అన్వేషించండి

Twitter on Data Leak: ఆ వార్తలన్నీ అవాస్తవాలే, వినియోగదారుల డేటా లీక్ వ్యవహారంపై ట్విట్టర్ వివరణ

200 మిలియన్ల మంది వినియోగదారుల డేటా లీక్ అయినట్లు వస్తున్న వార్తలను ట్విట్టర్ ఖండించింది. ఇది సిస్టమ్ లోపం కారణంగా జరగలేదని వెల్లడించింది.

తాజాగా ట్విట్టర్‌ కు చెందిన 20 కోట్ల మంది యూజర్ల డేటా లీకైనట్లు వార్తలు వచ్చాయి. యూజర్ల డేటాను సంపాదించిన హ్యాకర్లు, ఈ సమాచారాన్ని అమ్మేసినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. 20 కోట్ల మంది ట్విట్టర్ యూజర్ల డేటాను డార్క్ వెబ్ ద్వారా 2 లక్షల డాలర్లకు అమ్మినట్లు సైబర్ సెక్యూరిటీ సంస్థ క్లౌడ్ఎస్ఈకే ఇప్పటికే వెల్లడించింది. ట్విట్టర్ యూజర్లకు సంబంధించిన ఈమెయిల్ ఐడీస్, పేరు, స్క్రీన్ నేమ్, యూజర్ నేమ్, అకౌంట్ క్రియేట్ చేసుకున్న డేట్, ఫాలోవర్ల సంఖ్య సహా పలు వివరాలను హాకర్లు దొంగిలించినట్లు తెలిపింది.  8 హ్యాకర్ గ్రూప్స్ ఈ వివరాలను సేకరించి అమ్మినట్లు  ప్రకటించింది.

డేటా లీక్ వార్తలన్నీ అవాస్తవాలే!

తాజాగా యూజర్ల డేటా హ్యాక్ కు సంబంధించి ట్విట్టర్ స్పందించింది. 200 మిలియన్ల మంది వినియోగదారుల డేటాను ఆన్ లైన్ లో విక్రయించబడుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించింది. హ్యాక్ అయిన డేటా వివరాలు మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ ఫారమ్ కు సంబంధించిన సిస్టమ్‌లలోని బగ్ ఫలితంగా జరగలేదని ట్విట్టర్ తెలిపింది. "మీ గోప్యతను రక్షించడానికి మేము చాలా బాధ్యతగా వ్యవహరిస్తున్నాం. ట్విట్టర్ వినియోగదారుల డేటా ఆన్‌లైన్‌లో విక్రయించబడుతుందని ఇటీవలి మీడియా నివేదికలకు ప్రతిస్పందనగా, మేము సమగ్ర దర్యాప్తు చేశాం. ఇటీవల విక్రయించిన డేటా Twitter బగ్ కారణంగా జరిగినట్లు ఎటువంటి ఆధారాలు లేవు. మేం ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన  ఓ సంఘటన గురించి అప్ డేట్ ను కూడా అందుబాటులోకి తీసుకు రావాలి అనుకుంటున్నాం. ఇందుకోసం మేము తీసుకున్న చర్యలపై పారదర్శకతను అందించాలనుకుంటున్నాం" అని ట్విట్టర్ ఓ పోస్ట్‌ ద్వారా వెల్లడించింది.

ఎలన్ మస్క్ యాజమాన్యంలోని ట్విట్టర్ సంస్థ ప్రకారం.. ‘‘లీక్ అయిన డేటాతో వినియోగదారుల సమాచారం సరిపోలలేదు. అందుకే, సమస్య గురించి పరిశోధించేందుకు విశ్లేషణ జరుపుతున్నాం. ఆన్‌లైన్‌లో విక్రయించబడుతున్న డేటా Twitter సిస్టమ్‌ బగ్ ద్వారా పొందినట్లు ఎటువంటి ఆధారాలు లేవు. డేటా ఇప్పటికే ఆన్‌లైన్‌లో పబ్లిక్‌గా అందుబాటులో ఉన్న డేటా అయ్యి ఉండవచ్చు. డేటా లీక్ సంఘటనల గురించి వివరణను అందించడానికి మేం వివిధ దేశాల నుంచి డేటా సెక్యూరిటీ ఆఫీసర్స్, ఇతర సంబంధిత రెగ్యులేటర్‌లతో సంప్రదింపులు జరుపుతున్నాం’’ అని ట్విట్టర్ తెలిపింది.     

గత వారంలో వెలుగులోకి వచ్చిన డేటా లీక్ ఘటన

గత వారం ప్రారంభంలో, హ్యాకర్ వెబ్‌ సైట్ బ్రీచ్‌ ఫోరమ్స్‌ లో వందల మిలియన్ల మంది ట్విట్టర్ వినియోగదారుల ప్రాథమిక సమాచారం కలిగిన డేటా బేస్ ఓ అకౌంట్ ద్వారా పోస్టు చేశారు. StayMad అని పిలుచుకునే హ్యాకర్ Google CEO సుందర్ పిచాయ్, డోనాల్డ్ ట్రంప్ జూనియర్, SpaceX, CBS మీడియా, NBA, WHO  సహా 200 మిలియన్లకు పైగా వినియోగదారుల వ్యక్తిగత డేటాను లీక్ చేసినట్లు వెల్లడించాడు.

