News
News
X

Breaking News Live: జగిత్యాలలో టీఆర్ఎస్ నేతలు కత్తితో పొడిచి చంపిన దుండగుడు

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

FOLLOW US: 
ప్రముఖ పురాణ ప్రవచనకర్త మల్లాది చంద్రశేఖర శాస్త్రి శివైక్యం

ప్రముఖ పురాణ ప్రవచనకర్త మల్లాది చంద్రశేఖర శాస్త్రి (96) శివైక్యమయ్యారు. వయోభారంతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. టీటీడీ ఆస్థాన శాశ్వతపండితుడిగా చంద్రశేఖర శాస్త్రి ప్రసిద్ధి. పురాణాలను శాస్త్రబద్ధంగా చెబుతూ ఎందరో ఆస్తికులకు ధర్మ మార్గాన్ని చూపించారు.  

జగిత్యాలలో టీఆర్ఎస్ నేతలు కత్తితో పొడిచి చంపిన దుండగుడు

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేటలో దారుణం జరిగింది. టీఆర్ఎస్ నేత లక్ష్మయ్యను దుండగుడు కత్తితో పొడిచి చంపాడు.

మంత్రి అవంతికి కరోనా పాజిటివ్‌.. తన నివాసానికి ఎవరూ రావొద్దని విజప్తి

మంత్రి అవంతి శ్రీనివాసరావుకి కరోనా పాజిటివ్.. తనను కలిసిన వ్యక్తులు టెస్ట్ చేయించుకోవాలని కోరిన మంత్రి అవంతి.

విశాఖలో తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న అవంతి. తన నివాసానికి ఎవరూ రావద్దని అత్యవసరమైతే ఫోన్లో సంప్రదించాలని కోరిన మంత్రి అవంతి.

సంగారెడ్డిలో తండ్రిని చంపిన కొడుకు

సంక్రాంతి పండుగ వేళ జిల్లాలోని ఆందోల్ మండలం మన్సాన్‌ పల్లిలో దారుణం జరిగింది. తండ్రిని కొడుకు గొడ్డలిలో నరికి చంపాడు. మందుకు, జల్సాలకు బానిసైన కొడుకు కిష్టయ్య (42) డబ్బుల కోసం తండ్రి చాకలి లక్ష్మయ్య(60) కిరాతకంగా హత్య చేశాడు. గతంలో చాకలి కిష్టయ్యకు మూడు వివాహాలు అయినప్పటికీ అతని వేధింపులు తట్టుకోలేక ముగ్గురు భార్యలు విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

భోగి వేళ అమరావతి రైతుల వినూత్న నిరసన

సంక్రాంతి సందర్భంగా అమరావతి జేఏసీ నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. మందడంలో ‘అమరావతి ఉద్యమ సెగలు’ పేరుతో రైతులు భోగి మంటలు వేశారు. అమరావతికి వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో కాపీలను భోగి మంటల్లో వేసి తగలబెట్టారు. 29 గ్రామాలకు చెందిన రైతులు, మహిళలు భారీగా పాల్గొన్నారు. ప్రజా గాయకుడు రమణ ఆధ్వర్యంలో ఉద్యమ గీతాలను ఆలపించారు. ప్రభుత్వం రైతులపై కక్ష కట్టిందంటూ.. రమణ ఆలపించిన పాటలకు రైతులు డాన్సులు చేశారు.

శంషాబాద్ విమానాశ్రయంలో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

శంషాబాద్ విమానాశ్రయంలో స్పైస్ జెట్ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈ రోజు ఉదయం 7.45 గంటలకు హైదరాబాద్ నుంచి ఇదే విమానం తిరుపతికి వెళ్లింది. తిరుపతిలో దట్టంగా పొగమంచు కమ్ముకోవడంతో సమస్య తలెత్తింది. దీంతో విమానం ల్యాండింగ్‌కు ఏటీసీ అధికారులు అనుమతించలేదు. దీంతో విమానం తిరిగి హైదరాబాద్‌కు రావాల్సి వచ్చింది.

భోగి వేడుకల్లో పాల్గొన్న మంత్రి  చెల్లుబోయిన శ్రీనివాస్ వేణు గోపాలకృష్ణ

తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి  చెల్లుబోయిన శ్రీనివాస్ వేణు గోపాలకృష్ణ భోగి మంటను వెలిగించారు. వి.ఎస్.ఎం.కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. 

భోగి మంటలు వేసిన ఏపీ మంత్రి పేర్ని నాని

కృష్ణా : భోగి పండుగ సందర్భంగా ఏపీ సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మచిలీపట్నంలో తన నివాసం ప్రాంగణంలో కుటుంబ సమేతంగా పాల్గొని భోగి మంటలు వేశారు. ఈ సందర్భంగా మంత్రి పేర్నినాని మాట్లాడుతూ... తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ భోగి సంక్రాంతి పండుగ మీ జీవితంలో వెలుగులు, ఆనందాన్ని నింపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

EAT STREET ప్రారంభించిన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ: సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు EAT STREET ప్రారంభించారు. డిప్యూటీ మేయర్ శైలజ శ్రీనివాస రెడ్డి, మున్సిపల్ కమిషనర్, పోలీస్ కమిషనర్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయవాడ బీసెంట్ రోడ్డులో తెల్లవారుజామున ఎమ్మెల్యే మల్లాది విష్ణు భోగి మంటలు వేశారు.

