అన్వేషించండి

Xiaomi 13 Pro: ఐఫోన్ 14 ప్రోకు పోటీగా షావోమీ 13 ప్రో - అదుర్స్ అనిపించే కెమెరాతో!

షావోమీ 13 ప్రో స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది.

Xiaomi 13 Pro: షావోమీ 13 సిరీస్ ఫోన్లు మనదేశంలో లాంచ్ అయ్యాయి. వీటిలో అందరి దృష్టిని ఆకర్షించింది షావోమీ 13 ప్రోనే. ఇందులో ఏకంగా ఒక అంగుళం సైజులో ఉన్న 50 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. దీని ధర ఏకంగా ఐఫోన్ 14 ప్రో రేంజ్‌లో ఉంది. ఆ మోడల్‌కు పోటీగానే షావోమీ ఈ మొబైల్‌ను లాంచ్ చేసింది. మరి షావోమీ 13 ప్రో, ఐఫోన్ 14 ప్రోను ఢీకొట్టగలదా?

షావోమీ 13 ప్రో ధర
దీని ధర యూరోప్‌లో 1,299 యూరోల నుంచి ప్రారంభం కానుంది. అంటే మనదేశ కరెన్సీలో సుమారు రూ.1.13 లక్షల పైమాటే. సెరామిక్ బ్లాక్, వైట్ రంగుల్లో ఈ ఫోన్ మార్కెట్లో లాంచ్ అయింది. అయితే మనదేశంలో ఈ ఫోన్ ధర రూ. లక్ష లోపే ఉండవచ్చు. ఫిబ్రవరి 28వ తేదీన ఈ ఫోన్ ధరను మనదేశంలో ఎంతగా నిర్ణయించారో తెలపనున్నారు.

షావోమీ 13 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 4820 ఎంఏహెచ్ బ్యాటరీని అందించనున్నారు. వైర్డ్, వైర్‌లెస్ ఛార్జింగ్‌ను షావోమీ 13 ప్రో సపోర్ట్ చేయనుంది. 120W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ ఫీచర్‌ను ఈ ఫోన్‌లో అందించారు.

ఇక కెమెరాల విషయానికి వస్తే... లెయికా బ్రాండెడ్ కెమెరాలు ఈ ఫోన్‌లో ఉన్నాయి. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది. దీంతో పాటు 50 మెగాపిక్సెల్ ఫ్లోటింగ్ టెలిఫొటో సెన్సార్, 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్లు కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.

ఎంఐయూఐ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.73 అంగుళాల ఓఎల్ఈడీ 2కే డిస్‌ప్లేను అందించారు. డాల్బీ విజన్, హెచ్‌డీఆర్10+ ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. 12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512 జీబీ యూఎఫ్ఎస్ 4.0 ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌ను కూడా అందించారు. 5జీ, వైఫై 6, బ్లూటూత్ వీ5.3, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్‌లో అందుబాటులో ఉన్నాయి.

దీనికి పోటీనిచ్చే వివో ఎక్స్90 ప్రో ప్లస్ విషయానికి వస్తే... ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 3 ఆపరేటింగ్ సిస్టంతో ఈ మొబైల్ లాంచ్ అయింది. ఈ మొబైల్‌లో 6.78 అంగుళాల 2కే ఈ6 అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని డిస్‌ప్లే యాస్పెక్ట్ రేషియో 20:9 కాగా, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌పై వివో ఎక్స్90 ప్రో ప్లస్ పనిచేయనుంది. 12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 512 జీబీ యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్ ఈ ఫోన్‌లో అందించారు.

ఇక కెమెరాల విషయానికి వస్తే... వివో ఎక్స్90 ప్రోలో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ జీస్ వన్ ఇంచ్ సెన్సార్‌ను అందించారు. దీని వెడల్పు ఒక అంగుళం ఉండనుందన్న మాట. దీంతో పాటు 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 50 మెగాపిక్సెల్ పొర్‌ట్రెయిట్ సెన్సార్, 64 మెగాపిక్సెల్ టెలిఫొటో లెన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.

