By: ABP Desam | Updated at : 11 May 2022 11:05 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
సోనీ కొత్త టీవీ మనదేశంలో లాంచ్ అయింది. (Image Credits: Sony)
సోనీ మనదేశంలో కొత్త బడ్జెట్ స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది. అదే సోనీ బ్రేవియా 32W830K గూగుల్ టీవీ. దీని స్క్రీన్ సైజు 32 అంగుళాలుగా ఉంది. ఇది ఒక హెచ్‌డీ రెడీ టెలివిజన్. హెచ్‌డీఆర్10, హెచ్ఎల్‌జీ ఫార్మాట్లను ఇది సపోర్ట్ చేయనుంది.
సోనీ బ్రేవియా 32W830K గూగుల్ టీవీ ధర
ఈ టీవీ ధరను మనదేశంలో రూ.28,999గా నిర్ణయించారు. అన్ని సోనీ సెంటర్లు, ప్రముఖ ఎలక్ట్రానిక్ స్టోర్లు, ఈ-కామర్స్ పోర్టళ్లలో ఈ టీవీని కొనుగోలు చేయవచ్చు. దీనికి సంబంధించిన సేల్ కూడా మనదేశంలో ఈపాటికే ప్రారంభం అయింది.
సోనీ బ్రేవియా 32W830K గూగుల్ టీవీ ఫీచర్లు
ఇందులో 32 అంగుళాల హెచ్‌డీ రెడీ ఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. హెచ్‌డీఆర్, హెచ్ఎల్‌జీ ఫార్మాట్లను ఇది సపోర్ట్ చేయనుంది. దీని డిస్‌ప్లే ప్యానెల్ రిజల్యూషన్ 1368×768 పిక్సెల్స్‌గానూ, రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గానూ ఉంది.
ఆండ్రాయిడ్ టీవీ ప్లాట్‌ఫాంపై ఈ కొత్త టీవీ పనిచేయనుంది. గూగుల్ టీవీ, ఓకే గూగుల్ వాయిస్ సెర్చ్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా దీంతోపాటు అందించనున్నారు. వాయిస్ రిమోట్ ద్వారా దీన్ని కంట్రోల్ చేయవచ్చు. ఇంటిగ్రేటెడ్ క్రోమ్ కాస్ట్, యాపిల్ హోం కిట్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
20W స్టీరియో స్పీకర్లను ఈ టీవీలో అందించారు. డాల్బీ ఆడియో, క్లియర్ ఫేజ్ ఫీచర్లు కూడా సోనీ అందించింది. ఎక్స్-ప్రొటెక్షన్ ప్రో టెక్నాలజీని కూడా ఉంది. డస్ట్ అండ్ హ్యుమిడిటీ ప్రొటెక్షన్ ఈ టీవీలో ఉండటం విశేషం. ఇందులో మూడు హెచ్‌డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్‌బీ పోర్టులు, ఒక ఎథర్‌నెట్ పోర్టు, రెండు ఆడియో ఇన్‌పుట్స్, డిజిటల్ ఆర్క్ పోర్టు, బ్లూటూత్ 5, వైఫై కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి.
Xiaomi New TV: ఈ టీవీ ఇంట్లో ఉంటే థియేటర్‌కి వెళ్లక్కర్లేదుగా - అదిరిపోయే ఎక్స్పీరియన్స్!
Xiaomi Smart TV 5A: రూ.16 వేలలోపే అదిరిపోయే స్మార్ట్ టీవీ - లేటెస్ట్ ఫీచర్లు, సూపర్ డిస్‌ప్లే - నాలుగు టీవీలు లాంచ్ చేసిన షియోమీ!
Samsung Neo QLED TV Series: సూపర్ అనిపించే ప్రీమియం టీవీలు లాంచ్ చేసిన శాంసంగ్ - ఏకంగా 8కే రిజల్యూషన్‌తో!
Netflix: నెట్‌ఫ్లిక్స్‌లో సరికొత్త పీచర్- నచ్చిన సినిమా, సిరీస్‌లకు కొత్త రేటింగ్ సిస్టమ్
Top Smart TVs For Binge Watchers: ఓటీటీలు ఎక్కువ స్ట్రీమ్ చేస్తారా - అయితే మీకు బెస్ట్ టీవీలు ఇవే!
Bandi Sanjay : కేంద్రాన్ని బదనాం చేస్తున్న కేసీఆర్ సర్కార్ ను కడిగేయండి, పార్టీ నేతలకు బండి సంజయ్ దిశానిర్దేశం
Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?
TS Police Jobs : తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు భారీ స్పందన, 17 వేల పోస్టులకు 12.91 లక్షల అప్లికేషన్లు
Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!