అన్వేషించండి

Breaking News Live Telugu Updates: షనక శతకం చేసినా, తొలి వన్డేలో 67 పరుగులతో భారత్ ఘన విజయం

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

LIVE

Key Events
Breaking News Live Telugu Updates: షనక శతకం చేసినా, తొలి వన్డేలో 67 పరుగులతో భారత్ ఘన విజయం

Background

తెలుగు రాష్ట్రాల్లో అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు కావడం కొనసాగుతోంది. సాధారణం కంటే చాలా చాలా తక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జనవరి 12 వరకు చలి తీవ్రత ఇలాగే ఉంటుందని అధికారులు తెలిపారు. సాయంకాలం 4 గంటల నుంచే చలి ప్రారంభించి, తెల్లవారుజామున 10 వరకు కొనసాగనుంది. ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, పార్వతీపురం మణ్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటుగా ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నేడు కూడా మరింత చల్లటి వాతావరణం ఉండనుంది. కొన్ని ప్రదేశాల్లో 5 నుంచి 12 డిగ్రీల వరకు పడిపోయే పరిస్థితి ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు.

అరకు లోయల్లో చాలా చల్లటి వాతావరణం కమ్ముకుంది. మన మొత్తం దక్షిణ భారత దేశంలోనే అత్యంత చల్లటి ప్రాంతం ఇది. మొన్న (డిసెంబరు) చింతపల్లిలో అత్యల్పంగా 1.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది. చింతపల్లి - 1.5 డిగ్రీల సెల్సియస్, హుకుంపేట - 1.5 డిగ్రీల సెల్సియస్, కుంతలం - 1.5 డిగ్రీల సెల్సియస్ గా నమోదైందని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. నేడు కూడా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చింతపల్లిలో 5.3 డిగ్రీలు, జి.మాడుగుల, మంత్రాలయం, కర్నూలు రూరల్, ఆదోని, రామవరం, బెళుగప్ప తదితర చోట్ల కూడా 6 నుంచి 8.3 డిగ్రీల అతి కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఉత్తరాదిన కూడా అదే పరిస్థితి
మరోవైపు, దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో చలిగాలులు పెరిగాయి. రాజధాని ఢిల్లీతో పాటు హరియాణా, చండీఘడ్, అమృతసర్ ప్రాంతాల్లో సోమవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు దట్టమైన పొగమంచు కమ్ముకుంటుందని భారత వాతావరణ విభాగం హెచ్చరిక చేసింది. ఢిల్లీలో సోమవారం ఉదయం కనిష్ఠ ఉష్ణోగ్రత 4 డిగ్రీల సెల్షియస్ అని నమోదు అయింది.

పంజాబ్, హరియాణా - చండీగఢ్ - ఢిల్లీ, ఉత్తర రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో చలి గాలులు తీవ్రంగా ఉన్నాయి. రాబోయే రెండు రోజుల్లో రాజస్థాన్ లోని సౌరాష్ట్ర, కచ్ మీదుగా చలిగాలుల పరిస్థితులు కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.

తెలంగాణ వాతావరణం
తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి వచ్చే 3 రోజుల పాటు పొడి వాతావరణంగానే ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కానీ, తెలంగాణలో శీతల గాలుల కారణంగా విపరీతంగా చలి పెరిగింది. నేడు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ లాంటి చాలా జిల్లాల్లో చలి విషయంలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

తెలంగాణ వ్యాప్తంగా పొడి వాతావరణమే ఉంటుంది. కానీ, అక్కడక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. రేపు ఆదిలాబాద్, కుమురం భీం, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా, మిగిలిన జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో చలి గాలులు కూడా పెరుగుతాయని వాతావరణ అధికారులు తెలిపారు. కేవలం దక్షిణ తెలంగాణలో 6 లేదా 7 జిల్లాలకు మాత్రం ఎలాంటి హెచ్చరికలు చేయలేదు.

హైదరాబాద్ లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 29 డిగ్రీలు, 13 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఈశాన్య దిశ నుంచి గాలులు గాలి వేగం గంటకు 4 నుంచి 6 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న 29.7 డిగ్రీలు, 11.3 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

హైపోథర్మియాతో జాగ్రత్త
విపరీతమైన చలిలో బయటకు వెళ్లే వారు ఎవరైనా అల్ప ఉష్ణస్థితికి (హైపోథర్మియా) గురయ్యే ప్రమాదం ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత హానికర స్థాయికి పడిపోయే పరిస్థితినే హైపోథర్మియా అంటారు.

