Breaking News: దిల్లీలో మళ్లీ ప్రభుత్వ సిబ్బందికి వర్క్‌ఫ్రమ్ హోం .. సుప్రీం ఆదేశాలతో కేజ్రీవాల్ సర్కారు దిద్దుబాటు చర్యలు
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం
LIVE

Background
మహిళా ఎస్సై పట్ల అనుచితంగా ప్రవర్తించాడని టీఆర్ఎస్ నేతపై కేసు
సిరిసిల్ల జిల్లా యువజన టీఆర్ఎస్ విభాగం అధ్యక్షుడు మనోజ్‌పై కేసు నమోదైంది. మహిళా ఎస్సైపట్ల అనుచితంగా ప్రవర్తించినందుకు కేసు నమోదు చేశామని సీఐ అనిల్ వెల్లడించారు. సిరిసిల్లలో బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణులు ఘర్షణ పడగా.. ఆపేందుకు వెళ్లిన మహిళా ఎస్సై పట్ల మనోజ్ అనుచితంగా ప్రవర్తించాడని తెలిపారు. ప్రధానిపై రసమయి బాలకిషన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని బీజేపీ నిరసనకు దిగింది. గాంధీ చౌక్ వద్ద రసమయి దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు భాజపా శ్రేణులు యత్నించాయి.
తిరుమల తిరుపతి దేవస్థానానికి అరుదైన గుర్తింపు
తిరుమల తిరుపతి దేవస్థానానికి అరుదైన గుర్తింపు లభించింది. ప్రపంచంలో ఏ ఇతర ఆలయంలో లేని విధంగా భక్తులకు సేవలందిస్తున్నందుకు గాను తితిదేకు ఇంగ్లాండ్‌కి చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ సర్టిఫికెట్ అందజేసింది. శనివారం తిరుమలలో తితిదే పాలకమండలి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డికి ఆ సంస్థ ప్రతినిధులు ధ్రువీకరణ పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వై.వి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలో ఎక్కడా లేనంతగా భక్తులకు సేవలు, సదుపాయాలు అందిస్తోందన్నారు. సాధారణ రోజుల్లో తిరుమలలో 60 నుంచి 70వేల మంది భక్తులకు చిన్న పాటి అసౌకర్యం కూడా లేకుండా సంతృప్తికరమైన దర్శనం చేయిస్తున్నామన్నారు. క్యూలైన్ల నిర్వహణ శాస్త్రీయ పద్ధతిలో జరుగుతోందని సుబ్బారెడ్డి చెప్పారు. రోజుకు 3.5లక్షల లడ్డూలు ఆరోగ్యకరమైన వాతావరణంలో తయారు చేస్తున్నట్టు వివరించారు.
గడ్చిరోలిలో ఎదురుకాల్పులు.. ఏడుగురు మావోయిస్టులు మృతి
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా పోలీసులకు మావోయిస్టులకు మధ్య భికర ఎదురు కాల్పులు జరిగాయి. గడ్చిరోలి జిల్లా ధనోరా తాలుక గ్యారబట్టి అటవీ ప్రాంతంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. అయితే ఈ కాల్పుల్లో... ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. కోర్చి పీఎస్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. కోర్చి పీయస్ పరిధిలో మావోయిస్టులు ఉన్నట్లు పక్క సమాచారం రావడంతో గడ్చిరోలి జిల్లా పోలీసులు.. కూంబింగ్ చేశారు. పోలీసులు, మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు.
గడ్చిరోలిలో పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. ఐదుగురు మావోలు మృతి
మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు మరణించినట్లు తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దులోని గడ్చిరోలి జిల్లా గ్యారపట్టి అటవీ ప్రాంతంలో పోలీసులు శనివారం కూంబింగ్ నిర్వహిస్తున్నప్పుడు మావోయిస్టులు కాల్పులకు పాల్పడ్డారు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. అనంతరం ఆ ప్రాంతంలో ఐదుగురు మావోయిస్టుల మృతదేహాలను గుర్తించారు. ఇరు వర్గాల మధ్య కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం.
బాలికలపై పాస్టర్ లైంగిక వేధింపులు
కర్నూలు జిల్లా చాగలమర్రి మండలంలో ఇద్దరు బాలికలపై చర్చి పాస్టర్ లైంగిక వేధింపులు తీవ్ర కలకలం రేపుతోంది. ఈ విషయం బయటకు రాకుండా మధ్య వర్తుల ద్వారా పంచాయతీ చేసినట్లుగా తెలుస్తోంది. బాలిక తల్లి ఫిర్యాదుతో పాస్టర్ పై ఫోక్సో యాక్ట్, నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం పాస్టర్ ను పోలీసులు అరెస్టు చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