Read Also: రెండు గంటల పాటు పని చేయని ట్విట్టర్, మస్క్‌తో ఆటాడుకున్ననెటిజన్స్

టాప్ హెడ్ లైన్స్

Username Row: వాట్సాప్ తర్వాత యూజర్‌నేమ్ వివాదంలో సిగ్నల్, టెలిగ్రామ్‌లకు ఐటీ మంత్రిత్వ శాఖ నోటీసులు!
వాట్సాప్ తర్వాత యూజర్‌నేమ్ వివాదంలో సిగ్నల్, టెలిగ్రామ్‌లకు ఐటీ మంత్రిత్వ శాఖ నోటీసులు!
WhatsApp User ID:వాట్సాప్ యూజర్ ఐడీతో చిక్కుల్లో మెటా! నోటీసులు పంపేందుకు సిద్ధమవుతున్న కేంద్ర ప్రభుత్వం!
వాట్సాప్ యూజర్ ఐడీతో చిక్కుల్లో మెటా! నోటీసులు పంపేందుకు సిద్ధమవుతున్న కేంద్ర ప్రభుత్వం!
New WhatsApp Subscription Plan: వాట్సాప్‌లో సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్ కాస్ట్ ఎంత? దీని వల్ల యూజ్ ఏంటీ? ఏయే ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి?
వాట్సాప్‌లో సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్ కాస్ట్ ఎంత? దీని వల్ల యూజ్ ఏంటీ? ఏయే ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి?
WhatsApp Hacks:వాట్సాప్‌లో పంపిన ఫోటోలు బ్లర్ అవుతున్నాయా? క్వాలిటీ పెంచే చిట్కాలు ఇవే! 
వాట్సాప్‌లో పంపిన ఫోటోలు బ్లర్ అవుతున్నాయా? క్వాలిటీ పెంచే చిట్కాలు ఇవే! 

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jupally Krishna Rao: ప్లేస్ ఫిక్స్, సాయంత్రం 5 గంటలకు రండి.. నిజాలేంటో తేల్చేద్దాం: బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి సవాల్
ప్లేస్ ఫిక్స్, సాయంత్రం 5 గంటలకు రండి.. నిజాలేంటో తేల్చేద్దాం: బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి సవాల్
Modi Cabinet Reshuffle: పార్లమెంట్‌కు ముందే మోదీ క్యాబినెట్ రీసెట్.. రాజ్యాంగ సవరణల వేళ అసలు వ్యూహం ఇదే!
పార్లమెంట్‌కు ముందే మోదీ క్యాబినెట్ రీసెట్.. రాజ్యాంగ సవరణల వేళ అసలు వ్యూహం ఇదే!
JSW Rayalaseema Steel Plant: కడప స్టీలు ప్లాంటు నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన.. దేశంలోనే తొలి గ్రీన్‌ స్టీల్‌ ప్లాంట్
కడప స్టీలు ప్లాంటు నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన.. దేశంలోనే తొలి గ్రీన్‌ స్టీల్‌ ప్లాంట్ విశేషాలు
Sai Krishna Case: సాయికృష్ణ కేసులో నేను నిర్దోషిని, నన్ను ఇరికించాలని చూస్తున్నారు - సీఐ నాగరాజు లేఖ వైరల్
Sai Krishna Case: సాయికృష్ణ కేసులో నేను నిర్దోషిని, నన్ను ఇరికించాలని చూస్తున్నారు - సీఐ నాగరాజు లేఖ వైరల్
Nara Lokesh: మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు మంత్రి నారా లోకేష్ భూమి పూజ
మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు మంత్రి నారా లోకేష్ భూమి పూజ
Tata Sierra EVని ఏ ప్రాతిపదికన కొంటారు? - ఇలా సింపుల్‌గా కంపేర్‌ చేస్తే మీకో క్లారిటీ వస్తుంది!
Tata Sierra EV వర్సెస్‌ 5 ప్రత్యర్థి మోడళ్లు - ఈ టేబుల్స్‌ చూస్తే బెస్ట్ EV ఏదో ఈజీగా అర్ధమవుతుంది!
Telangana Food Safety Raids: సోదాల జోరు సరే.. హోటళ్లు దారికి వచ్చే పక్కా యాక్షన్ ప్లాన్ ఏది?
సోదాల జోరు సరే.. హోటళ్లు దారికి వచ్చే పక్కా యాక్షన్ ప్లాన్ ఏది?
Tata Sierra EV vs Curvv EV: ఎక్కువ రేంజ్‌, కంఫర్ట్, మంచి స్పేస్‌ కోసం ఏ EV కొనాలి?
రూ.20 లక్షల బడ్జెట్‌లో Tata Sierra EV లేదా Curvv EV - ఏది బెస్ట్ ఛాయిస్?
Embed widget