అన్వేషించండి

WhatsApp DND Mode: వాట్సాప్‌లో కొత్త ఫీచర్ - ఇక DND మోడ్‌లో ఉన్నా సరే!

వాట్సాప్ త్వరలో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుందని తెలుస్తోంది.

ఎంతో మందికి ఉపయోగపడే కొత్త ఫీచర్‌పై వాట్సాప్ ప్రస్తుతం పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఫోన్ Do Not Disturb (DND) మోడ్‌లో ఉన్నప్పుడు మిస్డ్ కాల్ వస్తే ఇకపై వినియోగదారులకు నోటిఫికేషన్ రానుంది. వాట్సాప్ ఫీచర్లకు సంబంధించిన అప్‌డేట్స్‌ను అందించే WABetaInfo దీని గురించి ప్రత్యేకంగా తెలిపింది. ఈ ఫీచర్ వాట్సాప్ బీటా టెస్టర్లకు అందుబాటులోకి వచ్చింది. వాట్సాప్ బీటా ఫర్ ఆండ్రాయిడ్ వెర్షన్ 2.22.21.7లో ఈ ఫీచర్ డెవలప్‌మెంట్ స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది.

మీ సెట్టింగ్స్‌లో డు నాట్ డిస్టర్బ్ మోడ్ ఆన్ చేసినప్పటికీ మీకు వాట్సాప్‌లో ఏదైనా మిస్డ్ కాల్ వస్తే మీకు తెలుస్తుంది. ఈ వాట్సాప్ బీటా ఫీచర్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. స్టేబుల్ అప్‌డేట్ ద్వారా మిగతా యూజర్లకు ఈ అప్‌డేట్ ఎప్పుడు వస్తుందో తెలియరాలేదు.

వాట్సాప్ త్వరలో సరికొత్త ఫీచర్‌ను కూడా తీసుకురానుంది. దీంతో గ్రూప్‌లో మెసేజ్ చేస్తున్న సభ్యుల ప్రొఫైల్ ఫోటో కూడా చూడవచ్చు. ఈ ప్రొఫైల్ ఫోటో సభ్యుల పేర్లతో పాటు చూడవచ్చు. అయితే ప్రస్తుతానికి ఈ ఫీచర్ కొంతమంది బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఇతర వినియోగదారులు ఈ ఫీచర్ కోసం మరికొంత కాలం వేచి ఉండాల్సి ఉంటుంది. ఈ ఫీచర్ పూర్తిగా అందుబాటులోకి వస్తే మీరు గ్రూప్ సభ్యుల ఫోటోలను చూడటానికి వారి ప్రొఫైల్‌ను ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. మెసేజ్, పేరుతో పాటు, వారి ఫోటో కూడా గ్రూప్ చాట్‌లో మీకు కనిపిస్తుంది.

వాట్సాప్ త్వరలో తీసుకురానున్న ఈ ఫీచర్‌ను మొదట WABetainfo లీక్ చేసింది. దీని కథనం ప్రకారం, WhatsApp ఈ ఫీచర్‌ను కొంతమంది బీటా టెస్టర్‌లకు విడుదల చేసింది. ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్ట్‌ఫ్లైట్ యాప్ నుంచి iOS కోసం WhatsApp బీటా తాజా వెర్షన్‌ను అమలు చేస్తున్న బీటా టెస్టర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది.

ఐఓఎస్ 22.18.0.72 అప్‌డేట్ కోసం వాట్సాప్ బీటా, వాట్సాప్ గ్రూప్‌లోనే సభ్యుని ఫోటోను చూపించడానికి కొత్త ఫీచర్‌పై పని చేస్తున్నట్లు సమాచారం. ఆ తర్వాత డెస్క్‌టాప్ బీటా కోసం కూడా వాట్సాప్ ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ ఫీచర్ కొంతమంది యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చింది. దీని గ్లోబల్ లాంచ్‌ను కంపెనీ ప్రకటించలేదు. అయితే రాబోయే కాలంలో ఈ ఫీచర్ మిగిలిన వినియోగదారులకు కూడా అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.

రిపోర్ట్‌లో ఇచ్చిన స్క్రీన్‌షాట్ ప్రకారం, గ్రూప్‌లోని సభ్యుల మెసేజ్‌లో పేరు పక్కన ఒక సింబల్ కనిపిస్తుంది. దానిపై వినియోగదారు ప్రొఫైల్ ఫోటో కనిపిస్తుంది. మీ అకౌంట్‌లో ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసి ఉంటే, గ్రూప్‌లో మెసేజ్‌కి ముందు ఫోటోను మీరు చూస్తారని దీన్ని బట్టి స్పష్టమవుతోంది. కనిపిస్తే ఇది మంచి UI అడిషన్. సమూహంలోని సభ్యులు ఒకరినొకరు గుర్తించడంలో సహాయపడుతుంది. అలాగే సభ్యునికి ప్రొఫైల్ ఫోటో లేకపోయినా లేదా ప్రైవసీ సెట్టింగ్‌ల కారణంగా ప్రొఫైల్ ఫోటో కనిపించకపోతే ఫోటోకు బదులుగా మెసేజ్ కలర్ సింబల్ కనిపిస్తుంది.

Also Read: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

టాప్ హెడ్ లైన్స్

How To Recover Deleted WhatsApp Messages: వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను తిరిగి పొందడం ఎలా? బ్యాకప్‌ లేకపోయినా రికవరీ చేసే సీక్రెట్‌ ట్రిక్స్!
వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను తిరిగి పొందడం ఎలా? బ్యాకప్‌ లేకపోయినా రికవరీ చేసే సీక్రెట్‌ ట్రిక్స్!
How To Free Up Storage On Android Phones: ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ స్టోరేజ్‌ ఫుల్ అయ్యిందా?థర్డ్ పార్టీ యాప్‌ అవసరం లేకుండానే స్పేస్‌ను ఖాళీ చేసే సీక్రెట్‌ టిప్స్‌!
ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ స్టోరేజ్‌ ఫుల్ అయ్యిందా?థర్డ్ పార్టీ యాప్‌ అవసరం లేకుండానే స్పేస్‌ను ఖాళీ చేసే సీక్రెట్‌ టిప్స్‌!
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Cement Corporation of India: ఆదిలాబాద్‌లో సిమెంట్ పరిశ్రమ పునరుద్ధరణపై జోగు రామన్న అల్టిమేటం - ఆగస్టు 31లోగా తేల్చకపోతే ఆమరణ నిరాహార దీక్ష!
ఆదిలాబాద్‌లో సిమెంట్ పరిశ్రమ పునరుద్ధరణపై జోగు రామన్న అల్టిమేటం - ఆగస్టు 31లోగా తేల్చకపోతే ఆమరణ నిరాహార దీక్ష!

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Uravakonda latest News: ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
Auqib Nabi Selection: జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!
జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!
Eesha Rebba : గోల్డ్ కలర్ డ్రెస్‌లో అందాల ఈషా - సరస్సు ఒడ్డున దేవకన్యలా...
గోల్డ్ కలర్ డ్రెస్‌లో అందాల ఈషా - సరస్సు ఒడ్డున దేవకన్యలా...
Brij Bhushan Sharan Singh: రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
Embed widget