Breaking News Live: విశాఖపట్నంలో విషాదం.. చేప దాడి చేయడంతో మత్స్యకారుడు మృతి
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

Background
ఈ ఏడాది భారత ప్రభుత్వ పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన డోలు వాయిద్య కళాకారుడు సకిని రామచంద్రయ్యను ముఖ్యమంత్రి కేసీఆర్ సత్కరించారు. అంతేకాక, ఆయనకు వరాల జల్లు కురిపించారు. రామచంద్రయ్య సొంత జిల్లా కేంద్రం కొత్తగూడెంలో నివాసానికి అనువైన ఇంటి స్థలం, అందులో ఇల్లు నిర్మించుకోవడం కోసం రూ.కోటి రివార్డును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. పద్మశ్రీ అవార్డుకు ఎంపికైనందున మంగళవారం రామచంద్రయ్య ప్రగతి భవన్‌కు వచ్చి సీఎం కేసీఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. అంతరించిపోతున్న ఆదివాసీ సాంస్కృతిక కళ అయిన డోలు వాయిద్యాన్ని రామచంద్రయ్య బతికిస్తున్నందుకు సీఎం కేసీఆర్ అభినందించారు.
రామచంద్రయ్య ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ పురస్కారం రావడం పట్ల శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రామచంద్రయ్య మోగక్షేమాలను ముఖ్యమంత్రి కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. ఇంటి స్థలం, నిర్మాణానికి సంబంధించి అధికారులతో సమన్వయం చేసుకోవాల్సిందిగా సూచించారు. అంతేకాక ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావును సీఎం ఆదేశించారు.
ఏపీ, తెలంగాణలో నేడు, రేపు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి, హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రాల అధికారులు వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించారు. అదే సమయంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదవుతాయని తెలిపారు. అమరావతిలోని వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా తక్కువ ఎత్తులో నేడు వాయువ్య గాలులు వీస్తున్నాయి. దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకూ సాధారణంగానే కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. కనిష్ణ ఉష్ణోగ్రతలు సాధారణంగానే నమోదయ్యే అవకాశం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
‘‘తేమ గాలులు, చల్లటి నేల ఉండటం వల్ల రేపు తెల్లవారిజామున దట్టమైన పొగ మంచు గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం మరియు శ్రీకాకుళం జిల్లాల్లో విస్తరించనుంది. చల్లటిగాలులతో పాటు పొగ మంచు కూడ ఉండనుంది. ఈ ప్రాంతాల్లో హైవేలపై వెళ్లేటప్పుడు జాగ్రత్త వహించాల’’ని ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.
విశాఖపట్నంలో విషాదం.. చేప దాడి చేయడంతో మత్స్యకారుడు మృతి
విశాఖపట్నంలో విషాదం చోటుచేసుకుంది. పరవాడ మండలం ముత్యాలంపాలేంలో చెపల వేటకు వెళ్ళిన మత్స్యకారుడు జోగన్నపై కొమ్ముకోనాం అనే చేప దాడి చేయడంతో మృతిచెందాడు. పరవాడ పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టారు. నిజంగానే చేప దాడి చేసిందా, లేదా వేరే ఎవరైనా దాడి చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
మల్లన్న సన్నిధిలో నటుడు రామ్ చరణ్ సతీమణి ఉపాసన
కర్నూలు జిల్లా శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను సినీ నటుడు రాంచరణ్ సతీమణి ఉపాసన దర్శించుకున్నారు. వీరికి ఆలయ రాజగోపురం వద్ద ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఉపాసన స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు
విశాఖపట్నంలో విషాదం.. చేప దాడి చేయడంతో మత్స్యకారుడు మృతి
విశాఖపట్నంలో విషాదం చోటుచేసుకుంది. పరవాడ మండలం ముత్యాలంపాలేంలో చేపల వేటకు వెళ్ళిన మత్స్యకారుడు జోగన్నపై కొమ్ముకోనాం అనే చేప దాడి చేయడంతో మృతిచెందాడు. పరవాడ పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టారు. నిజంగానే చేప దాడి చేసిందా, లేదా వేరే ఎవరైనా దాడి చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.





















