అన్వేషించండి

Whatsapp new features: 32 మందితో వీడియో కాల్స్- నెట్​వర్క్ సరిగా లేకున్నా అంతరాయం ఉండదు, వాట్సాప్​లో అదిరే నయా ఫీచర్లు

ఇకపై వాట్సాప్ నుంచి వీడియో కాల్స్ చేసుకోవచ్చు. ఇతర వీడియో కాల్ యాప్స్‌పై ఆధారపడక్కర్లేదు. వాట్సాప్‌ వీడియో కాల్స్‌లో అందుబాటులోకి వచ్చిన ఆప్షన్స్ ఇవే.

సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whats App)​ సరికొత్త అప్​డేట్లు తీసుకొచ్చింది. వీడియో కాల్​లో పాల్గొనేవారి సంఖ్యను పెంచింది. దీంతో పాటు పలు అదిరే ఫీచర్లు సైతం ప్రవేశపెట్టింది. అవేంటంటే?

కోట్లాది మంది యూజర్లతో ప్రపంచంలోనే టాప్ ప్లేస్​లో కొనసాగుతున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్. యూజర్ల సౌలభ్యం కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకొస్తూ తన టాప్ పొజీషన్​ను నిలబెట్టుకుంటూ వస్తోంది ఆ సంస్థ. తాజాగా ఈ మెసేజింగ్ యాప్​నకు మరిన్ని మెరుగులు దిద్దింది. 32 మంది యూజర్లతో వీడియో కాల్, ఆడియో స్క్రీన్ షేరింగ్ వంటి ఫీచర్లతో పాటు సరికొత్త స్పీకర్ స్పాట్​లైట్ అనే అప్​డేట్​తో ముందుకొచ్చింది. ఆ విశేషాలేంటో చూద్దాం పదండి. 

లేటెస్ట్ అప్​డేట్ల​లో భాగంగా కాలింగ్ ఫీచర్లపై ప్రధానంగా దృష్టిపెట్టింది వాట్సాప్. వీడియో కాల్​లో పాల్గొనేవారి పరిమితిని 32కు పెంచింది. ఇదివరకు వాట్సాప్ మొబైల్ డివైజ్​లో మాత్రమే 32 మందితో వీడియో కాల్ చేసే సౌలభ్యం ఉండేది. ఇకపై విండోస్, మాక్ ఓఎస్ యూజర్లు సైతం 32 మందితో వీడియో కాల్ మాట్లాడుకోవచ్చు. ఇదివరకు విండోస్​లో వీడియో కాల్ పార్టిసిపెంట్స్ లిమిట్ 16గా ఉండగా.. మాక్ ఓఎస్​లో ఈ సంఖ్య కేవలం ఎనిమిదిగా ఉండేది. 

అయితే, జూమ్, గూగుల్ మీట్ వంటి యాప్​లు 100 మందితో కాల్స్ చేసుకునే వీలు కల్పిస్తున్నాయి. ఈ యాప్​లలో ఎంటర్​ప్రైజ్ సబ్​స్క్రిప్షన్ తీసుకున్నవారు 500 మందితో వీడియో కాల్​లో పాల్గొనవచ్చు. యాపిల్ సంస్థకు చెందిన ఫేస్​టైమ్.. 32 మందితో వీడియో కాల్ మాట్లాడుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో చిన్న బృందాలకు మరింత చేరువ కావాలన్న ఉద్దేశంతో వాట్సాప్ తాజాగా లిమిట్ పెంచినట్లు తెలుస్తోంది. మార్కెట్​లోని పోటీ సంస్థలకు తామేమాత్రం తక్కువ కాదనే మెసేజ్ ఇచ్చింది!

వాయిస్ స్క్రీన్ షేరింగ్

వాట్సాప్ తీసుకొచ్చిన మరో ఫీచర్ వాయిస్ స్క్రీన్ షేరింగ్. గతేడాది వీడియో స్క్రీన్ షేరింగ్ ఫీచర్​ను తీసుకొచ్చిన వాట్సాప్.. తాజాగా కేవలం ఆడియోతోనూ స్క్రీన్ షేర్ చేసుకునే వీలు కల్పించేలా తన యాప్​‌కు మార్పులు చేసింది. ప్రెసెంటేషన్స్ కోసం వృత్తి నిపుణులకు ఈ ఫీచర్ ఉపయోగపడనుంది. అంతేకాకుండా, ఆడియో స్క్రీన్ షేరింగ్ ద్వారా కాల్​లో పాల్గొన్న ఇద్దరూ ఒకే వీడియోను తమ తమ స్క్రీన్​లపై వీక్షించవచ్చు. 

స్పీకర్ స్పాట్​లైట్ ఫీచర్

వాట్సాప్​ వీడియో కాల్​ సమయంలో మాట్లాడుతున్న వ్యక్తిని హైలైట్ చేసి చూపించడమే ఈ ఫీచర్ ప్రధాన ఉద్దేశం. మాట్లాడుతున్న వ్యక్తిని స్క్రీన్​పై ఫస్ట్ కనిపించేలా చేస్తుందీ స్పాట్​లైట్ ఫీచర్. 'ఎక్స్​'(ట్విట్టర్)లోని స్పేసెస్ సహా పలు ఆడియో చాట్ యాప్​లలో ఈ ఫీచర్ ఎప్పటి నుంచో ఉంది.

లో నెట్​వర్క్​లోనూ బెస్ట్ కాల్స్!

నెట్​వర్క్ సరిగా లేకపోయినా నాణ్యమైన కాల్స్ చేసుకునేందుకు వీలు కల్పించే ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చింది వాట్సాప్. ఈ మేరకు 'మెటా లో బైట్రేట్' (MLow) అనే ప్రోగ్రామ్​ను వాట్సాప్​కు జత చేసింది. యూజర్ల నెట్​వర్క్ కనెక్షన్ స్థిరంగా లేకపోయినా, పాత డివైజ్​లు వాడుతున్నా.. ఈ ఫీచర్ ద్వారా మెరుగైన కాల్స్ చేసుకోవచ్చని వాట్సాప్ తెలిపింది. ఈ MLow ఫీచర్ ఇప్పటికే ఇన్​స్టాగ్రామ్, మెసేంజర్​లో అందుబాటులో ఉంది. తమ ప్లాట్​ఫామ్స్ అన్నింటిలో ఈ ప్రోగ్రామ్​ను ప్రవేశపెట్టాలని మెటా భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే వాట్సాప్​లో ఈ ఫీచర్​ను ప్రవేశపెట్టింది.

Read Also: సూపర్ ఏఐ కెమెరా ఫీచర్లతో వచ్చిన ఒప్పో రెనో 12 5జీ సిరీస్ - కొనాలంటే ఎంత ఖర్చు పెట్టాలి?

టాప్ హెడ్ లైన్స్

Best Phones Under 30000: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు
Type A vs Type C Cables: ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఏ కేబుల్ బెస్ట్.. టైప్-ఎ, టైప్-సి మధ్య తేడాలు ఇవే!
ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఏ కేబుల్ బెస్ట్.. టైప్-ఎ, టైప్-సి మధ్య తేడాలు ఇవే!
Android Phone Running Slow : మీ ఆండ్రాయిడ్ ఫోన్ స్లోగా ఉందా? ఈ 3 సెట్టింగ్స్‌ను 0.5xకి మార్చి చూడండి
మీ ఆండ్రాయిడ్ ఫోన్ స్లోగా ఉందా? ఈ 3 సెట్టింగ్స్‌ను 0.5xకి మార్చి చూడండి
WhatsApp Business API Pricing Changes: వాట్సాప్ బిజినెస్ వాడుతున్నారా? - ఏపీఐ కొత్త ఛార్జీలు ఇవే!
వాట్సాప్ బిజినెస్ వాడుతున్నారా? - ఏపీఐ కొత్త ఛార్జీలు ఇవే!

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Medicine Nobel Prize: మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
Supreme Court Notices To Gyanesh Kumar: సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
Hyderabad Tank Bund Accident: ట్యాంక్ బండ్‌పై పెను విషాదం.. పుట్టినరోజు నాడే ఆరేళ్ల చిన్నారి మృతి
ట్యాంక్ బండ్‌పై పెను విషాదం.. పుట్టినరోజు నాడే ఆరేళ్ల చిన్నారి మృతి
Harish Rao Siddipet : సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
YSRCP Local Elections Strategy: స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
కియా కార్ల దసరా సేల్‌.. రూ.1.70 లక్షల వరకు ప్రయోజనాలు.. అక్టోబర్ ఆఫర్ల పూర్తి లిస్ట్
కియా కార్లపై దసరా ఆఫర్లు.. ఈ పండుగ టైమ్‌లో రూ.1.70 లక్షల వరకు ఆదా!
MLA Chintamaneni Prabhakar: వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
Embed widget