భోగి వేడుకల్లో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

భోగి పండుగ ప్రజలందరికీ భోగభాగ్యాలు, సుఖ సంతోషాలు కలిగించాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. భోగి పండుగ సందర్భంగా చెన్నై కోట్టూర్ పురంలోని ఇంటి వద్ద వెంకయ్య నాయుడు దంపతులు భోగి మంటలు వేశారు. ప్రతి ఒక్కరూ సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని కోరారు. అందరి జీవితాలు ఆరోగ్యం, శ్రేయస్సుతో ఆనందమయం కావాలని వెంకయ్య ఆకాంక్షించారు.

Background

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భోగి పండగ సంబరం అంబరాన్నంటింది. జిల్లాలో అక్కడక్కడ చిరు జల్లులు పడినా.. తెల్లవారే సమయానికి వా తెరపివ్వడంతో పండగ సందడి మొదలైంది. అర్థరాత్రి నుంచే యువత రోడ్లపైకి వచ్చి భోగి మంటల ఏర్పాట్లు చేశారు. తెల్లవారు ఝామున 3 గంటలకల్లో ప్రతి ఇంటి ముందు భోగిమంటలు మొదలయ్యాయి. గ్రామంలోని కూడళ్లలో, పెద్ద పెద్ద కొయ్యలు తీసుకొచ్చి భోగిమంటలు వేశారు. అభిమాన హీరోల బ్యానర్లు కట్టి సందడి చేశారు.

దుర్గమ్మ ఆలయంలో భోగి సందడి..
ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో సంక్రాంతి పండుగ సందర్భంగా భోగి మంటలు కార్యక్రమం జరిగింది. భోగి మంటలు వెలిగించిన ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ, పాలక మండలి సభ్యులు సీమెచ్. నాగ వెంకట వరలక్ష్మి, కార్యనిర్వాహక ఇంజినీర్లు కేవీఎస్ కోటేశ్వరరావు, లింగం రమాదేవి
కార్యక్రమం నందు పాల్గొన్న ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

కడప నగరంలో భోగి పండుగను ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారుజామున లేచి భోగి మంటలు వేసుకుని ఆట, పాటలు, నృత్యాలతో హోరెత్తించారు ప్రజలు. ప్రతి సంక్రాంతి ఏటా కడప లో చిలకమర్రి కుటుంబం లో ప్రతి ఒక్కరూ సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఒక్క చోటుగా చేరి నాలుగు రోజుల పాటు సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా కుటుంబ సభ్యులమంతా ఒక్క చోట చేరి సంబరాలు చేసుకుంటామని ఉమ్మడి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ సంక్రాంతి కి కలుసుకోవడం ఆనవాయితీగా మారిందన్నారు. పిల్లలు, పెద్దలు, మహిళలు అందరూ కలిసి నృత్యాలు వేస్తూ భోగి మంటలవద్ద ఆనందంగా గడిపారు. జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు.

ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని  పురస్కరించుకొని చక్రస్నాన మహోత్సవాన్ని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించింది.‌. తెల్లవారిజామున శ్రీవారి మూలవిరాట్టుకు ప్రాతకాల కైంకర్యాలు ముగిసిన అనంతరం గర్భాలయం నుండి శ్రీవారి సుదర్శన చక్రాన్ని అర్చకులు ఆలయం వెలుపలకు తీసుకొచ్చి పల్లకిలో మాడావీధిలో ఊరేగింపుగా పుష్కరిణికి తీసుకెళ్లారు.. అనంతరం వారహస్వామి ఆలయ ప్రాంగణంలోని పుష్కరిణి గట్టు వద్ద సుదర్శన చక్రానికి సుగంధపరిమళ ద్రవ్యాలతో అర్చకులు అభిషేకాన్ని  నిర్వహించారు.. అనంతరం వేదమంత్రోచ్ఛరణల నడుమ శుభముహుర్తంలో పుష్కరిణిలో సుదర్శన చక్రాన్ని అర్చకులు మూడుసార్లు ముంచడంతో ద్వాదశి చక్రస్నాన ఉత్సవం ముగిసింది.. కోవిడ్ ఆంక్షలు దృష్ట్యా పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులను టీటీడీ అనుమతించలేదు.

విశాఖలో సందడి
తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా స్మార్ట్ సిటీ వైజాగ్‌లో ప్రజల సంబరాలకు హద్దే లేకుండా పొయింది. తెల్లవారుజామునే అందరి ఇళ్ల ముందు అపార్ట్మెంట్ వాకిళ్లలో.. వీధి చివర్లో భోగి మంటలు వేస్తూ ప్రజలు తమ సంతోషాన్ని వెల్లడించారు. కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా మిస్ అయిన సంతోషాన్ని వారు ఈ ఏడాది రెట్టింపు ఉత్సాహంతో జరువుకున్నారు. థర్డ్ వేవ్ భయపెడుతున్న నేపథ్యంలో పెద్ద పెద్ద గుంపులుగా కాకుండా చిన్న సమూహాలుగానే భోగి మంటల చుట్టూ తిరుగుతూ డాన్సులు చేస్తూ సంక్రాంతికి స్వాగతం పలికారు విశాఖ ప్రజలు.