అన్వేషించండి

TSRTC Buses Full Rush: ఉచిత ప్రయాణం ఎఫెక్ట్‌- టీఎస్‌ఆర్టీసీలో ఒక్కరోజే 50లక్ష మంది ప్రయాణం

తెలంగాణలో ఆర్టీసీ బస్సులన్నీ ఫుల్‌ అవుతున్నాయి. ఒక్క రోజే 50లక్షల మందికిపైగా ప్రయాణం చేశారు. ఉచిత ప్రయాణం కల్పించడం వల్లే రద్దీ పెరుగుతోందని అధికారులు అంటున్నారు.

Full Rush in TSRTC Buses: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రికార్డులు తిరగరాస్తోంది. టీఎస్‌ఆర్టీసీ (TSRTC) బస్సుల్లో ప్రయాణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ  పెరుగుతోంది. సోమవారం ఒక్కరోజే దాదాపు 50లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారని అధికారులు చెప్తున్నారు. ఇది ఒక రికార్డే అంటున్నారు ఆర్టీసీ అధికారులు.  ఇందుకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్‌ కూడా ఒక కారణమని చెప్తున్నారు.

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక... ఇచ్చిన మాట ప్రకారం టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. దీంతో... షేర్‌ ఆటోలు, క్యాబులు,  బైకులపై వారు కూడా... అవి వదిలేసి.. ఆర్టీసీ బస్సుల్లో వెళ్లేందుకే మొగ్గుచూపుతున్నారు. ఉచిత ప్రయాణం పథకాన్ని ఫుల్లోగా వాడేసుకుంటున్నారు. పైగా.. స్మార్ట్‌ కార్డు  ఇచ్చేవరకు పెద్దగా కండిషన్స్‌ ఏమీ పెట్టలేదు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం. ఏదైనా గుర్తింపు కార్డు చూపిస్తే చాలు బస్సులో జీరో టికెట్‌ ఇస్తున్నారు. దీంతో మహిళలు పెద్దసంఖ్యలో బస్సుల్లో  ప్రయాణాలు చేస్తున్నారు. 

ఇక సోమవారం అత్యధిక సంఖ్యలో అర కోటి.. అంటే 50లక్షల మంది వరకు ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగించారని... తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆపరేషన్స్‌ ఈడీ  మునిశేఖర్‌ వివరించారు. కార్తీక మాసంలో చివరి సోమవారం కావడం కూడా... ఆ రోజు ప్రయాణికుల సంఖ్య పెరగడానికి కారణం కావొచ్చని చెప్తున్నారు. ఆలయాలకు, ఇతర  ప్రాంతాలకు వెళ్లే వారు... ఆర్టీసీ బస్సులనే ఎక్కువగా వినియోగించినట్టు చెప్తున్నారు. అయితే... ప్రయాణికుల రద్దీని ముందే ఊహించి.. దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేశామని  చెప్పారు అధికారులు. రెగ్యులర్‌ బస్సులతో పాటు స్పేర్‌ బస్సులను కూడా నడిపామన్నారు. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు.. వారాంతపు సెలవులు కూడా తీసుకోకుండా విధులు  నిర్వహించారని తెలిపారు. 

సోమవారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో ప్రయాణికులు రాకపోకలు సాగించారని... 50 లక్షల మందికి పైగా బస్సుల్లో ప్రయాణించినట్లు అధికారులు ప్రకటించారు. ఇక... దానికి  ముందు రోజు ఆదివారం సుమారు 41 లక్షల మంది ప్రయాణించినట్టు తెలిపారు. ఆదివారంతో పోలిస్తే సోమవారం 9లక్షల మంది ప్రయాణికులు పెరిగినట్టు తెలిపారు. ఉచిత  ప్రయాణం స్కీమ్‌ వల్ల రోజురోజుకు ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది.. దానికి తగ్గుట్టు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే తెలంగాణలో మహిళలకు స్మార్ట్‌ కార్డులు  ఇచ్చేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నామని చెప్తున్నారు ఆర్టీసీ అధికారులు.

ఇక... తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టినప్పటి నుంచి ఏ బస్సు చూసినా ఫుల్‌ రష్‌గా కనిపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌ నగరంలో సిటీ బస్సులు  నిండిపోతున్నాయి. మహిళా ప్రయాణికుల సంఖ్య పెరగడంతో... బస్సుల్లో రద్దీ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. పీక్స్‌ టైమ్‌లో.. నగరంలో మామూలుగానే నిల్చుడానికి  కూడా ప్లేస్‌ ఉండదు. ఇప్పుడు పరిస్థితి మరీ దారుణంగా ఉందంటున్నారు ప్రయాణికులు. కీలక సమయాల్లో మరిన్ని బస్సులు పెడితే బాగుంటుందని చెప్తున్నారు  ప్రయాణికులు. లేకపోతే.. ఉచిత బస్సు ప్రయాణం సంగతేమో గానీ... గమ్యస్థానం చేరేలోపు నరకం కళ్ల ముందు కనిపిస్తుందని వాపోతున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Tirumala VIP Darsan: లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
Jagan Mohan Reddy Latest News: ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Tirumala VIP Darsan: లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
Jagan Mohan Reddy Latest News: ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Tragedy Incident: ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జు - కాపాడమని వేడుకున్నా కనీసం కనికరించలేదు, ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు
ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జు - కాపాడమని వేడుకున్నా కనీసం కనికరించలేదు, ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు
Tirumala News: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఆర్జిత సేవా టికెట్లు విడుదల, శ్రీవాణి టికెట్లు పెంపు
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఆర్జిత సేవా టికెట్లు విడుదల, శ్రీవాణి టికెట్లు పెంపు
Sai Durgha Tej - Pawan Kalyan: జనసేనాని నుంచి మేనల్లుడు సాయి దుర్గ తేజ్‌కు స్పెషల్ గిఫ్ట్ - దాని ప్రత్యేకత ఏంటో తెలుసా?
జనసేనాని నుంచి మేనల్లుడు సాయి దుర్గ తేజ్‌కు స్పెషల్ గిఫ్ట్ - దాని ప్రత్యేకత ఏంటో తెలుసా?
Hydra Real Estate: చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
Embed widget