Xiaomi Smart TV 5A Pro: డాల్బీ ఆడియో, డీటీఎస్ ఫీచర్లతో షావోమీ కొత్త టీవీ - ధర రూ.17 వేలలోపే!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షావోమీ కొత్త 32 అంగుళాల టీవీని మనదేశంలో లాంచ్ చేసింది.
షావోమీ స్మార్ట్ టీవీ 5ఏ ప్రో 32 అంగుళాల మోడల్ మనదేశంలో మంగళవారం లాంచ్ అయింది. కంపెనీ లాంచ్ చేసిన లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ టీవీ ఇదే. గతేడాది ఏప్రిల్‌లో లాంచ్ అయిన షావోమీ స్మార్ట్ టీవీ 5ఏకి అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా ఈ టీవీ లాంచ్ అయింది. ఆండ్రాయిడ్ టీవీ 11 ఆధారిత ప్యాచ్‌వాల్ 4 ఆపరేటింగ్ సిస్టంపై ఈ టీవీ పనిచేయనుంది. డాల్బీ ఆడియో సపోర్ట్, డీటీఎస్-ఎక్స్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. హెచ్‌డీ రెడీ డిస్‌ప్లేను ఇందులో అందించారు.
షావోమీ స్మార్ట్ టీవీ 5ఏ ప్రో ధర
దీని ధరను మనదేశంలో రూ.16,999గా నిర్ణయించారు. ఈ కొత్త మోడల్ సేల్ మనదేశంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఎంఐ.కాం, ఎంఐ హోం స్టోర్స్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో జరగనుంది. బ్లాక్ కలర్ ఆప్షన్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,500 తగ్గింపు లభించనుంది.
షావోమీ స్మార్ట్ టీవీ 5ఏ ప్రో స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ టీవీ 11 ఆధారిత ప్యాచ్‌వాల్ 4 ఆపరేటింగ్ సిస్టంపై ఈ స్మార్ట్ టీవీ పనిచేయనుంది. రెండు హెచ్‌డీఎంఐ 2.0 పోర్టులు, రెండు యూఎస్‌బీ పోర్టులు ఇందులో ఉన్నాయి. అలాగే ఏవీఐ ఇన్‌పుట్, 3.5 ఎంఎం ఆడియో జాక్, ఎథర్‌నెట్ పోర్టు కూడా అందించారు. డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.0 కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి.
క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌పై ఈ టీవీ పనిచేయనుంది. ఏవీఐ ఇన్‌పుట్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, ఎథర్‌నెట్ పోర్టులు ఇందులో ఉన్నాయి. డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.0 కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ టీవీలో రెండు స్పీకర్లు అందించారు. 24W ఆడియో అవుట్‌పుట్‌ను ఈ టీవీ డెలివర్ చేయనుంది. డాల్బీ ఆడియో సపోర్ట్ కూడా అందించారు.
షావోమీ ఇటీవలే తన ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ మిక్స్ ఫోల్డ్ 2ను చైనాలో లాంచ్ చేసింది. ఇందులో ప్రారంభ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 8,999 యువాన్లుగా (సుమారు రూ.1,06,200) ఉంది. 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 9,999 యువాన్లుగానూ (సుమారు రూ.1,18,000), 12 జీబీ ర్యామ్ + 1 టీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 11,999 యువాన్లుగానూ (సుమారు రూ.1,41,600) నిర్ణయించారు.
ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ ఫోల్డ్ 13 ఆపరేటింగ్ సిస్టంపై షావోమీ కొత్త ఫోల్డబుల్ ఫోన్ పనిచేయనుంది. 8.02 అంగుళాల ఎల్టీపీవో 2.0 ఫోల్డింగ్ డిస్‌ప్లేను ప్రధాన స్క్రీన్‌గా అందించారు. బయటవైపు డిస్‌ప్లేగా 6.56 అంగుళాల ఈ5 అమోఎల్ఈడీ స్క్రీన్ ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ కూడా ఇందులో అందించారు.
ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై షావోమీ మిక్స్ ఫోల్డ్ 2 పనిచేయనుంది. ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్, 13 మెగాపిక్సెల్ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. ముందువైపు 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందించారు. ఈ ఫోన్ బరువు 262 గ్రాములుగా ఉంది.
Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!
Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!