Xiaomi New TV: ఈ టీవీ ఇంట్లో ఉంటే థియేటర్‌కి వెళ్లక్కర్లేదుగా - అదిరిపోయే ఎక్స్‌పీరియన్స్!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ తన కొత్త స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది. అదే షియోమీ టీవీ ఈఎస్ ప్రో.
షియోమీ టీవీ ఈఎస్ ప్రో 86 అంగుళాల టీవీ లాంచ్ అయింది. షియోమీ లాంచ్ చేసిన లేటెస్ట్ ప్రీమియం స్మార్ట్ టీవీ ఇదే. ఏకంగా 1000 నిట్స్ బ్రైట్‌నెస్‌ను ఈ టీవీ అందించనుంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. గేమర్ల కోసం ఆటో లో లేటెన్సీ మోడ్ టెక్నాలజీ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉండటం విశేషం.
షియోమీ టీవీ ఈఎస్ ప్రో 86 అంగుళాల టీవీ ధర
షియోమీ టీవీ ఈఎస్ ప్రో 86 అంగుళాల టీవీ ధరను 8,499 యువాన్లుగా (సుమారు రూ.98,900) నిర్ణయించారు. చైనాలో దీని ప్రీ-బుకింగ్స్ మే 31వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. మనదేశంలో ఈ టీవీ ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు.
షియోమీ టీవీ ఈఎస్ ప్రో 86 అంగుళాల టీవీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఈ స్మార్ట్ టీవీ ఎంఐయూఐ టీవీ ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. ఈ టీవీలో 86 అంగుళాల 4కే ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 3,840x2,160 పిక్సెల్స్‌గా ఉంది. 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్, 120 హెర్ట్జ్ ఎంఈఎంసీ మోషన్ కాంపన్సేషన్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇది డాల్బీ విజన్‌ను సపోర్ట్ చేయనుంది. 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కూడా ఈ టీవీలో అందించారు. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.
ఒక హెచ్‌డీఎంఐ 2.1, రెండు హెచ్‌డీఎంఐ 2.0, రెండు యూఎస్‌బీ పోర్టులు, ఏవీఐ ఇన్‌పుట్, ఎస్/పీడీఐఎఫ్ ఇంటర్‌ఫేస్, ఎథర్‌నెట్ పోర్టుల ద్వారా ఈ స్మార్ట్ టీవీని ఇతర డివైసెస్‌కు, ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయవచ్చు. డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.0 ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
30W సౌండ్ అవుట్‌పుట్‌ను అందించే ఎనిమిది స్పీకర్ యూనిట్లు ఇందులో ఉండనున్నాయి. వీటిలో రెండు పాసివ్ డ్రైవర్లు కాగా... మిగతావన్నీ యాక్టివ్ డ్రైవర్లే. డాల్బీ అట్మాస్, డీటీఎస్-హెచ్‌డీ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. స్టాండ్‌తో కలిపితే దీని బరువు 43.6 కేజీలుగా ఉంది.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!
View this post on Instagram