికంగా ఉంది. రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రత ఖమ్మంలో 33.2 డిగ్రీలు నమోదు కాగా, మెదక్ లో రాత్రి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. మెదక్ లో అత్యల్పంగా రాత్రిపూట 13.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రెండు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.
హైదరాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘాలతో ఉంది. నగరంలో ఉదయం సమయంలో పొగ మంచు ఏర్పడే అవకాశం ఉంది, గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 31 డిగ్రీలు, 19 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఈశాన్య దిశ నుంచి గాలులు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు. జిల్లాలతో పోల్చితే హైదరాబాద్‌లో చలి సాధారణంగా ఉంది.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో నవంబర్ 13, 14 తేదీలల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వానలు కురవనున్నాయి. నవంబర్ 12 నుంచి 15 తేదీల్లో ఈ ప్రాంతాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. వాయుగుండం తీరాన్ని తాకడంతో ఉత్తర కోస్తాంధ్రలో సాధారణ వర్షపాతం నమోదు కానుంది. వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మణ్యం జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షం కురవనుంది. ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తేలికపాటి జల్లులతో పాటు గాలులు వీచడంతో చలి తీవ్రత పెరుగుతోంది. మరోవైపు ఈశాన్య రుతుపవనాలు ఏపీలో పూర్తి స్థాయిలో విస్తరిస్తున్నాయి.
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్ర భాగాలైన ప్రకాశం పశ్చిమ భాగాల్లో, పల్నాడు, ఎన్.టీ.ఆర్, నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల వర్షాలున్నాయి. ఈ రోజు కూడా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలుంటాయి. ఆ జిల్లాలతో పాటుగా కడప, అన్నమయ్య, సత్యసాయి, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. అనంతపురం, తిరుపతి, కడప జిల్లాతో పాటుగా సత్యసాయి జిల్లాలోని మిగిలిన భాగాల్లో చిరు జల్లులు పడతాయి. మన ఆంధ్రప్రదేశ్ - తమిళనాడు బార్డర్ ప్రాంతాలైన నగరి, పుత్తూరు, సత్యవేడు వైపు వర్షాలున్నాయి.
Deccan Kitchen Demolition: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడు నంద కుమార్ రెస్టారెంట్ కూల్చివేత
- ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నిందితుడు నందకుమార్ కు చెందిన అక్రమ నిర్మాణాలు కులుస్తున్న జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది
- నిర్మాత దగ్గుపాటి సురేశ్ బాబుకు చెందిన స్థలం లీజుకు తీసుకున్న నందకుమార్
- ఎలాంటి అనుమతులు లేకుండా దక్కన్ కిచెన్ ప్రాంగణంలో రెండు అక్రమ నిర్మాణాలు
- నోటీసులు ఇచ్చినా పనులు ఆపకుండా కొనసాగిస్తుండంతో కూల్చివేత చేపట్టిన అధికారులు
- అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల బందోబస్తు
Pawan Kalyan: గుంకలాం చేరుకున్న పవన్ కల్యాణ్
- విజయనగరం వై జంక్షన్ నుంచి ర్యాలీగా గుంకలాం చేరుకున్న జనసేన అధినేత
- ‘జగనన్న ఇళ్లు - పేదలందరికీ కన్నీళ్లు’ పేరుతో కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్
- గుంకలాంలో జగనన్న కాలనీలో నిర్మితమవుతున్న గృహ నిర్మాణాలు పరిశీలన
Tirumala News: తిరుమలలో కారు బోల్తా
తిరుమలలో కారు బోల్తా కొట్టింది. వేకువజామున తమిళనాడుకు చెందిన సుజుకి కారు కాశీ విశ్వేశ్వర మఠం వద్ద ఉన్న డివైడర్ ను ఢీకొని బోల్తా కొట్టింది. కారును నడుపుతున్న డ్రైవర్ కు స్వల్ప గాయాలు అయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న విజిలెన్స్ సిబ్బంది ప్రథమ చికిత్స నిమిత్తం డ్రైవర్ ను అశ్విని ఆసుపత్రికి తరలించగా, బోల్తా పడ్డ కారును తిరుపతికి తరలించారు. కారు చెన్నైకి చెందిన భక్తులదిగా గుర్తించారు పోలీసులు.
Paritala Sunitha: ప్రారంభమైన పరిటాల సునీత పాదయాత్ర
- శ్రీ సత్యసాయి జిల్లా పేరూరు మండలం గరిమాకుల పల్లి గ్రామంలో ప్రారంభమైన మాజీ మంత్రి పరిటాల సునీత రైతు కోసం పాదయాత్ర
- పరిటాల సునీత పాదయాత్రకు భారీగా తరలి వచ్చిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు
- గరిమాకుల పల్లి నుంచి పేరూరు వరకు 18 కిలో మీటర్ల మేర సాగనున్న మాజీ మంత్రి పరిటాల సునీత రైతు పాదయాత్ర
Maoist Central Committee: తల్లి మరణంపై మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ వేణుగోపాల్ రావు భావోద్వేగ లేఖ రిలీజ్ చేసిన
- తన తల్లి మరణంపై భావోద్వేగ లెటర్ రిలీజ్ చేసిన మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ మల్లోజుల వేణుగోపాల్ రావు
- మీ అంత్యక్రియలకు రాలేనందుకు చింతిస్తున్నా
- పెద్దపల్లి పెద్దవ్వలేదని మావోయిస్టు పార్టీ ఏడుస్తున్నది
- నీ మరణం నాకే కాదు యావత్ మావోయిస్ట్ కుటుంబ సభ్యులకి తీరని లోటు
- మల్లోజుల కోటేశ్వర రావు, వేణుగోపాల్ రావు లాంటి సామాన్య వ్యక్తులను మావోయిస్ట్ పార్టీకోసం కన్నావ్ అంటూ లేఖ