అన్వేషించండి

Vivo X100 Sale: సంక్రాంతి ముందు వివో ఎక్స్100 సేల్ ప్రారంభం - ఎంత క్యాష్‌బ్యాక్ లభిస్తుందంటే?

Vivo X100: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో ఇటీవలే మార్కెట్లో లాంచ్ చేసిన ఫ్లాగ్‌షిప్ ఎక్స్100 సిరీస్‌ సేల్ ప్లిప్‌కార్ట్‌లో ప్రారంభం అయింది.

Vivo X100 Flipkart Sale: వివో ఎక్స్100, వివో ఎక్స్100 ప్రో స్మార్ట్ ఫోన్లు ఇటీవలే మనదేశంలో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. వీటికి సంబంధించిన సేల్ ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఆన్‌లైన్ స్టోర్లలో నేటి నుంచి ప్రారంభం అయింది. ఈ సిరీస్ ఫోన్లలో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్రాసెసర్‌ను కంపెనీ అందించింది. మామూలుగా వివో ఎక్స్ సిరీస్‌ ఫోన్లలో కెమెరాలు అతి పెద్ద ప్లస్ పాయింట్‌గా ఉంటాయి. ఈ సిరీస్‌లో కూడా అదే రిపీట్ అయింది. వీటి వెనకవైపు జీస్ బ్రాండెడ్ కెమెరాలను కంపెనీ అందించడం విశేషం. వివో ఎక్స్100 ప్రో స్మార్ట్ ఫోన్‌లో సోనీ ఐఎంఎక్స్989 వన్ ఇంచ్ కెమెరాను అందించారు. అంటే ఈ సెన్సార్ సైజు ఏకంగా ఒక అంగుళం ఉంటుందన్న మాట.

వివో ఎక్స్100 ధర, ఆఫర్ (Vivo X100 Price Offers)
ఇందులో రెండు వేరియంట్లు మార్కెట్లోకి వచ్చాయి. వీటిలో 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వెర్షన్ ధర రూ.63,999గా ఉంది. 16 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.69,999గా కంపెనీ నిర్ణయించింది. ఆస్టరాయిడ్ బ్లాక్, స్టార్‌గేజ్ బ్లూ కలర్ ఆప్షన్లలో వివో ఎక్స్100ను కొనుగోలు చేయవచ్చు. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే 10 శాతం క్యాష్‌బ్యాక్ అందించనున్నారు.

వివో ఎక్స్100 ప్రో ధర, ఆఫర్ (Vivo X100 Pro Price Offers)
ఈ ఫోన్‌లో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 16 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన వేరియంట్ ధరను రూ.89,999గా నిర్ణయించారు. ఆస్టరాయిడ్ బ్లాక్ కలర్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. వివో ఎక్స్100 తరహాలోనే ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం క్యాష్‌బ్యాక్ లభించనుంది.

వివో ఎక్స్100 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Vivo X100 Pro Features)
ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టంపై వివో ఎక్స్100 ప్రో రన్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.78 అంగుళాల అమోఎల్ఈడీ 8టీ ఎల్టీపీవో కర్వ్‌డ్ డిస్‌ప్లేను అందించారు. 120 హెర్ట్జ్ వరకు స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ ఉంది. ఆక్టాకోర్ 4ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్రాసెసర్‌పై వివో ఎక్స్100 ప్రో పని చేయనుంది. వివో కొత్త వీ3 ఇమేజింగ్ చిప్‌తో ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. 16 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ ఉండటం విశేషం. కాబట్టి ఫోన్ ఉపయోగించడంలో ఎటువంటి సమస్యలూ రావు.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాల సెటప్ అందించారు. ఒక అంగుళం సైజ్ ఉన్న 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్989 సెన్సార్‌ కూడా ఈ ఫోన్‌లో ఉంది. 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ జీస్ ఏపీవో సూపర్ టెలిఫొటో కెమెరాలు కూడా అందించారు. ఈ టెలిఫొటో కెమెరా 4.3x ఆప్టికల్ జూమ్‌ను సపోర్ట్ చేయనుందని కంపెనీ తెలిపింది. ప్రైమరీ షూటర్, టెలిఫొటో కెమెరా 100x డిజిటల్ జూమ్‌ను సపోర్ట్ చేయనుండటం విశేషం. ఇది దాదాపు శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రాకు సమానం. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.

512 జీబీ యూఎఫ్‌ఎఫ్ 4.0 ఇన్‌బిల్ట్ స్టోరేజ్ కూడా అందించారు. 5జీ, వైఫై 7, బ్లూటూత్ వీ5.4, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, నావిక్, ఓటీజీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు, యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, కలర్ టెంపరేచర్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఈ-కంపాస్, గైరోస్కోప్, ఇన్‌ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్ కూడా ఉన్నాయి. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ద్వారా సెక్యూరిటీ ఆథెంటికేషన్ పొందవచ్చు. వివో ఎక్స్100 ప్రో బ్యాటరీ సామర్థ్యం 5400 ఎంఏహెచ్ కాగా, 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ కూడా ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ మందం 0.89 సెంటీమీటర్లు కాగా, బరువు 225 గ్రాములుగా ఉంది.

వివో ఎక్స్100 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Vivo X100 Specifications)
డిస్‌ప్లే, ప్రాసెసర్, సిమ్, సాఫ్ట్‌వేర్ ఫీచర్లు ప్రో మోడల్ తరహాలోనే ఉండనుండటం విశేషం. 16 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, వివో వీ2 చిప్‌లను ఇందులో చూడవచ్చు. ఈ ఫోన్‌లో వెనకవైపు మూడు కెమెరాల సెటప్ అందుబాటులో ఉంది. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్920 వీసీఎస్ బయోనిక్ సెన్సార్‌ అందించారు. దీంతోపాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 64 మెగాపిక్సెల్ జీస్ సూపర్ టెలిఫొటో కెమెరా కూడా ఉన్నాయి. దీని ముందువైపు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌గా వివో అందించింది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 512 జీబీ స్టోరేజ్‌ను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 120W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. వివో ఎక్స్100 మందం 0.85 సెంటీమీటర్లు కాగా, బరువు 202 గ్రాములుగా ఉంది.

Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!

Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!

టాప్ హెడ్ లైన్స్

CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
Vishwanath And Sons Story : సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
Vishwanath And Sons Story : సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
మారుతి గ్రాండ్ విటారా నుంచి బలెనో వరకు సూపర్‌ ఆఫర్లు - రూ.1.55 లక్షల వరకు డిస్కౌంట్
ఇప్పుడు మారుతి కారు కొనేవాళ్లు నక్క తోక తొక్కినట్లే, రూ.లక్షల్లో డిస్కౌంట్లు!
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
Embed widget