(Source: ECI/ABP News/ABP Majha)
WhatsApp: వాట్సాప్ మెసేజ్ లను సీక్రెట్ గా చూడాలి అనుకుంటున్నారా? అయితే ఈ టిప్స్ ఫాలోకండి..
మీ ఫ్రెండ్స్ వాట్సాప్ లో మెసేజ్ లు పంపిస్తున్నారా? వాటిని బ్లూటిక్ పడకుండా చూడాలి అనుకుంటున్నారా? అయితే కొన్ని టిప్స్ పాటిస్తే వాళ్లకు తెలియకుండానే చూసుకోవచ్చు.
సాధారణంగా వాట్సాప్ మెసేజ్‌లకు బ్లూ టిక్ ఉంటుంది. ఈ బ్లూ టిక్ అనేది.. మెసేజ్ పంపిన వారికి వారి మెసేజ్ చూశారో? లేదో? అని తెలియజేస్తుంది. బ్లూ టిక్ కనిపించకపోతే.. మెసేజ్ చదవనట్లుగా గుర్తు. బ్లూ టిక్ కనిపిస్తే మెసేజ్ చదివినట్లు అర్థం. అయితే, కొన్నిసార్లు మనం వాట్సాప్ మెసేజ్‌లను చదివామని.. పంపిన వారికి తెలియకుండా ఉండాలి అనుకుంటాం. అలా చేయడం ఇప్పుడు సాధ్యం అవుతుంది. ఇందుకోసం ఏ థర్డ్ పార్టీ యాప్ లు ఇన్ స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. వాట్సాప్ లోని సెట్టింగులను మార్చుకుంటే సరిపోతుంది. ఇంతకీ బ్లూ టిక్ కనిపించకుండా ఎదుటివారి మెసేజ్ లను ఎలా చదవాలో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. ఇందుకోసం ఏ సెట్టింగ్స్ చేయాలో చూద్దాం..
ఎదుటి వారు పంపిన మెసేజ్ లను వారికి తెలియకుండా చూసేందుకు ఓ ఈజీ ప్రాసెస్ ఉంది. మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడినా, iOS యూజర్లు అయినా ఈ ట్రిక్ లను ఫాలో అయితే చాలు. ఎదుటి వారు పంపిన మెసేజ్ లను వారికి తెలియకుండా చదవవచ్చు. ఆండ్రాయిడ్, iOS వినియోగదారులు ఈ సులభమైన ఉపాయాలతో రీడ్ రిసీట్ లను నిలిపి వేయవచ్చు. లేదంటే ఆఫ్ లైన్ లో చూడ్డం ద్వారా వారికి బ్లూ టిక్ కనిపించకుండా చేయవచ్చు. ఇందుకోసం Android ఫోన్ లేదంటే ఐ ఫోన్లలో ఇలా సెట్టింగ్స్ చేసుకోవాలి.
* ముందుగా మీ ఫోన్ లోవాట్సాప్ ఓపెన్ చేసి , స్క్రీన్ మీద కనిపించే మూడు చుక్కల మీద క్లిక్ చేయాలి.
* ఇప్పుడు, సెట్టింగ్స్ ఓపెన్ చేసి.. అకౌంట్ లోకి వెళ్లాలి.
* ఆ తర్వాత ప్రైవసీలోకి వెళ్లండి. రీడ్ రీసీట్ ఫీచర్ ను ఆఫ్ చేయండి. ఇంకేం అవతలి వారికి తెలియకుండా మెసేజ్ లను చూసుకోచ్చు.
WhatsApp సందేశాలను రహస్యంగా చదవడానికి మరికొన్ని మార్గాలు కూడా ఉన్నాయి. ఇంతకీ అవేంటో ఇప్పుడు చూద్దాం..
నోటిఫికేషన్ బార్ ద్వారా..
WhatsApp సందేశాలను రహస్యంగా చదవడానికి మరొక మార్గం.. నోటిఫికేషన్ బార్ ద్వారా మెసేజ్ లను చదవడం. మీకు వాట్సాప్ మెసేజ్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే.. నోటిఫికేషన్ బార్‌ని క్రిందికి లాగాలి. అలా చేయడం మూలంగా మెసేజ్ లను పూర్తి చదవచ్చు. ఎదుటి వారికి మీరు మెసేజ్ చదివినట్లు మాత్రం తెలియదు.
వాట్సాప్ పాప్-అప్‌ల ద్వారా..
*WhatsApp సెట్టింగ్ ని ఓపెన్ చేసి.. నోటిఫికేషన్ ను ఎంచుకోవాలి.
* పాప్-అప్ నోటిఫికేషన్ ఎంపికను ఆన్ చేయాలి.
*ఇప్పుడు మీరు పాప్-అప్‌ల ద్వారా వాట్సాప్ మెసేజ్ లను ఎదుటి వారికి తెలియకుండా చూసుకోవచ్చు.
*WhatsApp విడ్జెట్ ద్వారా..
విడ్జెట్ ద్వారా వాట్సాప్ సందేశాలను చదవడానికి.. దాన్ని మీ హోమ్ స్క్రీన్‌పైకి తీసుకురావాలి, యాప్ ను తెరవకుండానే అన్ని సందేశాలను చదివే అవకాశం ఉంటుంది. మొత్తంగా పై టిప్స్ ఫాలో కావడం మూలంగా మీకు తెలిసిన వారు పంపిన మెసేజ్ లను బ్లూ టిక్ పడకుండా చూసే వీలుంది.