అన్వేషించండి

Telangana Assembly : ప్రమాణస్వీకారానికి 18 మంది కొత్త ఎమ్మెల్యేలు గైర్హాజర్ - వాళ్ల కారణాలు ఏమిటంటే ?

18 MLAs did not take oath : తెలంగాణ అసెంబ్లీలో 18 మంది ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేయలేదు. రాజకీయ కారణాలతో బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణం చేయలేదు.


Telangana Assembly  oath :   తెలంగాణ అసెంబ్లీలో 18 మంది ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారానికి హాజరు కాలేదు. బీజేపీ సభ్యులు ఎనిమిది మంది ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఉంటే ప్రమాణం చేయబోమని ప్రకటించారు. మిగిలిన పది మందిలో ఎనిమిది మంది బీఆర్ఎస్ వాళ్లు కాగా ఇద్దరు కాంగ్రెస్ మంత్రులు ఉన్నారు.  ప్రొటెం స్పీకర్​ గా నియమించిన ఎంఐఎం ఎమ్మెల్యే   అక్బరుద్దీన్ ఒవైసీతో రాజ్​ భవన్​ లో గవర్నర్​ గవర్నర్​ తమిళిసై ప్రమాణం చేయించారు.  తరువాత అసెంబ్లీ సమావేశంలో  కొత్తగా ఎన్నికై.. సమావేశంలో పాల్గొన్న  ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్​ ప్రమాణం చేయించారు.   తొలుత సీఎం రేవంత్‌రెడ్డి, ఆ తర్వాత మంత్రులు భట్టి విక్రమార్క, సీతక్క, శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, తుమ్మల నాగేశ్వర్‌రావు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఎమ్మెల్యేలు ఆల్ఫాబేటికల్​ ఆర్డర్​ లో  ప్రమాణ స్వీకారం చేశారు. 

కోమటి రెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయలేదు. ప్రమాణం చేయాలంటే..ఎంపీగా రాజీనామా  చేయాలి. వారు సిట్టింగ్ ఎంపీలుగా ఉన్నారు. వారు ఢిల్లీ వెళ్లి రాజీనామా చేసి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. ఆస్పత్రిలో ఉన్నందున  మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనను చూసుకుంటూ ఆస్పత్రిలోనే  కేటీఆర్ ఉన్నదున వారు హాజరు కాలేదు.  అలాగే   కడియం శ్రీహరి, కొత్త ప్రభాకర్, టి.పద్మారావు గౌడ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి  కూడా వివిధ కారణాలతో ప్రమాణస్వీకారానికి దూరంగా ఉన్నారు. 

మరో వైపు తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన రెండో రోజు అసెంబ్లీ గేటు ముందు తొలి నిరసన బీజేపీ ఎమ్మెల్యే చేశారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశాలు  ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు బహిష్కరించారు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఓవైసీని ప్రొటెం స్పీకర్‌గా చేయడం, ఆయన సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయడానికి బీజేపీ నిరాకరించింది. అయితే అందరూ అసెంబ్లీ దగ్గరకు వచ్చారు. అసెంబ్లీ గేట్ నెంబర్ 2 వద్ద రోడ్డుపై కూర్చొని బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కన్నా ఐదుగురు సీనియర్ ఎమ్మెల్యేలు ఉండగా అక్బరుద్దీన్‌కు ఏవిధంగా ప్రొటెం స్పీకర్ ఇస్తారని బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు వారి నిరసనను అడ్డుకున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలకు పోలీసులు నచ్చజెప్పి నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఎమ్మెల్యేలను తరలించారు.  

తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ ఎన్నిక కసరత్తు ప్రారంభమయింది.  సోమవారం రోజు స్పీకర్ ఎన్నికల కోసం బులెటిన్ విడుదల చేస్తారు.  స్పీకర్ నామినేషన్ల కోసం రెండు రోజుల గడువు ఉంటుంది.  ఈ నెల 14న గురువారం తిరిగి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం  అవుతాయి.  15 న  గురువారం  రోజు స్పీకర్ ఎన్నిక  ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే స్పీకర్ గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ను ప్రకటించింది. ఆయనే కాంగ్రెస్ తరపున నామినేషన్ వేస్తారు. ఇతర పార్టీల నుంచి ఎవరైనా నిలబడతారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Pawan Kalyan to Delhi : హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Pawan Kalyan to Delhi : హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Ambati Rambabu On PusPha 2: కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
Bhuvneshwar Kumar: భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
KTR: '28 సార్లు ఢిల్లీకి పోయి రూ.28 కూడా తేలేదు' - సీఎం రేవంత్‌కు రైతుల బాధలు వినే తీరిక లేదని కేటీఆర్ సెటైర్లు
'28 సార్లు ఢిల్లీకి పోయి రూ.28 కూడా తేలేదు' - సీఎం రేవంత్‌కు రైతుల బాధలు వినే తీరిక లేదని కేటీఆర్ సెటైర్లు
Embed widget