21:25 PM (IST)  •  10 Jan 2023

షనక శతకం చేసినా, తొలి వన్డేలో 67 పరుగులతో భారత్ ఘన విజయం

తొలి వన్డేలో లంకపై 67 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం
భారత్‌లో జరిగిన తొలి వన్డేలో శ్రీలంక ఓటమిపాలైంది. 374 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 306 పరుగులకు పరిమితమైంది. అంతకుముందు విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీ (87 బంతుల్లో 113)తో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ (83), శుభ్ మన్ గిల్ (70) రాణించటంతో నిర్ణీత ఓవర్లలో భారత్ 7 వికెట్లు కోల్పోయి 373 పరుగులు సాధించింది. 

17:35 PM (IST)  •  10 Jan 2023

మాజీ మంత్రి నారాయణ NSPIRA సంస్థలో ఏపీ సీఐడీ సోదాలు

హైదరాబాద్ మాదాపూర్ లోని మాజీ మంత్రి నారాయణకి చెందిన NSPIRA సంస్థలో ఏపీ సీఐడీ సోదాలు నిర్వహిస్తుంది. నారాయణ సంస్థల నుంచి రామకృష్ణ హౌసింగ్ సంస్థలోకి నిధులు మళ్లించారని ఆరోపణలతో సోదాలు చేస్తున్నారు. ఈ డబ్బుతో నారాయణ బినామీల పేర్లపై అమరావతిలో చట్ట విరుద్ధంగా అసైన్డ్ భూముల కొనుగోలు చేశారని సీఐడీ ఆరోపిస్తుంది. 

17:31 PM (IST)  •  10 Jan 2023

Hyderabad: మాజీ మంత్రి నారాయణకి చెందిన NSPIRAలో సీఐడీ సోదాలు

హైదరాబాద్ మాదాపూర్ లోని మాజీ మంత్రి నారాయణ కి చెందిన NSPIRA సంస్థ లో ఆంధ్రప్రదేశ్ సీఐడీ సోదాలు 
-నారాయణ సంస్థల నుండి రామకృష్ణ హౌసింగ్ సంస్థలోకి నిధులు 
-ఈ డబ్బుతో నారాయణ బినామీ ల పేర్ల పై అమరావతిలో చట్ట విరుద్ధముగా అసైన్డ్ భూములు కొనుగోలు చేసినట్లు ఆరోపణలున్నాయి.

17:08 PM (IST)  •  10 Jan 2023

ప్రగతి భవన్ కు సీఎస్ సోమేశ్ కుమార్, సీఎం కేసీఆర్ తో భేటీ! 

తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్  ప్రగతి భవన్ కు చేరుకున్నారు. కాసేపట్లో ఆయన సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. సీఎస్ సోమేశ్ కుమార్ ఏపీ క్యాడర్ కు వెళ్లాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. 

13:16 PM (IST)  •  10 Jan 2023

Srikakulam News: శ్రీకాకుళం జిల్లాలో తుపాకీలు కలకలం

శ్రీకాకుళం జిల్లాలో తుపాకీ కలకలం రేగింది. అక్రమంగా లైసెన్స్ లేకుండా నాటు తుపాకీ కలిగి ఉన్న నేరం కింద ముగ్గురు వ్యక్తులను  టెక్కలి పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం గూడెం రోడ్డులో వాహన తనిఖీ చేస్తున్న పోలీసులుకు బైక్ పై వస్తున్న మెలియపుట్టి మండలంకి చెందిన సవర ప్రసాద్, సవర గజపతిల వద్ద అనుమతి లేని ఒక తుపాకీ విడి భాగాలు గుర్తించారు. విచారణలో జలుమూరు పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ యుగంధర్ గా ఒకరిని గుర్తించారు. హెడ్ కానిస్టేబుల్ తో సహా మరో ఇద్దరు వ్యక్తులను పోలీస్ వారు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 12mm కాళీ, లైవ్ తూటలు మొత్తం 96 స్వాదీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. దీనిపై దర్యాప్తును కొనసాగిస్తామని చెప్పి టెక్కలి సీఐ తెలిపారు.

10:57 AM (IST)  •  10 Jan 2023

CS Somesh Kumar: తెలంగాణ సీఎస్ కేడర్‌ విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు, ఆ ఉత్తర్వులు రద్దు

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కేడర్ విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయన ప్రస్తుతం తెలంగాణ కేడర్ లో ఉండగా ఏపీ కేడర్ కి వెళ్లాలని సూచించింది. రాష్ట్ర విభజన తర్వాత ఆయన కేటాయింపు ఏపీ కేడర్ కు జరిగింది. కానీ, డిప్యుటేషన్ పై ఆయన తెలంగాణలో పని చేస్తున్నారు. ఆయన్ను గతంలో తెలంగాణకు పంపిస్తూ కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. ఇంకో ఏడాది సోమేశ్ కుమార్ కు పదవీ కాలం ఉంది. అయితే, ఈ ఆదేశాలను సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టు ఆశ్రయిస్తారా? అనేది ఆసక్తిగా మారింది.

09:47 AM (IST)  •  10 Jan 2023

YSRCP News: విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ మహిళల మద్య తోపులాట

విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ మహిళల మద్య తోపులాట జరిగింది. గడప గడపకు కార్యక్రమానికి వస్తున్న వైసీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ ను అడ్డుకునేందుకు టీడీపీ చెందిన మహిళలు యత్నించారు. దీంతో ఇరు వర్గాల మద్య వాగ్వాదం, తోపులాట జరిగాయి.

09:40 AM (IST)  •  10 Jan 2023

Khammam ఖమ్మం సభ కోసం కసరత్తులు

టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారిన తర్వాత మొట్ట మొదటిసారిగా తెలంగాణలో ఈ నెల 18 వ తేదీన భారీ బహిరంగ సభ జరగనుంది. అందుకోసం బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు ఈ భారీ బహిరంగ సభను ఖమ్మంలో నిర్వహించాలని నిర్ణయించినందున ఖమ్మం జిల్లా మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర కీలక నేతలు సోమవారం నాడు ప్రగతి భవన్ లో కేసీఆర్ ను కలిసి తమ కృతజ్జతలు తెలిపారు. ఈ సందర్భంగా అధినేతతో సమావేశమైన ఖమ్మం జిల్లా నేతలు బహిరంగ సభను కనీవిని ఎరుగని రీతిలో విజయవంతం చేసేందుకు సంబంధించి చర్చించారు. తెలంగాణలో జరగనున్న మొట్టమొదటి బీఆర్ఎస్ సభను విజయవంతం చేసేందుకు అధినేత సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా నేతలకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వర్ రావు, బండి పార్థ సారథి రెడ్డి, రావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, తాతా మధు, ఎమ్మెల్యేలు హరిప్రియ నాయక్, రేగా కాంతారావు, కందాళ ఉపేందర్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, లావుడ్యా రాములు నాయక్,  ఖమ్మం జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు తదితర నేతలున్నారు.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Narayanpet News: బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
TSGENCO Exams: జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

RR vs DC Match Highlights IPL 2024: ఆఖరి ఓవర్ లో అదరగొట్టిన ఆవేశ్, దిల్లీపై రాజస్థాన్ విజయంYS Jagan vs Sunitha | YS Viveka Case: ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్Karimnagar Young Voters Opinion Poll Elections: కరీంనగర్ యువ ఓటర్లు ఏమంటున్నారు? వారి ఓటు ఎవరికి..?YSRCP Varaprasad | Pathapatnam: వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై రెబెల్ తులసీ వరప్రసాద్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Narayanpet News: బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
TSGENCO Exams: జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Suriya 44 Update: క్రేజీ అప్‌డేట్‌ - అప్పుడే మరో స్టార్‌ డైరెక్టర్‌ని లైన్లో పెట్టిన సూర్య, ‌ఆసక్తి పెంచుతున్న పోస్టర్‌‌
క్రేజీ అప్‌డేట్‌ - అప్పుడే మరో స్టార్‌ డైరెక్టర్‌ని లైన్లో పెట్టిన సూర్య, ‌ఆసక్తి పెంచుతున్న పోస్టర్‌‌
Inter Summer Holidays: ఇంటర్ కాలేజీలకు మార్చి 30 నుంచి వేసవి సెలవులు - కళాశాలల రీఓపెనింగ్ ఎప్పుడంటే?
ఇంటర్ కాలేజీలకు మార్చి 30 నుంచి వేసవి సెలవులు - కళాశాలల రీఓపెనింగ్ ఎప్పుడంటే?
Sivaji Raja: పవన్ కళ్యాణ్ నా ఆఫీస్‌కు వచ్చి గొడవ చేశాడు, అడిగే స్టేజ్ దాటిపోయింది - శివాజీ రాజా
పవన్ కళ్యాణ్ నా ఆఫీస్‌కు వచ్చి గొడవ చేశాడు, అడిగే స్టేజ్ దాటిపోయింది - శివాజీ రాజా
Embed widget