WhatsApp Alternatives: మీ వాట్సాప్ డౌన్ అయ్యిందా? కంగారు పడొద్దు, ఈ 5 యాప్స్ వాడుకోండి
ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన యాప్ వాట్సాప్. భారీగా యూజర్ బేస్ ఉన్నా, ఒక్కోసారి డౌన్ అవుతుంది. ఆ సమయంలో టెన్షన్ పడాల్సిన పని లేదు. వాట్సాప్ లాంటి 5 యాప్స్ అందుబాటులో ఉన్నాయి.
మెటా యాజమాన్యంలోని వాట్సాప్, ప్రపంచంలోని అత్యంత ఎక్కువ వినియోగదారులున్న ఇన్ స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్. తాజాగా(మంగళవారం నాడు) ఈ యాప్ సుమారు రెండు గంటల పాటు డౌన్ అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. సుమారు 2 బిలియన్ల కంటే ఎక్కువ మంది కమ్యూనికేషన్, చెల్లింపుల కోసం వాట్సాప్ ను వినియోగిస్తున్నారు. అకస్మాత్తుగా ఈ యాప్ సేవలు నిలిచిపోవడంతో చాలా మంది కంగారు పడ్డారు. WhatsApp అత్యంత జనాదరణ పొందిన, అత్యంత అనుకూలమైన మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌గా ఉన్నప్పటికీ, ఒక్కోసారి సమస్యలను ఎదుర్కొంటుంది. దీని వలన దాని యూజర్ బేస్‌కు చాలా అసౌకర్యం కలుగుతుంది. ఇలాంటి సందర్భంలో ఉపయోగించాల్సిన 5 ప్రత్యామ్నాయ యాప్ ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
టెలిగ్రామ్
టెలిగ్రామ్ అనేది పావెల్ దురోవ్ స్థాపించిన ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్. టెలిగ్రామ్ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంది. ఇది క్రాస్-ప్లాట్‌ఫామ్. క్లౌడ్-ఆధారిత ఇన్ స్టంట్ మెసేజింగ్ సర్వీసులను అందిస్తుంది. టెలిగ్రామ్ అనేక ఇతర ఫీచర్లతో పాటు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ చాట్‌లు, వీడియో కాలింగ్, ఫైల్ షేరింగ్, వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ (VoIP) కూడా అందిస్తుంది. ఆగస్టు 2013లో iOS కోసం, అక్టోబర్ 2013లో ఆండ్రాయిడ్ కోసం టెలిగ్రామ్ ప్రారంభించబడింది. ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ ఇటీవల భారతదేశంలో ప్రీమియం వినియోగదారుల కోసం నెలవారీ సభ్యత్వ రుసుమును రూ.469 నుంచి రూ.179కి తగ్గించింది.
సిగ్నల్
సిగ్నల్ అనేది ప్రైవసీ ఫోకస్డ్ ఫ్రీ మెసేజింగ్, వాయిస్ టాక్ యాప్. దీనిని ఎవరైనా Apple, Android స్మార్ట్ ఫోన్‌లలో, డెస్క్‌టాప్‌ల ద్వారా కూడా ఉపయోగించవచ్చు. ఈ క్రాస్-ప్లాట్ ఫామ్ ను నాన్ ఫ్రాఫిట్ సిగ్నల్ ఫౌండేషన్ రూపొందించింది. దాని అనుబంధ సంస్థ అయిన LLC ద్వారా సిగ్నల్ మెసెంజర్ అభివృద్ధి చేయబడింది. సిగ్నల్ వినియోగదారులు ఫైల్‌లు, వాయిస్ మెసేజ్‌లు, ఇమేజ్‌లు, వీడియోలతో సహా వన్-టు-వన్, గ్రూప్ మెసేజ్‌లను పంపవచ్చు.
Google చాట్
టెక్ దిగ్గజం Google ద్వారా ఈ యాప్ అభివృద్ధి చేయబడింది, Google Chat అనేది కమ్యూనికేషన్ సర్వీస్, ఇది మొదట టీమ్స్, మరియు వ్యాపార అవసరాల కోసం రూపొందించబడింది. ఆ తర్వాత సాధారణ వినియోగదారులకు కూడా అందుబాటులోకి వచ్చింది. Google Chat ఫైల్‌లను షేర్ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. వర్క్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ను కూడా పంపిచుకునే అవకాశం ఉంటుంది.
iMessage
ఈ యాప్ Apple ద్వారా అభివృద్ధి చేయబడింది. iMessage అనేది 2011లో ఆవిష్కరించబడిన ఇన్ స్టంట్ మెసేజింగ్ సర్వీస్. అయితే, iMessage అనేది iOS, macOS, iPadOS, watchOS వంటి Apple ప్లాట్‌ఫారమ్‌లలో మాత్రమే పనిచేస్తుంది.
మైక్రోసాఫ్ట్ టీమ్స్
2020లో కరోనావైరస్ మహమ్మారి ప్రారంభమైనప్పుడు జనాదరణ పొందిన యాప్‌లలో ఒకటి వెలుగొందింది ఈ యాప్. ఇది బెస్ట్ వర్క్ ప్లేస్ యాప్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఆఫీస్ బయట కూడా ఈ యాప్ ద్వారా పని నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. బిజినెస్ కమ్యనికేషన్ ఫ్లాట్ ఫామ్ గా మైక్రోసాఫ్ట్ దీన్ని రూపొందించింది.
Read Also: ఫేక్ వాట్సాప్ యాప్స్ తో జాగ్రత్త, నిర్లక్ష్యం వహిస్తే భారీ మూల్యం తప్పదు!