News
News
X

Breaking News Live Telugu Updates: ములాయం సింగ్ అంత్యక్రియలకు హాజరుకానున్న సీఎం కేసీఆర్

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

FOLLOW US: 
Mulayam Death: ములాయం సింగ్ అంత్యక్రియలకు వెళ్లనున్న సీఎం కేసీఆర్

స్వర్గస్తులైన ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హాజరుకానున్నారు. ఉత్తర ప్రదేశ్, ఇటావా జిల్లాలోని ములాయం స్వగ్రామం సైఫయ్ కు మంగళవారం (రేపు 11.10.22) మధ్యాహ్నం సిఎం చేరుకోనున్నారు. దివంగత ములాయం సింగ్ యాదవ్ పార్థివ దేహానికి శ్రద్ధాంజలి ఘటించి నివాళుర్పించనున్నారు. అనంతరం అంత్యక్రియల్లో సిఎం కెసిఆర్ పాల్గొననున్నారు.

Vizianagaram: శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న అశోక గజపతి రాజు

విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారిని మాన్సాస్ చైర్మన్, ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు ఆయన సతీమణి సునీలాగజపతి రాజు దర్శించుకున్నారు. ముందుగా అశోక్ గజపతి రాజుకు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు. పూసపాటి అశోక్ గజపతిరాజు ఆయన సతీమణి సునీలాగజపతి రాజు అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమ్మ పండుగ సంతోషంగా నిర్వహించుకోవాలన్నారు. ‘‘ఆలయ ధర్మకర్త అయిన నన్నే ప్రభుత్వం డిస్మిస్ చేసింది. ఈ ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలి’’ అని ఆ తల్లిని వేడుకున్నామన్నారు.

Tuni News: జాతీయ రహదారిపై దారుణ ఘటన
 • తుని మండలంలోని తేటగుంట సమీపంలో 16 నెంబర్ జాతీయ రహదారిపై దారుణ ఘటన
 • ఒంటినిండా రక్తపు మడుగులో ఉన్న వ్యక్తి
 • తుని ఏరియా ఆస్పత్రికి తరలించిన హైవే అంబులెన్స్
 • గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేసి ఉండొచ్చని అనుమానిస్తున్న వైద్యులు
 • వ్యక్తికి పీకతో పాటు మూడు చోట్ల తీవ్రగాయాలు
 • మెరుగైన వైద్యం కోసం కాకినాడ జనరల్ ఆస్పత్రికి తరలించి వైద్యులు
 • గాయాలపాలైన వ్యక్తి అన్నవరం గ్రామానికి చెందిన వాడిగా గుర్తింపు
Delhi Liquor Case: హైదరాబాద్ ను తాకిన ఢిల్లీ లిక్కర్ స్కాం సెగ, మరో కీలక అరెస్టు
 • హైదరాబాద్ ను తాకిన ఢిల్లీ లిక్కర్ స్కాం సెగ
 • ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో అరెస్ట్
 • నిన్న రాత్రి బోయినపల్లి అభిషేక్ రావును అరెస్ట్ చేసిన సీబీఐ
 • రాబిన్ డిస్టలరీస్ కంపెనీలో భాగస్వామిగా ఉన్న అభిషేక్
 • ఈ కేసులో నిందితుడు రామచంద్రన్ పిళ్లైతో కలిసి కంపెనీ నిర్వాహణ
 • పెద్ద ఎత్తున టెండర్స్ దక్కించుకున్న రాబిన్ డిస్టలరీస్
 • లిక్కర్ స్కాంలో కీలక పాత్ర పోషించిన సమీర్ మహేంద్రు, విజయ్ నాయర్ ల అరెస్ట్
 • ఇండో స్పిరిట్స్ డైరెక్టర్ గా ఉన్న సమీర్ మహేంద్రు
 • లిక్కర్ స్కాం కేసులో కొనసాగుతున్న అరెస్ట్ ల పర్వం
 • విజయ్ నాయర్ ను అరెస్ట్ చేసిన సీబీఐ
 • తాజాగా బోయినపల్లి అభిషేక్
 • సమీర్ మహేంద్రును సైతం ఇటీవల అరెస్ట్ చేసిన ఈడీ
Background

బంగాళాఖతంలో ఏర్పడిన అల్పపీడనం ముఖ్యంగా ఏపీలోని కోస్తాంధ్ర ప్రాంతాలపై ప్రభావం చూపుతోంది. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో ఆదివారం వర్షాలు కురిశాయి. నేడు సైతం పలు జిల్లాలకు వర్ష సూచనతో అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు ఎల్లో అలర్ట్ జారీ చేశాయి. త్వరలో ఈశాన్య రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కొన్నిచోట్ల వర్షాలు తగ్గుముఖం పట్టినా, మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలతో నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దాని అనుబంధ ఉపరితల ఆవర్తనం శ్రీలంక ఉత్తర తీరానికి సమీపంలో సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. 
 
తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather Updates)
రాష్ట్రంపై అల్పపీడనం ప్రభావం ఉంది. కొన్ని జిల్లాలకు వర్ష సూచనతో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 13 వరకు తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఆదివారం హైదరాబాద్, జీహెచ్ఎంసీ పరిధితో పాటు కొన్ని జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి.

నేడు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేశారు.  కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడితే, మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. 

ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
తమిళనాడు వైపు నుంచి వస్తున్న అల్పపీడనం ప్రభావం ఏపీలో మొదలైంది. అల్పపీడనం వలన ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్లూరిసీతారామరాజు, పార్వతీపురం మణ్యం జిల్లాల్లో వర్షాలు పెరుగుతున్నాయి. ఈ ప్రాంతాల్లో ఒకట్రెండు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. తెల్లవారిజామున ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు జోరందుకుంటాయని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. ఉభయ గోదావరి, ఏలూరు, కాకినాడ, కోనసీమ జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తీరంలో 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో నైరుతి, తూర్పు బంగాళాఖాతం దిశల నుంచి గాలులు వీస్తున్నాయని, మత్స్యకారులు వేటకు వెళ్లడం క్షేమదాయకం కాదని అధికారులు హెచ్చరించారు.

దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
అల్పపీడనం ప్రభావం దక్షిణ కోస్తాంధ్రపై తక్కువగా ఉంది. ఈ ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, ఉభయ గోదావరి, ఏలూరు, పల్నాడు జిల్లాలలో నేడు వర్షాలు కురవనున్నాయి. అల్పపీడనం మరింత బలపడటంతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో పలు చోట్ల వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. అనంతపురం జిల్లాతో పాటుగా సత్యసాయి జిల్లా వ్యాప్తంగా ఈ రోజు రాత్రి, అర్ధరాత్రి భారీ వర్షాలు కురవనున్నాయి. ప్రకాశం జిల్లాలోని పలు భాగాలు, కడప జిల్లాలో అక్కడక్కడ వర్షాలు పడతాయని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.

టాప్ స్టోరీస్

Weather Latest Update: తీరందాటిన మాండస్ తుపాను, ఈ జిల్లాల్ని వణికిస్తున్న వానలు

Weather Latest Update: తీరందాటిన మాండస్ తుపాను, ఈ జిల్లాల్ని వణికిస్తున్న వానలు

BRA vs CRO, FIFA WC Quarter Final: ఫిఫా వరల్డ్ కప్‌లో సంచలనం, బ్రెజిల్‌పై విజయంతో సెమీస్‌కు క్రొయేషియా

BRA vs CRO, FIFA WC Quarter Final: ఫిఫా వరల్డ్ కప్‌లో సంచలనం, బ్రెజిల్‌పై విజయంతో సెమీస్‌కు క్రొయేషియా

Pawan On Ysrcp : కారు నుంచి కట్ డ్రాయర్ల వరకూ - వారాహి రంగుల వివాదంపై వైఎస్ఆర్‌సీపీకి పవన్ ఇచ్చిన కౌంటర్స్ ఇవే

Pawan On Ysrcp : కారు నుంచి కట్ డ్రాయర్ల వరకూ - వారాహి రంగుల వివాదంపై వైఎస్ఆర్‌సీపీకి పవన్ ఇచ్చిన కౌంటర్స్ ఇవే

Challa Joins BRS: బీఆర్ఎస్‌లోకి మొదలైన చేరికలు, మాజీ ఎమ్మెల్యే చల్లాకు గూలాబీ కండువా కప్పిన సీఎం కేసీఆర్

Challa Joins BRS: బీఆర్ఎస్‌లోకి మొదలైన చేరికలు, మాజీ ఎమ్మెల్యే చల్లాకు గూలాబీ కండువా కప్పిన సీఎం కేసీఆర్