టాప్ హెడ్ లైన్స్

iPhone 3 Whats App Accounts: ఐఫోన్ వాట్సాప్ యూజర్లకు బిగ్ అప్‌డేట్.. ఒకే యాప్‌లో 3 వాట్సాప్ అకౌంట్స్!
ఐఫోన్ వాట్సాప్ యూజర్లకు బిగ్ అప్‌డేట్.. ఒకే యాప్‌లో 3 వాట్సాప్ అకౌంట్స్!
Apple iPhone 18 Pro Sales EMI: ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్ సేల్స్ షురూ.. EMI, క్యాష్‌బ్యాక్ వివరాలు ఇవే!
ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్ సేల్స్ షురూ.. EMI, క్యాష్‌బ్యాక్ వివరాలు ఇవే!
Laptop Keyboard Cleaning : ల్యాప్‌టాప్ కీబోర్డ్ క్లీన్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి
ల్యాప్‌టాప్ కీబోర్డ్ క్లీన్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి
భారత్‌లో iPhone 18 సేల్స్ ప్రారంభం.. అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు
భారత్‌లో iPhone 18 సేల్స్ ప్రారంభం.. అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు

వీడియోలు

Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం
Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Janasena Politics: జనసేన సంస్థాగతంగా బలంగా లేదు.. కూటమిలో ఇబ్బందులు సహజం..! నాదెండ్ల మనోహర్
జనసేన సంస్థాగతంగా బలంగా లేదు.. కూటమిలో ఇబ్బందులు సహజం..! నాదెండ్ల మనోహర్
Secret Wedding Misfires: విజయవాడ కనకదుర్గ గుడిలో పెళ్లి చేసుకుని ముఖం చాటేశాడు.. న్యాయం కోసం మహిళ ఆవేదన
విజయవాడ కనకదుర్గ గుడిలో పెళ్లి చేసుకుని ముఖం చాటేశాడు.. న్యాయం కోసం మహిళ ఆవేదన
KTR Janwada Farmhouse: నాలా కబ్జా చేసి జన్వాడ ఫామ్‌హౌస్‌ కట్టారు, హైడ్రా చర్యలు తీసుకోవాలి: ఎంపీ చామల
నాలా కబ్జా చేసి జన్వాడ ఫామ్‌హౌస్‌ కట్టారు, హైడ్రా చర్యలు తీసుకోవాలి: ఎంపీ చామల
CM Chandrababu In Vizag: పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు, 28,445 కుటుంబాలకు లబ్ధి
పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు, 28,445 కుటుంబాలకు లబ్ధి
Dorothy Trailer: మగాళ్ళు ఏడ్చారు... కీర్తీ సురేష్ ఎంట్రీతో ఫ్రెండ్స్ మధ్య గొడవ - తమిళ్ సినిమా 'డోరతీ' ట్రైలర్ రివ్యూ
మగాళ్ళు ఏడ్చారు... కీర్తీ సురేష్ ఎంట్రీతో ఫ్రెండ్స్ మధ్య గొడవ - తమిళ్ సినిమా 'డోరతీ' ట్రైలర్ రివ్యూ
MS Subbulakshmi: భారతరత్న అందుకున్న తొలి కర్ణాటక సంగీతకారిణి... భర్త మరణంతో కచేరీలు ఫుల్ స్టాప్... ఎవరీ ఎంఎస్ సుబ్బలక్ష్మి?
భారతరత్న అందుకున్న తొలి కర్ణాటక సంగీతకారిణి... భర్త మరణంతో కచేరీలు ఫుల్ స్టాప్... ఎవరీ ఎంఎస్ సుబ్బలక్ష్మి?
Viral Video: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్.. హైదరాబాద్‌లో దారుణం
మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్.. హైదరాబాద్‌లో దారుణం
Romantic Comedy OTT : సాయంత్రం 6 తర్వాత లవర్‌ను చూడకూడదు - ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
సాయంత్రం 6 తర్వాత లవర్‌ను చూడకూడదు - ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
Embed widget