అన్వేషించండి

Munugode BJP : మునుగోడుకు ఏం చేశారో బహిరంగచర్చకు సిద్ధమా ? కేసీఆర్‌కు బండి సంజయ్ సవాల్ !

తెలంగాణ ఏర్పడిన తర్వాత మునుగోడుకు టీఆర్ఎస్ చేసిన మేలుపై చర్చకు సిద్ధమని బండి సంజయ్ సవాల్ చేశారు. పలు ప్రశ్నలతో బహిరంగలేఖ విడుదల చేశారు.

 

Munugode BJP :  మునుగోడు ఉపఎన్నిక వేదికగా టీఆర్ఎస్, బీజేపీల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు చోటు చేసుకుంటున్నాయి. మునుగోడు అభివృద్ధికి గత ఎనిమిదేళ్లుగా ఏం  చేశారో చెప్పాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ చేశారు. ఈ మేరకు కొన్ని ప్రశ్నలతో లేఖ విడుదల చేశారు. ఈ అంశంపై చర్చకు సిద్ధమని  తేది, వేదిక, సమయం ఖరారు చేయాలన్నారు.  2018 మునుగోడులో ఎన్నికల ప్రచారానికి వచ్చిన సందర్భంగా మునుగోడును ఆకుపచ్చ మునుగోడుగా చేసే బాధ్యత  తనదేనని కేసీఆర్ హామీ ఇచ్చారని.. ఆ హామీని మీరు నెరవేర్చారా అని ప్రశ్నించారు. వీటితో పాటు మరికొన్ని ప్రశ్నలను బండి సంజయ్ కేసీఆర్‌కుసంధించారు.  

#.  చౌటుప్పల్‌లో డిగ్రీ కాలేజ్‌ నెలరోజుల్లో ప్రారంభిస్తానని 2018 ఎన్నికల సందర్భంగా మునుగోడులో మీరు ఇచ్చిన హామీ ఏమైంది? ఇంకా నెలరోజులు పూర్తికాలేదా? 

#.  ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష ఎకరాల సాగునీరు ఇస్తామని 2014 లో ఎన్నికల మ్యానిఫెస్టోలో పేజీ నెం.7 లో మీరు హామీ ఇవ్వడం జరిగింది. ఈ 8 సంవత్సరాల కాలంలో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్ని ఎకరాలకు సాగునీరు అందించారో చెప్పగలరా?

#.  మీరు కోట్ల రూపాయలతో నిర్మించుకున్న ప్రగతిభవన్‌ ఖర్చుతో ఒక జిల్లా మొత్తం పేదలకు డబుల్‌బెడ్‌రూమ్‌ ఇండ్ల నిర్మాణం అయ్యేవి.  మీరు మాత్రం కోట్ల రూపాయలతో ఇల్లు  నిర్మించుకుంటారు. ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీ ప్రకారం పేదలకు మాత్రం డబుల్‌బెడ్‌రూమ్‌ ఇండ్లు ఇప్పటి వరకు నిర్మించలేదు. దీనికి మీ సమాధానం ఏమిటి?

#.  మునుగోడులో బీసీ సామాజికవర్గానికి చెందిన గౌడ్లు, పద్మశాలీలు, వడ్డెర, యాదవ, ముదిరాజ్‌, ఇతర బీసీ కులాల వారికి ఎంత మందికి సబ్సిడీ కింద రుణాలు మంజూరు చేశారు? ఈ రుణాల కోసం ఎంత మంది ధరఖాస్తు చేశారు? వీటి వివరాలు చెప్పే దమ్ము, ధైర్యం మీకు ఉందా?

#.   మీ కుటుంబంలో మాత్రం ఐదుగురికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు? 2014 లో మీరు ముఖ్యమంత్రి అయినప్పటి నుండి మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంతమంది విద్యావంతులైన నిరుద్యోగ యువతకు కొత్తగా ప్రభుత్వ కొలువులు వచ్చాయి. ఈ లెక్కలు మీ వద్ద ఉన్నాయా? ఉంటే ప్రకటించండి?

#.  మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలోని విద్యావంతులైన నిరుద్యోగ యువతకు రూ.3,016 ల నిరుద్యోగభృతిని ఎంత మందికి ఇచ్చారు? ఈ భృతి పొందడానికి ఎంత మందికి అర్హత ఉంది? 

#.  మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష రూపాయల రైతురుణమాఫీని ఎంత మందికి అమలు చేశారు? ఇంకా ఎంతమందికి పెండింగ్ లో  ఉంచారు?

#.  జిఎస్టీకి సంబంధించి కేంద్రప్రభుత్వం నిర్వహించిన అనేక సమావేశాల్లో రాష్ట్రప్రభుత్వ ప్రతినిధులు, మీ సుపుత్రుడు కేటీఆర్‌ పాల్గొని చేనేత ట్రైనింగ్‌పైన 5శాతం జిఎస్టీకి ఒప్పుకున్న మాట వాస్తవం కాదా? మీరు, మీ సుపుత్రుడు ‘‘డ్రామారావు’’ ఆడుతున్న దొంగనాటకాలను రుజువులతో సహా నిరూపించడానికి మేము సిద్దం. మీరు సిద్దమా? దీనిపైన మీరు, మీ కుమారుడు యాదాద్రి లక్ష్మినరసింహ స్వామి సన్నిధిలో ప్రమాణం చేయడానికి సిద్దమా?

#.  కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం 40 లక్షల వరకు జిఎస్టీ లేదు. చేనేత కార్మికులపైన మీకు నిజంగా ప్రేమ ఉంటే 20 లక్షలకే రాష్ట్రప్రభుత్వం ఎందుకు జిఎస్టీ విధిస్తోంది? దీనికి మీరు, చేనేత కార్మికులపై కపట ప్రేమ వలకబోస్తున్న ‘‘డ్రామారావు’’ సమాధానం చెప్పాలి?

#.  చేనేత సహకార సంఘాలకు క్రమం తప్పకుండా ఎన్నికలు నిర్వహించాలి?రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ 8 ఏండ్లకాలంలో ఎందుకు ఎన్నికలు నిర్వహించడం లేదు. చేనేత కార్మికుల సంక్షేమంపై మీకు ఉన్న ప్రేమ ఇదేనా? 

#.  పోచంపల్లి చేనేత బజారు స్థలం కబ్బా అయ్యిందని అనేక సంవత్సరాలుగా చేనేత కార్మికులు పోరాడుతున్నారు. దీనిపైన మీకు, మీ సుపుత్రుడు ‘‘డ్రామారావు’’ కు అనేకసార్లు వినతిపత్రాలు ఇచ్చారు. అయినా ఈ సమస్యను పరిష్కరించి కబ్బా స్థలాన్ని వారికి అప్పజెప్పలేదు. ఇదేనా మీకు పద్మశాలీల మీద ఉన్న ప్రేమ?

#.  చేనేత కార్మికులపై మీ ప్రభుత్వానికి ప్రేమ ఉంటే టెస్కోకు చైర్మన్‌, డైరెక్టర్‌ లను ఎందుకు నియమించడం లేదు?
 
ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం  చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. గత కొద్ది రోజులుగా ప్రధాని మోదీకి కేటీఆర్ వరుసగా లేఖలు రాస్తున్నారు. ఆ కోణంలోనే బండి సంజయ్ కూడా లేఖలు రాయడంతో టీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget