అన్వేషించండి

WhatsApp: ఇకపై వాట్సాప్‌లో పోల్ నిర్వహించుకోవచ్చు, త్వరలో అందుబాటులోకి సరికొత్త ఫీచర్!

వాట్సాప్ మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. అభిప్రాయ సేకరణ కోసం వినియోగించే పోల్ నిర్వహణ అవకాశాన్ని కల్పించబోతుంది.

ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం నూతన ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చే ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. మరో సరికొత్త యాప్ ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. గ్రూప్ చాట్‌ లో పోల్‌ లను నిర్వహించడానికి వినియోగదారులను అనుమతించేలా వాట్సాప్ పనిచేస్తోంది. ఈ విషయాన్ని WABetaInfo వెల్లడించింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ ను షేర్ చేసింది. కెమెరా షార్ట్‌ కట్ నావిగేషన్ బార్‌ లో ఈ ఫీచర్ ఉన్నట్లు ఇందులో కనిపిస్తుంది. కమ్యూనిటీలను రూపొందించే వారి కోసం ఈ ఫీచర్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని వెల్లడించింది.  

మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ ప్లాట్‌ ఫామ్ WhatsApp చాట్‌ లో పోల్‌ లను సృష్టించడానికి వినియోగదారులను అనుమతించే కొత్త అప్‌ డేట్‌ పై చాలా కాలంగా పని చేస్తుందని WABetaInfo వెల్లడించింది.  అభివృద్ధి దశలో ఉన్న ఈ ఫీచర్‌ తో, గ్రూప్ పార్టిసిపెంట్‌ లు గ్రూప్‌ లోని ఇతర సభ్యులతో పోల్‌లను షేర్ చేసుకునే అవకాశం ఉంది. అయితే గరిష్టంగా 12 ఆప్షన్లను మాత్రమే యాడ్ చేసే అవకాశం ఉంది. అయితే, ఫీచర్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే సరికి ఈ సంఖ్యలో మార్పులు, చేర్పులు ఉండే అవకాశం ఉంది.   

ఈ ఫీచర్ ఇంకా డెవలపింగ్ లో ఉన్న నేపథ్యంలో బీటా టెస్టర్‌ లకు విడుదల చేయలేదు. WABetaInfo నివేదిక ప్రకారం ఈ ఫీచర్ కోసం ఎంట్రీ పాయింట్ సాధారణ చాట్ యాక్షన్ షీట్‌ లో అందుబాటులో ఉంటుంది. ఇది Android 2.22.10.11 కోసం WhatsApp బీటా అభివృద్ధి సమయంలో గుర్తించినట్లు వెల్లడించింది.  ఐఫోన్ వినియోగదారుల కోసం వారి యాప్‌ లో కొత్త కెమెరా షార్ట్‌ కట్‌ ను జోడించే ఫీచర్‌ పై వాట్సాప్ పని చేస్తోందని వెల్లడించింది.  కెమెరా షార్ట్‌ కట్ నావిగేషన్ బార్‌ లోని చూపించినట్లుగా ఫీచర్ ఉంటుందని  WABetaInfo  స్క్రీన్‌ షాట్ లో చూపించింది. ప్రస్తుతం కమ్యూనిటీని రూపొందించిన వారితో పాటు భవిష్యత్తులో కమ్యూనిటీని సృష్టించగల వినియోగదారుల కోసం ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని తెలిపింది.

వాస్తవానికి ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ కోసం WhatsApp బీటాలో రిలీజ్ చేసినట్లు తెలుస్తున్నది. కానీ, ఒక బగ్ ఉన్నందున.. తాత్కాలికంగా మరొక అప్ డేకోసం బీటా నుంచి తొలగించినట్లు తెలుస్తున్నది. ఇప్పటికే 90 శాతానికి పైగా టెస్టింగ్ పూర్తి చేసుకున్నా ఈ ఫీచర్ త్వరలో వినియోగదారులకు అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తున్నది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే ఆయా అంశాలకు సంబంధించి పోల్స్ నిర్వహించుకునే వెసులు బాటు ఉంటుంది. వీలైనంత త్వరగా ఈ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురావాలని వినియోగదారులు కోరుతున్నారు.

Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Smart TVs : స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
Xiaomi Diwali Sale 2026: దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
Best Phones Under 30000: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు
Type A vs Type C Cables: ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఏ కేబుల్ బెస్ట్.. టైప్-ఎ, టైప్-సి మధ్య తేడాలు ఇవే!
ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఏ కేబుల్ బెస్ట్.. టైప్-ఎ, టైప్-సి మధ్య తేడాలు ఇవే!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Crime News: పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
Chandrababu And Pawan Kalyan Meeting: ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
Rahul Gandhi Climbed Barricades: ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని రెపరెపలాడించిన రాహుల్ గాంధీ..
ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని ఊపిన రాహుల్ గాంధీ..
Highest Tax in India: దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
RTC Conductor Cheating: రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
సరికొత్తగా మార్కెట్లోకి Skoda Slavia Facelift.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే.. ఫీచర్ల వివరాలు
సరికొత్తగా మార్కెట్లోకి Skoda Slavia Facelift.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే.. ఫీచర్ల వివరాలు
Romantic Movie OTT : ట్రెండింగ్ బోల్డ్ రొమాంటిక్ మూవీ - పెద్దలకు మాత్రమే... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ట్రెండింగ్ బోల్డ్ రొమాంటిక్ మూవీ - పెద్దలకు మాత్రమే... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Bigg Boss Season 10 Today Promo 2: బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో 2: చరణ్‌ మీద చలరేగిపోయిన నరేశ్! ముకేశ్ విజిల్స్! అపూర్వ వర్సెస్ ఝాన్సీ!
బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో 2: చరణ్‌ మీద చలరేగిపోయిన నరేశ్! ముకేశ్ విజిల్స్! అపూర్వ వర్సెస్ ఝాన్సీ!
Embed widget